కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 3/8 పేజీలు 30-31
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మిగులు పాలను పారబోయుట
  • వర్షం కురిపించుట
  • పానకపు నది
  • విదేశీ సహాయం ఎవరికి ఏమి దొరుకుతుంది?
  • దీర్ఘాయుస్సు గల జపానీయులు
  • సాలె పురుగుల భయం అవసరం లేదు
  • ఆక్రమ స్థలాల సందిగ్ధావస్థ
  • కాఫీ మత్తు పదార్థం వంటిదా?
  • వైద్యులకు సానుభూతి నేర్పుట
  • పోప్‌ క్షమాపణ చెప్పుట
  • ఆ ఖరీదైన కొమ్ములు గల జంతువు
    తేజరిల్లు!—1995
  • రక్తమార్పిడి–ఎంత వరకు సురక్షితము?
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
తేజరిల్లు!—1993
g93 3/8 పేజీలు 30-31

ప్రపంచ పరిశీలన

మిగులు పాలను పారబోయుట

తీవ్ర ఆహార కొరతలు ఉన్నప్పటికి, క్రిందటి ఐదు సంవత్సరాలలో దక్షిణ ఆఫ్రికాలోని పాల డైరీలు లక్షలాది లీటర్ల పాలను పారబోస్తున్నవి. మిగిలిన పాలను నిల్వచేసే ఏర్పాట్లు చేసేబదులు పాలడైరి బోర్డు పాలడైరీలపై పన్ను విధించింది. అలా చేయలేదు గనుకనే, జాతీయ పాల పంపిణి సంస్థ యొక్క నిర్వాహకుడు ఇలా అన్నాడు: “మేమేమి చేయగలం? మేము వాటిని పారబోయ వలసిందే. వాటిని ఉచితంగా ఇవ్వడం లేదా అమ్మడం ద్వారా మన స్వంత ఆర్థిక పరిస్థితిని క్షీణింప జేసుకోవటం ఆర్థిక పరంగా సరైనది కాదు.” అయితే యిలా వృధా చేయుటను గూర్చి ఇతర సంస్థలు విచారం వ్యక్తం చేశాయి. “దక్షిణాఫ్రికా వృద్ధులు జీవించటానికి, కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా కష్టపడుతున్న సమయంలో” పాలను వృధాగా పారబోస్తున్నారని వృద్ధుల సమాఖ్య పేర్కొన్నది. (g92 11/22)

వర్షం కురిపించుట

చిలీలోని చుంగుంగో అనే చిన్న, నిరుపేద జాలరుల గ్రామంలో సంవత్సరాల తరబడి పరిశుభ్రమైన త్రాగే నీరు ఉండేది కాదు. కాని, యిటీవల కాలంలో అది మారింది, నీటిని సేకరించే విశేష విధానానికి కృతజ్ఞతలు. ఈ ప్రాంతంలో వర్షపాతం అత్యల్పం, కాని తరచుగా పసిఫిక్‌ మహా సముద్రం నుండి మంచు మేఘం వస్తూంటుంది. గ్రామానికి పైగా ఉన్న 800 మీటర్ల ఎత్తు కొండ మీదుగా వస్తుంది గనుక, ప్రాముఖ్యంగా మంచు మేఘం అక్కడ దట్టంగా ఉంటుంది. కెనడా మరియు చిలీ యొక్క వైజ్ఞానికుల బృందం ఒకటి ఈ మేఘాల నుండి నీటిని కురిపించటానికి అనువైన విధంగా, నాణ్యమైన రీతిలో తయారు చేయబడిన 50 పెద్ద ప్లాస్టిక్‌ వలలను బిగించింది. ఆ వలపై నీటి చుక్కలు వచ్చిపడి, దాని అడుగున ఉన్న గొట్టంలోనికి ఆ నీళ్లు సన్నని ధారగా పడతాయి. ఆ గొట్టాల ద్వారా నీరు గ్రామంలోకి ప్రవహిస్తుంది. చుంగుంగోలోని 350 మంది నివాసులలో ప్రతి ఒక్కరికి రోజుకు షుమారు 25 లీటర్ల పరిశుభ్రమైన త్రాగే నీరు ఏ విధమైన శక్తిని ఉపయోగించ కుండానే, సుళువుగా నిర్వహించబడే పద్ధతి ద్వారా అందజేయ బడుతోంది. ఈ విధమైన పద్ధతి ద్వారా, ఆరు ఖండాలలోని 22 దేశాలకు ప్రయోజనము కలుగ వచ్చునని ఈ పథకానికి సంబంధించిన పరిశోధకులు నమ్ముతున్నారు. కాని, అదేమంత క్రొత్త ఆలోచన కాదు; చెట్లు మంచు నుండి నీటిని కొన్ని వేల సంవత్సరాలుగా కురిపిస్తూనే ఉన్నాయి. (g92 12/8)

పానకపు నది

థాయ్‌లాండ్‌ యొక్క నాం పాంగ్‌ అనే నది దాని ఒడ్డున జీవిస్తున్న వందలాది మంది గ్రామస్థుల ఆహారోత్పత్తికి మూల కారణమైననూ అది ఈ మధ్య హఠాత్తుగా చిక్కగా, బంకగా తయారయ్యింది. ఏసియావీక్‌ అనే పత్రిక ప్రకారం, స్థానికంగా ఉన్న ఒక చెక్కర మిల్లులోని పెద్ద టాంకులో చిల్లులు పడడం ద్వారా 9,000 టన్నుల బెల్లపురసం నదిలోకి పొర్లిపారింది. ఈ తీయని రసం, నది యొక్క ప్రాణవాయువును అణిచి వేయడం ద్వారా అది ప్రవహించినంత మేరకు ఒక్కొక్క మైలుకు దాదాపు 2,000 పౌండ్ల చేపలు చనిపోయేలా చేసింది. ఏసియావీక్‌ అన్నట్లుగా “ఈ నష్టాన్ని అదుపు చేసే పొరపాటు పనిలో” అధికారులు దగ్గరలో ఉన్న ఆనకట్ట నుండి 840 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటిని వదలడం ద్వారా బెల్లపు రసాన్ని ప్రవాహంలో కొట్టుకొని పోజేయాలని ప్రయత్నించారు. దీని మూలంగా బెల్లపురసం 600 కిలోమీటర్ల దూరం వరకు ప్రవహించడమే కాకుండా, ఇంకా ఇతర రెండు నదులలోకి ప్రవహించుటకే ఆ పథకం దోహదపడింది. ఈ మూడు నదులు మళ్లీ మామూలు స్థితికి రావడానికి కనీసం 12 సంవత్సరాలైనా పట్టవచ్చునని ఒక వాతావరణ నిపుణుడు అంచనా వేశాడు.

విదేశీ సహాయం ఎవరికి ఏమి దొరుకుతుంది?

విదేశీ సహాయం బీదలకు ప్రయోజనం కలిగే విధంగా సహాయం చేస్తుందా? యు. యన్‌. హ్యుమన్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌ 1992, ప్రకారం, విదేశీ సహాయం కేవలం 27 శాతం మాత్రమే ప్రపంచపు 72 శాతం అతి పేద ప్రజలున్న పది దేశాలకు వెళ్తుతుంది. అభివృద్ధి చెందుతున్న ప్రపంచపు అతిపేద 40 శాతం వర్గానికి అందుతున్న సహాయం కన్న రెండింతల కంటే ఎక్కువ, 40 శాతం ధనిక వర్గానికి అందుతుంది. ప్రపంచములోని సగం మంది నిరుపేదలకు నిలయమైన దక్షిణాసియా దేశాలలో, ఒక వ్యక్తికి ఐదు డాలర్ల చొప్పున యీ సహాయం అందుతుంది. దక్షిణాసియా మూడింతలు ఎక్కువ తలసరి ఆదాయం గల మధ్య ప్రాశ్చ దేశాలకు, అధికంతో, ఒక వ్యక్తికి 55 డాలర్ల చొప్పున లభిస్తుంది. ఆయుధాలపై ఎక్కువగా ఖర్చుపెట్టే దేశాలు, మితంగా ఖర్చు పెట్టే దేశాల కంటే రెండింతల సహాయాన్ని పొందుతున్నవని కూడ ఆ నివేదిక తెలియ జేస్తుంది. ఈ నిధి యొక్క అతి తక్కువ భాగం మాత్రమే విద్యా, ఆరోగ్య సంరక్షణ, సురక్షితమైన త్రాగే నీరు, పారిశుధ్యం, కుటుంబ నియంత్రణ మరియు పౌష్టికాహార కార్యక్రమాల వంటి మానవ కనీస అవసరతలకు ద్విపార్శిక సహాయం యొక్క దాదాపు 7 శాతం మరియు పలు దేశాల పరస్పర సహాయం యొక్క 10 శాతం) వెళుతుంది. (g92 11/22)

దీర్ఘాయుస్సు గల జపానీయులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆధునిక లెక్కల ప్రకారం భూమిపై ఉన్న ఏ దేశస్థుల కంటే కూడా జపానీయులు ఎక్కువ ఆయుష్కాలమును కలిగి వున్నారు. జపాను స్త్రీల యొక్క కనీస ఆయుష్కాలము 82.5 సంవత్సరాలు, పురుషులకు 76.2 సంవత్సరాలు. రెండవ అత్యధిక ఆయుస్సు అంటే, 81.5 సంవత్సరాలు ఫ్రాన్సు స్త్రీలకు, తరువాత 81.0 సంవత్సరాలు స్విట్జర్లాండు స్త్రీలకు ఉంది. పురుషులలో రెండవ స్థానం అంటే, 75.4 సంవత్సరాలు ఐస్‌ల్యాండ్‌ దేశస్థులది, తరువాత 74.3 సంవత్సరాలు గ్రీసు దేశస్థులు. 350 పేజీలు గల గణాంక సాంవత్సరిక పుస్తకం కూడ ఇంకా అనేక ఆసక్తికరమైన వాస్తవాలను అందజేసింది. ప్రపంచపు అత్యధిక జననాల రేటు ర్వాండాది, అచ్చట ఒక స్త్రీ సగటున 8.3 మంది పిల్లలను కంటుంది. ఆత్మహత్యల రేటు బహామాస్‌లో అత్యల్పం 1,00,000 మందికి 1.3 గా ఉంటుంది, అయితే, హంగేరీలో 1,00,000 మందికి 38.2 అత్యధికంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. దక్షిణ అమెరికా యొక్క చిన్న దేశమైన సురినాంలో, 1,00,000 మందికి 33.5 అత్యధిక శాతం వాహన ప్రమాద మరణాలకు గురౌతున్నారు. అత్యల్ప దేశమేది? మాల్టాలో 1,00,000 మంది ప్రజలకు 1.6 మాత్రమే ప్రాణాంతకమైన వాహన ప్రమాదాలతో మరణిస్తున్నారు. (g92 11/22)

సాలె పురుగుల భయం అవసరం లేదు

సౌత్‌ ఆఫ్రికా పనోరమా అనే పత్రిక సాలె పురుగుల భయం, “నిర్లక్ష్యం యొక్క ఫలితం” అని అంటుంది. డా. ఆన్‌సీ డిపెనార్‌ యొక్క పరిశోధనను గూర్చి నివేదిస్తూ ఆఫ్రికా సాలె పురుగుల ప్రముఖ అధికారిక పత్రం, ప్రపంచములో మనకు తెలిసిన సాలె పురుగు జాతులలో 0.2 శాతం కంటే తక్కువ మాత్రమే మనిషికి ప్రమాదకరమైనవని పేర్కొంది. అసలు, ఈ చిన్న జీవులను స్నేహితులవలె చూడాలి కాని విరోధుల వలె కాదు. పంటచీడలను అరికట్టడంలో అవి వెలకట్టలేనివి. కొన్ని జాతులలోని ఒక్క సాలెపురుగు 200 కీటకాలను ఒక్క రోజులో చంప గలదు. ఉదాహరణకు, సాలె పురుగులను ఎర్రని పంట పొలాలలో వుండనిస్తే, సాలె పురుగులను చంపి పొలాలలో వచ్చే దిగుబడి కంటే ఎకరానికి 2.4 టన్నుల అధిక దిగుబడిని పొంద వచ్చును. “రైతులు సాలె పురుగులను సంరక్షించాలి, తద్వారా వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే ఖరీదైన క్రిమి సంహారకాల ఉపయోగాన్ని మితం చేయవచ్చు”, అని కూడ ఆ శీర్షిక తెలియ జేసింది. (g92 11/22)

ఆక్రమ స్థలాల సందిగ్ధావస్థ

తీవ్రమైన కరువు కారణంగా, దక్షిణాఫ్రికాలోని వేలాది మంది గ్రామాలలోని ప్రజలు తమ ఇళ్లను విడిచి ఉపాధి వెదుకుతూ పట్టణాలకు తరలి వస్తున్నారు. నిజం చెప్పాలంటే, ఆర్థిక తిరోగమనం వల్ల పట్టణాలలో ఉద్యోగం దొరికే అవకాశాలు చాల తక్కువ. అక్రమంగా ఆక్రమించుకొన్న పాకలు వృద్ధిచెందుతున్నాయి. దగ్గరలో నివసింపదగిన ప్రాంతాల ఇళ్ల యజమానులు పడిపోతున్న ఆస్తి విలువలను గూర్చి, ఆకస్మికంగా పెరిగిపోతున్న దొంగతనాలను గూర్చి ఫిర్యాదు చేస్తున్నారు. అలా అక్రమంగా ఆక్రమించేవారికి ప్రభుత్వం తక్కువ ఖరీదు చేసే గృహ సౌకర్యం కలుగ జేయాలని కొందరు భావిస్తున్నారు. కాని అలాంటి పథకం “తక్కువ ఖర్చేమి కాదని”—లేక సులభం కాదని సోవెటన్‌ అనే వార్తాపత్రిక తెలియ జేస్తుంది. దేశవ్యాప్తంగా 70,00,000 మంది వరకు ఆక్రమిత స్థలాలలో నివసిస్తున్నట్లు ఒక పరిశోధక బృందం అంచనా వేస్తున్నది. (g92 12/8)

కాఫీ మత్తు పదార్థం వంటిదా?

ఆటగాళ్లు వారి ప్రదర్శనను అధికం చేసుకొనుటకు వారు ఒక మత్తు పదార్థాన్ని ఉపయోగించి నట్లు కాఫీని ఉపయోగించ వచ్చును—కొన్ని సార్లు ఉపయోగిస్తున్నారు అని బ్రెజిల్‌లోని ఒక ప్రొఫెసర్‌ అన్నాడు. ఓ ఎస్టాడో డె ఎస్‌. పౌలో అనే పత్రిక ప్రకారం, మినాస్‌ గెర్యాస్‌ ఫెడరల్‌ విశ్వవిద్యాలయం యొక్క వ్యాయామ విద్య పాఠశాల ప్రొఫెసర్‌ అయిన లూయెష్‌ వొస్వాల్‌డూ రుత్రెగెస్‌ ఇలా అన్నాడు: “నేను నా పరిశోధనలో పరిశీలించిన ఆటగాళ్లందరూ చట్టబద్దమైన దాని కంటే అతి తక్కువ మోతాదులో కెఫైన్‌ తీసుకున్నప్పటికీ—వాళ్లంతా మత్తు పదార్థాల ప్రభావానికి లోనైనట్లు తెలుసుకున్నాను.” అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ 750 మిల్లీ గ్రాముల కెఫైన్‌ను మితంగా నియమించింది, అంటే 11 కప్పుల చిక్కని కాఫీతో సమానం. డాక్టరు ప్రకారం, కాఫీలో ఉన్న కెఫైన్‌ను బట్టి, ఎక్కువ దూరం పరుగెత్తే వారు దాదాపు 20 శాతం తమ ప్రదర్శనలో అభివృద్ధిని చూపించారు. (g92 12/8)

వైద్యులకు సానుభూతి నేర్పుట

వైద్యులు ఎక్కువ సానుభూతిని కలిగి వుండుటకు తర్ఫీదు నివ్వటానికి అమెరికాలోని కొన్ని ఆసుపత్రులు, వైద్య పాఠశాలలు అసాధారణ కార్యక్రమాలను అమలు పరుస్తున్నారు. న్యూయార్క్‌ పట్టణంలోని ఆసుపత్రి ఒకటి, రోగుల పాత్రను పోషించటానికి కొంతమంది నటులను అద్దెకు తీసుకున్నది. తర్ఫీదులో వున్న వైద్యుడు వారి ఫిర్యాదులను వింటున్నప్పుడు దాన్ని వీడియో టేపు చేసిన తరువాత తన ప్రవర్తనను తానే చూస్తాడు. థి న్యూయార్క్‌ టైమ్స్‌ లో ఆసుపత్రి డైరెక్టర్‌ డా. మార్క్‌ ష్వార్ట్స్‌ ఇలా అంటున్నారు: “టేపులో చూసే దాన్ని బట్టి వారు తమని తాము తగ్గించుకొని, ఆశ్చర్య పోతున్నారు.” “‘ఎప్పుడూ నా మొహంపై ఆ భావం వుంటుందా?’ ‘నేను అంత కఠినంగా ఉంటానా?’” అని అంటున్నారు. వైద్యం చేయించుకొనే వారిగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకొనేలా ఇంకొక ఆసుపత్రిలో వైద్యుల పరిశీలన ఉంటుంది. అస్పష్టమైన కళ్లద్దాలు, ఇయర్‌ ప్లగ్గులు, రబ్బరు తొడుగుల వంటి వాటితో వారి పంచేంద్రియాలను తాత్కాలికంగా మొద్దుబార జేసి వైద్యులకు, పెద్ద వారిని తోటివారిగా చూసే భావం కలిగి వుండే విషయాన్ని ఇంకొక ఆసుపత్రి నేర్పిస్తున్నది. కాళ్లకు వచ్చే ఆనెలవలె ఉండుటకు తమ బూట్లలో గట్టి బటాణీలను వేసుకోవాలి, వారి కీళ్లను గట్టిగా వుంచుటకు స్పింట్‌ను ఉపయోగించాలి. ఇన్ష్యూరెన్స్‌ ఫారములను నింపుట, సీల్‌ చేసిన పిల్లల సీసాల మూతలను తీయటం వంటి “తేలిక” పనులు కూడ చేయాలి. “ఆ తరువాత జరిగే చర్చా తరగతిలో తాము కొంత మంది పెద్ద వయస్సు రోగులతో చెందిన విసుగును గూర్చి మనోవ్యధను వ్యక్తం చేశారు.” అని టైమ్స్‌ నివేదిస్తున్నది. (g92 12/8)

పోప్‌ క్షమాపణ చెప్పుట

బానిస వ్యాపారాన్ని గూర్చి పోప్‌ జాన్‌ పాల్‌ II రెండు సార్లు ఆఫ్రికా ఖండానికి క్షమాపణ చెప్పాడు. పోప్‌ ఫిబ్రవరిలో సెనెగల్‌ సందర్శించి నప్పుడు, మొదటిసారి క్షమాపణ చెప్పాడు. “క్రైస్తవులు కూడ దోషులైన చారిత్రాత్మక బానిసత్వ నేరానికి ఆఫ్రికా ప్రజల క్షమాపణ మరియు ‘పరలోక క్షమాపణ’” కొరకు పోప్‌ వేడుకున్నాడని ఇటలీ దిన పత్రిక అయిన కొర్యేరా డెల్లా సెరా నివేదించింది. రెండవ క్షమాపణ, మూడు నెల్ల తరువాత, సాయెటోంను దర్శించినప్పుడు చెప్పాడు. “చర్చి కూడ పాపులతో కూడిన సంఘం గనుక, శతాబ్దాలుగా ప్రేమ సూక్తి ఉల్లంఘించ బడుతూనే ఉంది  . . తమను తాము క్రైస్తవులన్న పేరుతో అలంకరించుకున్న ఒక గుంపుగాను మరియు వ్యక్తిగతంగాను వారు విఫలమవుతున్నారు.” లా రెపబ్లెకా అనే దిన పత్రిక “పోప్‌ యొక్క క్షమాపణల” పై వ్యాఖ్యానిస్తూ “పోప్‌ క్రైస్తవుల పాపాన్ని గూర్చి మాట్లాడాడు, కాని పోప్‌లు, రోమా సంఘాలు, బిషప్పులు, మతనాయకులను గూర్చి కూడ మాట్లాడ వలసింది. వాస్తవానికి, ఈ బానిసత్వం యొక్క చరిత్ర, కాథోలిక్‌ మతాధికార వర్గాల బాధ్యతతో కూడ కలిసి వుంది.” (g92 12/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి