కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 5/8 పేజీలు 22-25
  • బార్సిలోనా ఒలంపిక్స్‌—ఘనతకు విలువేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బార్సిలోనా ఒలంపిక్స్‌—ఘనతకు విలువేమిటి?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అంకితభావం—ఒలంపిక్‌ ఘనతకు కీలకం
  • ఒలంపిక్‌ వెలుగు జిలుగులు
  • ఘనతకొరకు మత్తుపదార్థాలను వాడుట
  • నిత్యమూ నిలిచే ఘనత
  • నార్వే ఒలింపిక్‌ ఆటలు—ఆదర్శాలు మాత్రమే చాలా?
    తేజరిల్లు!—1994
  • ఒలింపిక్‌ పోటీలు మనుషుల్ని నిజంగా ఐక్యం చేస్తాయంటారా?—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • “నీకు నీవే సాధకము చేసికొనుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
తేజరిల్లు!—1993
g93 5/8 పేజీలు 22-25

బార్సిలోనా ఒలంపిక్స్‌—ఘనతకు విలువేమిటి?

స్పెయిన్‌లోని అవేక్‌! ప్రతినిధి ద్వారా

జూలై 25, 1992న, దేదీప్యమానమైన వెలుగు మధ్యలోనున్న ఒక విలుకాడు, తన ధనుస్సు సంధించి వదిలాడు. కొనకు నిప్పంటించి ఉన్న అతని బాణం తిన్నగా పైకిలేచి ఆ రాత్రివేళ ఆకాశంలోకి దూసుకుపోయింది. ఆ బాణం క్రిందకు దిగివస్తూ విశాలమైన స్టేడియం పైన ఉంచబడిన అతిపెద్ద దివిటీని తాకుతూ వెళ్లింది. ఒలంపిక్‌ జ్యోతి వెలిగింది. బార్సిలోనా ఒలంపిక్స్‌ మొదలయ్యాయి.

పదకొండు వేలమంది క్రీడాకారులు 1,691 ఒలంపిక్‌ పతకాలకై పోటీపడటానికి 172 దేశాలనుండి వచ్చారు. ఒలంపిక్‌ ఆదర్శానికి అనుగుణంగా, అందులో పాల్గొను వారు మునుపటికన్నా “వేగంగా పరుగెత్తడానికి, ఎత్తుగా ఎదగడానికి, దారుఢ్యం నిరూపించుకోడానికి” ప్రయత్నించారు—కొందరు విజయంపొందారు. ఇంచుమించు 350,00,00,000 మంది దూరదర్శని ప్రేక్షకులు ఈ జయాపజయాలను పంచుకున్నారు.

క్రీడాకారులు కొద్దికాలమే ప్రజల ప్రసంశలందుకున్నను, ఒలంపిక్‌ విజయం బహుశా ఘనతను ధనాన్ని తేవచ్చును. అందుకు బార్సిలోనా ఒలంపిక్స్‌ ఏమాత్రం భిన్నంగా లేవు. కొందరు ప్రఖ్యాత పోటీదారులు క్రీడావస్త్రాలను, పరుగు పందెం జోళ్లను, కళ్లద్దాలను, మరియు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను సహితం ఆమోదించుట ద్వారా ఇప్పటికే లక్షల డాలర్లు గడిస్తూ ఉండిరి.

అంకితభావం—ఒలంపిక్‌ ఘనతకు కీలకం

అనేక మంది క్రీడాకారులు—ప్రాముఖ్యంగా జిమ్‌నాస్ట్‌లు మరియు ఈతగాళ్లు—తమ నైపుణ్యాలను ఎంతో సులభంగా ప్రదర్శించినట్లు అనిపించినా, ఆ చురుకుదనం వెనుక సంవత్సరాల తరబడి చేసిన ప్రయాసంతోకూడిన శిక్షణ దాగివుంది. కొందరు తాము ఐదు సంవత్సరాల వయసులో వున్నప్పటినుండే శిక్షణ పొందుతున్నారు. ఒక క్రీడాకారుడు విజయం పొందనపేక్షిస్తే క్రీడలు అతని జీవితంలో అగ్రస్థానమందుండాలి.

స్పానిష్‌దేశ ఈతగాడైన మార్టెన్‌ లొపెజ్‌ సుబారొ, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో గెలిచాడు—బహుశా కొంత అతిశయోక్తిగానే అతనిలా చెప్పాడు: “నేను నా జీవితంలో మూడోవంతు నీళ్లలోనే గడిపేశాను.” అతని శిక్షణా కార్యక్రమం ఉదయం ఐదు గంటలకు ప్రారంభమౌతుంది, తను కేవలం ఒక సంవత్సరంలోనే 8,000 కిలోమీటర్లు ఈదినట్లు అతను అంచనా వేశాడు.

శిక్షణ అంటే త్యజించుకోవడమే కాదుగానీ, బాధననుభవించడం కూడా. సియోల్‌ మరియు బార్సిలోనాలో హెప్టత్లాన్‌లో స్వర్ణపతకం పొందిన జాకీ జాయ్‌నర్‌ కెర్సీ ఇలా వివరిస్తుంది: “పోటీపడటం ఆకర్షణీయంగా ఉంటుంది. కాని శిక్షణ అలా కాదు. . . . ఏ క్రీడాకారున్నైనా అడగండి: మేమందరము చాలాసార్లు గాయపడతాము. నేను నా శరీరాన్ని ఏడు వేర్వేరు శ్రమలనెదుర్కోవాలని అడుగుతున్నాను. నా శరీరానికి నొప్పి కలగకూడదని నేను అనుకొనడం విపరీతంగా ఉంటుంది.” ప్రాముఖ్యంగా జిమినాస్ట్‌లు సహనశీలురైయుండాలి. మణికట్లు లేక మడిమలు బెణకడంవల్ల, కండరాలు నరాల సంధిబంధనాలు సాగిపోవడంవల్లను, ఒత్తిడివల్ల సన్నటెముకలు విరగడంవల్ల నొప్పి కలిగినా దినానికి రెండుసార్లుండే వారి శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందే. కాని చివరి పరిశీలనల్లో, ఆ విధమైన అంకితభావమే విజేతలకు వినోదాన్నిస్తుంది.

ఒలంపిక్‌ వెలుగు జిలుగులు

దాని విషయంలో సందేహం లేదు, ఒలంపిక్‌ దృశ్యమే అమోఘంగా ఉండగలదు. అది ప్రేక్షకులను ఉద్వేగపరిచే సన్నివేశాలను కల్పించగలదు, అది గణనీయమైన క్రీడాప్రతిభలకు ప్రదర్శనాస్థలం. అందుకు బార్సిలోనా ఏమాత్రం భిన్నంగా లేదు.

బెలోరష్యా నుండి వచ్చిన జిమ్‌నాస్ట్‌ విటేల్‌ ష్కెర్‌బొ పురుషుల జిమినాస్టిక్స్‌లోని ఎనిమిదింటిలో రికార్డు సృష్టిస్తూ ఆరు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. చైనా జిమ్‌నాస్ట్‌ షావోసాహవన్‌ లీ ఫ్లోర్‌ఎక్సర్‌సైజ్‌లలో తలక్రిందులుగా ఉత్తేజభరితంగా మూడుసార్లు ఎగిరాడు. కార్ల్‌ లూయిస్‌ లాంగ్‌జంప్‌లో వరుసగా మూడుసార్లు విజయం సాధించి ఒలంపిక్‌ చరిత్ర సృష్టించాడు. ఇంకోవైపు, మహిళల మారథాన్‌లో వెండి పతకం గెలుచుకున్న జపానీయురాలైన యుకో ఒరీమోరీ, తనపై గౌరవంతో ప్రజలు చేసిన కరతాళ ధ్వనిని స్వీకరించింది. తాను అంతగా అలసిపోయి ఉన్నా, స్టేడియం చుట్టూ తిరిగి ప్రజలకు, ఆ తరువాత విజేతకు జపాను పద్ధతిలో వందనం చేసింది.

ఒలంపిక్స్‌ వల్ల కలిగే వ్యాపార లాభాలను వివిధదేశాల వ్యాపారసంస్థలు మర్చిపోలేదు. వారు ఒలంపిక్‌ ఘనతలో పాలుపంచుకోనడానికి అమిత వ్యయం చేసి ఆటలను లేక జాతీయ ఒలంపిక్‌ జట్లను స్పాన్సర్‌ చేస్తున్నారు.

ఘనతకొరకు మత్తుపదార్థాలను వాడుట

నిరంతర శిక్షణ, సహజ నైపుణ్యత—ప్రాముఖ్యమైనవైనను—ఒలంపిక్‌ విజయానికి అవి మాత్రమే కీలకాలు కావు. ప్రయోజనంకొరకే చాలామంది క్రీడాకారులు మాదకద్రవ్యాలపై ఆధారపడుతున్నారు. అవి కండరాలను బలపరచడానికి (ప్రాముఖ్యంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ మరియు పరుగుపందాలకై ప్రసిద్ధిగాంచిన) అనబాలిక్‌ స్టీరాయిడ్స్‌ లేక శరీరపెరుగుదల హార్మోన్‌లు; గుండె వేగాన్ని తగ్గించటానికి (విలువిద్య మరియు తుపాకీవిద్యల్లో మంచి ఫలితాలను పొందడానికి) బెటా బ్లాకర్స్‌; లేక ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచటానికి (సైకిలింగ్‌ మరియు లాంగ్‌ డిస్టెన్స్‌ పరుగుకు ఉపయోగకరమైన) ఎరిత్రోపాయిటన్‌ వంటి మాదకద్రవ్యాలు కావచ్చును.

క్రీడాకారులకు వాటి అపాయాల గురించి తెలిసినా, మాదకద్రవ్యాలను ఉపయోగించాలన్న ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. బిర్జిట్‌ డ్రెసెల్‌, 20 వేర్వేరు మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల 1987లో చనిపోయిన జట్టులోని జర్మన్‌ క్రీడాకారిణి గేబి బుష్‌మన్‌ ఇలా వివరిస్తుంది: “ఆటల్లో కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాదకద్రవ్యాలు లేకుండా ఒలంపిక్స్‌కు సరితూగడం కష్టతరమౌతుంది.”

చాలా వరకు క్రీడాకారుల కోచ్‌లు కృత్రిమతను ఆమోదిస్తారు; దాన్ని ప్రతిపాదించిన వాళ్లు కూడా వీరే కావచ్చు. పూర్వపు తూర్పు జర్మనీ కోచ్‌ అయిన విన్‌ప్రైట్‌ హినీకే ఇలా ఒప్పుకుంటున్నాడు: “నీవు ఒలంపిక్స్‌లో పాల్గొనాలంటే, ఇది తప్పక చేయాలని నేను వారికి చెప్పేవాడిని.” స్పష్టంగా, చాలామంది పోటీదారులు యథార్థతకంటే విజయాన్నే ఎక్కువ విలువైందిగా ఎంచుతారు—తమ ఆరోగ్యంకన్నా ఎక్కువగా. వారిలో 52 శాతంమంది ఆ గొప్పస్థానంలో అది వారిని సుప్రసిద్ధమైన ఐదు వైభవోపేత సంవత్సరాల తరువాత చంపినను వారిని విజేతలనుగా మార్చునని అభయమిచ్చే ఊహా ప్రతిజ్ఞాకరమైన మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్నారని ప్రఖ్యాత క్రీడాకారులపై ఈ మధ్యే జరిపిన పరిశోధనలో వెల్లడైంది.

బ్రిటీష్‌ స్ప్రింటర్‌ జేసన్‌ లివింగ్‌స్టన్‌ రసాయనిక ఉత్ప్రేరకాలను ఉపయోగించినట్లు పరీక్షలలో తేలినందువలన అవమానకరంగా బార్సిలోనానుండి ఇంటికి పంపబడ్డాడు. 400 మీటర్లలో ప్రపంచ చరిత్ర సృష్టించిన, అమెరికా దేశీయుడు, హెరీ రెనాల్డ్‌ ఆటలలో పాల్గొననేలేదు. అతడు 1990లో మాదకద్రవ్యాలు ఉపయోగించినట్లు పరీక్షలో తేలినందున రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు, దానివల్ల అతను ఒలంపిక్‌ పతకంతోపాటు స్పాన్సర్‌షిప్‌ అవకాశాలు పోగొట్టుకొని పది లక్షల డాలర్లు నష్టపోయాడు.

మాదకద్రవ్యాలను ఉపయోగించే చాలామంది పట్టుబడరు. బార్సిలోనా ఆటల సమయంలో జరిపిన ఇంచుమించు 2,000 మాదకద్రవ్యాల పరీక్షల్లో అపనమ్మకస్తులైన క్రీడాకారులు మూత్ర పరీక్షలలో తెలియకుండా వుండే మాదకద్రవ్యాలను ఎన్నుకొనడం వల్ల వారు బయటపడలేదు. “విజయం మరియు ధనం కొరకైన ఆశ, మోసాన్ని నీతినిజాయితీని గుర్తుపట్టడం కష్టతరమయ్యే చీకటిలోకాన్ని బయల్పరచిందని,” ఎల్‌ పెయిస్‌ అను స్పానిష్‌ దినపత్రిక వ్యాఖ్యానించింది.

చాలామంది పతకాలను గెలిచారనుకోండి, అయితే మాదకద్రవ్యాల వల్ల కాదుగాని, కేవలం ఏండ్లతరబడి చేసిన స్వయంత్యాగం వల్ల గెలుపొందారు. ఆ త్యాగాలు యోగ్యమైనవేనా?

నిత్యమూ నిలిచే ఘనత

మహిళల 100 మీటర్ల పరుగుపందెంలో ఆశ్చర్యకరంగా గెలిచిన గేల్‌ డెవర్జ్‌, తన విజయం తరువాత అమితానందపడింది. “కలలు నిజమౌతాయని ఒకవేళ ఎవరైనా నమ్మితే, అది నేనే,” అని ఆమె అన్నది. రెండు సంవత్సరాలైనా గడవక ముందే ఆమె నడవలేకపోయింది, ఆమెకున్న థైరాయిడ్‌ వ్యాధి చికిత్స మూలంగా వచ్చిన చిక్కుల నిమిత్తం ఆమె రెండుకాళ్లు తీసివేయాలని ఆలోచిస్తున్నట్లు వినికిడి వచ్చింది. ఈతపోటీలో పాల్గొనడం మాని, ఒలంపిక్‌కు ఒక సంవత్సరం ముందు మళ్లీ ఈత శిక్షణ ప్రారంభించిన, పాబ్లో మొరెల్స్‌ 100 మీటర్ల బట్టర్‌ప్లైలో స్వర్ణపతకం సాధించుకుని, యిలా ఏకీభవించాడు. “ఆఖరుకు నా సమయం వచ్చింది, కల నిజమైంది,” అని అతను అన్నాడు.

నిశ్చయంగా, చాలామంది క్రీడాకారులు విజేతలవ్వలేరు. “ఒలంపిక్స్‌లో గెలవడమే కాదుకాని పాల్గొనడం ప్రాముఖ్యమని” కొందరు భావిస్తారు. అది నిజమే, కాని గెలవడమే ముఖ్యమనుకొన్న ఇతర క్రీడాకారులు, స్వప్నాలు చెదరి ఇంటికి తిరిగి వెళ్లారు. వెయిట్‌ లిఫ్టర్‌ ఇబ్రాజిమ్‌ సమాడోఫ్‌ స్వర్ణపతకంపై ఆశ నిలుపుకున్నాడు—కాని యీ క్రీడలో అతను మూడవవాడు. “ఒక స్వర్ణపతకంతో, నేను నా జీవితానికి దారిచూపించే వాన్ని, భవిష్యత్తు కొరకు చదువుకునేవాన్ని, నా కుటుంబానికి సహాయపడే వాన్ని. నాకిప్పుడు ఏమి చేయాలో తెలియదు,” అని అతను నిట్టూరుస్తున్నాడు. విజేతలు కూడా తమ ప్రజ్ఞాపాటవం క్షీణిస్తుంటే మానసికంగా కలతచెందుతూ ఉంటారు.

పూర్వపు సోవియట్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి అన్నా డిమెట్రైవా ఇలా అంది: “[సోవియట్‌] ఆటలసమాఖ్య ప్రజలను పరిగణించదు. ‘నీవు వెళ్లిపో నీలాంటి వాళ్లను 10 మందిని మేము కనుగొంటాము’ అని వాళ్లనుకున్నారు.” అలాగే, 1964లో, టోక్యోలో రెండు స్వర్ణపతకాలు పొందిన హెన్రీ కార్‌ ఇలా ఒప్పకొంటున్నాడు: “ఒకడు ఎంత అత్యుత్తముడైనా, అది ఒక మోసపూరితమే. ఎందుకు? ఎందుకంటే ఆ స్థానం ఎప్పటికీ నిలవదు, నిజమైన తృప్తినివ్వదు. త్వరగా వేరే తారలు వచ్చేస్తారు మరియు మునుపటి వారు సాధారణంగా మరువబడతారు.”

పరుగులు తీస్తున్న ఒలంపిక్‌ ఘనతను, తనను సేవించే వారికి దేవుడు వాగ్దానం చేస్తున్న నిత్యజీవమను బహుమానాలతో పోల్చలేము. ఈ బహుమానం క్రీడాకారుల శిక్షణను కాదుగాని ఆత్మీయ శిక్షణను కోరుతుంది. అందుకే పౌలు తిమోతికిలా వ్రాశాడు: “శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.”—1 తిమోతి 4:8.

ఒలంపిక్‌ ఆటలు, శారీరక శిక్షణను సాధకంజేస్తాయి. ఆ శిక్షణ ఎంత మంచిదైనను తాత్కాలికమైనదే. అది అంకితభావం మరియు స్వయంత్యాగం వలన క్రీడాకారులేమి సాధించగలరో ప్రపంచానికి చూపిస్తుంది. క్రైస్తవ పందెంలో గెలవడానికి కూడా ఈ లక్షణాలు అవసరం. ఈ పందెం ఏ ఒలంపిక్‌ క్రీడకన్నా భిన్నంగా తుదముట్టించిన వారికి నిరంతర లాభాలను తెస్తుంది. కాబట్టి, క్రైస్తవులు క్రీడాకారులను కాక, తమను తాము ‘పూర్ణులనుగా చేసికొని’ ‘పందెములో ఓపికతో పరుగెత్తుటకు’ యేసు క్రీస్తును అనుకరించడం మంచిది.—1 పేతురు 5:10; హెబ్రీయులు 12:1.

[23వ పేజీలోని చిత్రాలు]

ఒలంపిక్స్‌లో డైవర్లు పోటీపడుతున్నారు. వెనుకభాగంలో బార్సిలోనా

[క్రెడిట్‌ లైను]

Photos: Sipa Sport

ఫోటోలు: సిపా స్పోర్ట్‌

[24వ పేజీలోని చిత్రం]

సమాంతర బార్స్‌పై పోటీపడడం

[క్రెడిట్‌ లైను]

Photo: Sipa Sport

ఫోటోలు: సిపా స్పోర్ట్‌

[25వ పేజీలోని చిత్రం]

వంద మీటర్ల ఫైనల్‌లో, ఆ చివర కుడివైపు చివర్న ఉన్న రన్నర్‌ స్వర్ణపతకం కైవసం చేసుకుంది

[క్రెడిట్‌ లైను]

Photo: Sipa Sport

ఫోటోలు: సిపా స్పోర్ట్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి