కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 5/8 పేజీలు 20-21
  • నారి కురుపు—దాని చివరిదినాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నారి కురుపు—దాని చివరిదినాలు
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అపాయకరమైన నారికురుపు
  • ఒక పెద్ద చరిత్ర
  • చికిత్స
  • నారి కురుపును అరికట్టుట
  • మా పరిచర్యను నెరవేర్చాలనే దృఢనిశ్చయాన్ని కనబరిచాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
తేజరిల్లు!—1993
g93 5/8 పేజీలు 20-21

నారి కురుపు—దాని చివరిదినాలు

నైజీరియాలోని అవేక్‌! ప్రతినిధి

ప్రతిరోజు మాదిరిగానే, ఈరోజు కూడా వేడిగా ఉంది, చినియర్‌ తన పాపను తన వెనుక కట్టుకొని, రెండు ఎండిపోయిన సొరకాయబుర్రలు తీసుకొని, దుమ్ముతోనిండిన రోడ్డుమీద ఇతర గ్రామస్థులతో పాటు వెళ్తోంది. మండుటెండలో త్వరగా వారు నడుస్తూ పొలములు దాటి చిన్న నీటిగుంటల యొద్దకు వెళ్తారు, ఆ ప్రాంతములో నీటికి అదొక్కటే ఆధారము. పాకుడు పట్టిన మట్టిదిబ్బలను దాటి జాగ్రత్తగా బురదలో దిగి మోకాళ్ల లోతు వెళ్లి ఆ సరస్సులోని నీళ్లు తెస్తుంది.

సరస్సు అడుగుభాగాన ఎండిన గడ్డిపరకల మధ్య మొసళ్లు తిరగడాన్ని ఆమె గుర్తిస్తుంది, కాని ఆమె వాటికి భయపడలేదు. సరస్సు సమీపంలో ఉన్న ఒక వ్యక్తి యిలా చెపుతున్నాడు: “మేము వాటినేమి చెయ్యం, అవి మమ్మల్ని ఏమి చేయవు.”

నిజంగా సరస్సులో జీవించే కొన్ని ఇతర ప్రాణులనుగూర్చి అలా చెప్పలేము. చినియర్‌ వాటిని చూడలేదు, అవి చాలా చిన్నవి. ఆమె నీటిపాత్రలోకి వెళ్లే నీటిలో అవి ఉన్నాయి.

అపాయకరమైన నారికురుపు

మట్టిగోడలతో ఉన్న తన పాకకు తిరిగి వచ్చి చినియర్‌ ఆ నీళ్లను మట్టికుండలో పోస్తుంది. దానిలోని మడ్డి తేరిన తరువాత, ఆమె ఆ నీళ్లు త్రాగుతుంది. ఒక సంవత్సరం తర్వాత ఆమె కాలి క్రిందిబాగాన చిన్నగా రక్తనాళం ఉబ్బినట్లుగా గుర్తిస్తుంది. కాని అది నాళం కాదు. ఆమె త్రాగిన నీళ్లలో ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన జీవి ఉన్నందున సన్నగా 80 సెంటీమీటర్ల పొడవు పెరిగింది.

ఆ క్రిమి ఆమె చర్మము మీద ఒక బాధాకరమైన పొక్కును కల్గించును. తర్వాత ఆ పొక్కు పగిలి, గులాబీరంగుగల క్రిమి రోజుకి కొన్ని సెంటీమీటర్ల చొప్పున పైకి రావడం మొదలవుతుంది. అది పూర్తిగా పైకిరావడానికి రెండు నుండి నాలుగు వారములు—బహుశ ఇంకా ఎక్కువకాలమే— పడుతుంది. ఆ సమయంలో చినియర్‌ శక్తిహీనంగా తయారవుతుంది, ఆ కాలంలో చినియర్‌ తీవ్రంగా బాధపడుతూ బహుశ అశక్తురాలౌతుంది. పగిలిన పొక్కు సూక్ష్మక్రిముల వలన అంటు వ్యాధి సోకి, ధనుర్వాతము, చీముపట్టడం, కీళ్లవాపులు లేదా పెద్దగాయముగా మారువచ్చును.

చినియర్‌ కేవలం ఒక్క క్రిమివల్లనే బాధపడుతూవుంది, అయితే బాధితుడు అనేక క్రిములతో, ఒకే సారి ఒక డజను లేక యింకా ఎక్కువ క్రిములతో బాధపడడం అసాధారణమేమి కాదు. సాధారణంగా అవి కాలి క్రింది భాగంలోనే కనిపిస్తాయి, కాని కొన్ని సమయాల్లో శరీరములోనున్న అన్ని భాగాలకు అనగా తల, ఛాతీ, నాలుకకు కూడా వ్యాపిస్తాయి.

ఏమైనను, అంతర్జాతీయంగా ఈ క్రిమిని నిర్మూలించాలనే ఆలోచన ఉన్నందువలన అది త్వరలో నాశనం చేయబడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థప్రకారం, 30 లక్షల మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు, వీరిలో చాలామంది పాకిస్తాన్‌, ఇండియా మరియు 17 ఆఫ్రికా దేశాలకు చెందినవారే. దాదాపు ఒక దశాబ్దం క్రితమే, దీనికి ఒక కోటి మంది గురయ్యారు. ఆసియాలో, యీ నారికురుపు నిర్మూలన జరిగినట్టే; మరి ఈ క్రిమి వాతబడ్డ అనేక ఆఫ్రికా దేశాలలో ఈ పరాన్నజీవిని 1995 పూర్తి అయ్యేనాటికి తుడిచివేయడం జరగవచ్చు.

ఒక పెద్ద చరిత్ర

ఈ నారికురుపు ప్రాచీనకాలమునుండి, ముఖ్యంగా మధ్య ఆసియా మరియు ఆఫ్రికాలో మానవజాతిని పీడిస్తూ వచ్చింది. ఈజిప్ట్‌లో కనుగొనబడిన 13 సంవత్సరాల బాలిక శవములో ఈ నారికురుపు ఉన్నట్లు కనుగొనబడింది. ఈ నారి కురుపు వ్యాధి వలన శరీరమంతా కుళ్లిపోకుండా ఉండుటకు బహుశా ఆ అమ్మాయి రెండు కాళ్లు నరికివేయబడి వుండవచ్చు.

పురాతన వ్రాతలలో దీనిని గూర్చిన సూచనలు ఉన్నవి. ఈ నారిపురుగు గూర్చి అంతకుముందు సూచన ఈజిప్ట్‌ మూలగ్రంథములో దొరికింది. పైకి వస్తున్న ఈ క్రిమి ఒకపుల్లకు చుట్టబడుతుందని వర్ణించబడింది. “ఎర్రసముద్రము మూలంగా ప్రజలకు ఎన్నడు కనివిని ఎరుగని క్రొత్తరోగాలు వచ్చాయి. వాటిలో యితర పురుగులతోపాటు, వాటిని చిన్నపాములు కూడా వారి కాళ్లను మరియు చేతులను తినివేసాయి, మరియు వాటిని పట్టుకుంటే ముడుచుకొనిపోయి, కండరాలలో వాటంతటవే మెలికలుతిరిగిపోయి భరింపజాలని బాధనిచ్చేవని” సా.శ. పూర్వము 2 వ శతాబ్దంలో గ్రీకు దేశస్థుడైన నైడస్‌కు చెందిన అగెతార్‌కిడేజ్‌ వ్రాశాడు.

చికిత్స

“నయం చేయుటకన్న నిరోధించడం మేలు,” అనే సామెత ప్రకారం రోగంవచ్చిన తరువాత మందులు వేసుకోవడంకన్నా రోగం రాకుండా నిరోధించాలి. నిజంగా ఇది నారికురుపు వ్యాధికి సరిపోతుంది. వాస్తవానికి, దానికి స్వస్థత లేదు. ఒకసారి ఒకవ్యక్తి లార్వా రూపంలోనున్న నారి కురుపు ఉన్న నీళ్లను త్రాగితే, పొక్కు రాకముందు, చర్మమునుండి క్రిమి పైకివచ్చేంతవరకు వైద్యులు మందులతో ఏమి వైద్యం చేయలేరు. పురుగు మధ్యలోనున్న నిడివి ప్రక్కన చిన్నగా కోసిన తరువాత, అదే స్థితిలో కొన్నిసార్లు నిపుణతగల వైద్యుడు ఆ పరాన్నజీవిని తీసివేయగలడు. తరువాత అతడు పురుగు ఉన్న భాగాన్ని వదులు చేయడానికి, కొక్కెలాంటి పరికరాన్ని వాడి చర్మము పైభాగాన జారుముడి వేస్తాడు. తరువాత అతడు జాగ్రత్తగా మిగిలిన పురుగును బయటకు తీసివేస్తాడు, కొన్ని నిమిషాల్లో శస్త్ర చికిత్స పూర్తి అవుతుంది.

ఒకసారి ఆ పురుగు దానికదే బయటకు రావడం ప్రారంభించినపుడు, చితికినపుండు మూలంగా వాచిన భాగం పురుగును బయటకు రానివ్వకుండా ఆపుతుంది. అప్పుడు ఆ వ్యాధికి గురైన వ్యక్తి పాతపద్ధతిని అనుసరిస్తూ జాగ్రత్తగా పురుగు పైకి వచ్చినపుడు దానిని చిన్న పుల్లకు చుట్టుట మంచిది. పురుగు తెగిపోకుండా శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ అలా జరిగితే, మిగిలిన భాగము వ్యాధికి గురైన వ్యక్తిలో ముడుచుకొని ఇతర రోగానికి, బాధకు, మరియు అంటురోగానికి దారి తీస్తుంది.

ఈ నారి కురుపు వ్యాధికి గురైన వ్యక్తికి ఎటువంటి వైద్యం చేయలేం. కాని యీ పరాన్నజీవి మనిషి దేహములో ప్రవేశించక ముందు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.

నారి కురుపును అరికట్టుట

బోర్‌వెల్‌ నీళ్లలోనికి ఈ క్రిమి వెళ్లలేదు గనుక అటువంటి మంచినీటి సదుపాయం కల్పించడం దీనిని అరికట్టుటలో ఒక మార్గం. మరొకవిధమేమనగా గ్రామస్థులకు త్రాగేనీటిని మరిగించి లేదా మంచి బట్టతో నీటిని వడకట్టి త్రాగడం నేర్పించాలి. మూడవదిగా, నీటిగుంటలో లార్వాను చంపే రసాయనాలను వాడాలి కాని మానవులకు, జంతువులకు హానికల్గించేదిగా ఉండకూడదు.

ఎక్కడైతే ఈ రోగం విశిష్ఠంగా ఉందో ఆ మిగిలిన అన్ని దేశాల్లోనూ ఈ వ్యాధితో బాధపడుతున్న గ్రామాలను కనుగొని ఆ గ్రామాల్లోని ప్రజలకు ఈ వ్యాధి సోకకుండా అరికట్టేందుకు చురుకుగా నిర్మూలించే పథకాలు చురుకుగా కొనసాగుచున్నవి. ఆవిధంగా చేసే కృషి ఎక్కువ విజయమును సాధించింది. నారికురుపు తన చివరిదినాల్లో ప్రవేశించిందని తెలుస్తోంది. మరి అది లేకుండా పోతే ఎవరు విచారించరు.

[20వ పేజీలోని చిత్రం]

కలుషితమైన నీటిని మొదట మరగబెట్టి, వడగట్టితేనే గాని త్రాగకూడదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి