మా పాఠకుల నుండి
అపహరించుట “బుద్ధితక్కువ పని చేయకు లేదా నిన్ను చంపేస్తాను.” అనే వ్యాసం గురించి మీకు చాల కృతజ్ఞతలు. (gbr-12-TU) నేను కంటతడి పెట్టాను. నాకు లీసా డావెన్‌పోర్ట్ వంటి అనుభవమేమి లేకపోయినప్పటికి, కొన్ని సార్లు కృంగిపోయినప్పుడు చనిపోవాలని అనుకున్నాను. ఆ వ్యాసం, అవసరమైనప్పుడు యెహోవా దేవుడు ఎప్పుడు ఎలా సహాయం చేస్తాడు, బలమైన మద్దతునెలా ఇస్తాడు అనే వాటిని గురించి నేను లోతుగా ఆలోచించునట్లు చేసింది.
ఎన్. ఒ., జపాను
కుటుంబాలు దగ్గరవుట “కుటుంబములారా—ఆలస్యం కాకముందే సన్నిహితులుకండి.” (gbr-10-TU) అనే శీర్షికల పరంపర గురించి నేనెంతో సంతోషించాను. అందమైన కవరు చూసి నప్పుడు నా కళ్లు కన్నీటితో నిండి పోయాయి. ప్రతి పదం, పదజాలము కూడ జాగ్రత్తగా ఎన్నుకోబడి, ఎంతో వాత్సల్యంతో వ్రాయబడ్డాయి! సన్నిహితంగా ఉండే కుటుంబాన్ని కలిగివుండడం యొక్క ప్రాధాన్యతను గుర్తు చేసినందుకు వందనాలు.
కె. ఇ., అమెరికా
నేనింత వరకు చదివిన వాటిలోకెల్ల ఈ శీర్షికలు ఎంతో కదిలించేవిగా ఉన్నాయి. మాలో చాలామందిమి మా పిల్లలతో కలిసి బైబిలు చదవటం, క్రైస్తవ కూటాలకు హాజరవటం, ప్రకటన పనిలో కలిసి పని చేయటం, లాంటివి చేస్తే చాలు, తలిదండ్రులుగా విజయం సాధించగలమని నమ్మారు. విజయవంతులైన తలిదండ్రులు తమ పిల్లవాడితో వ్యక్తిగత సంబంధాన్ని—తలిదండ్రుల ప్రేమను గూర్చి హామీ ఇచ్చే బంధాన్ని కూడ కలిగివుండాలని నేను తెలుసుకున్నాను. మునుపటి శీర్షికలలో కూడ ఈ విషయం చెప్పబడినప్పటికి ఇప్పుడు చూపినంత ప్రభావం అది ముందెన్నడూ చూపలేదు.
టి. హెచ్., అమెరికా
వివాహానికి ముందు నేను గ్రంథాలయంలో పని చేశాను. నేను నా పనిని ఆనందించే దానిని. పిల్లలు కలిగాక పిల్లలతో ఉండటానికి ఉద్యోగం మానేయాలని నేను నిర్ణయించుకున్నాను. కొన్నిసార్లు నేను పనికిరానట్లు భావించి తిరిగి ఉద్యోగంలో చేరాలని అపేక్షించాను. మీ శీర్షిక చదివిన తరువాత, నా పిల్లల పట్ల నా బాధ్యత యొక్క గ్రహింపు పెరిగింది.
ఎస్. ఎం., అమెరికా
జూదము “యవనస్థులు ఇట్లడుగుదురు. . . జూదము నిజంగా అంత చెడ్డదా?” (gbr-10-TU) అనే శీర్షిక గురించి మీకు కృతజ్ఞతలు. మా పాఠశాలలో జూదం చాల ప్రసిద్ధి గాంచింది. గెలిచేవారికి ఒక జూదం 20 యన్‌లు వచ్చేటట్లు చేస్తుంది. కొంత మంది తోటి విద్యార్థులు 2,000 యన్‌లు బడికి తీసుకొస్తారు. వాళ్లతో కలవమని నన్ను కూడ కోరారు. జూదం మరీ అంత చెడ్డదా అని ఆశ్చర్యపోవడం మొదలు పెట్టాను. కేవలం ఒక్క సారి ఆడుదామన్న శోధన కూడ నాకు కలిగింది. కాని మీ శీర్షిక చదివిన తరువాత జూదం అంత మంచిది కాదని, ఒక సారి దాన్ని ప్రయత్నిస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుందని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది.
ఎన్. ఎన్., జపాన్
చదువుట నేను యవనస్థుడను, చదవటం నేనెంతో ఆనందిస్తాను. అయినా నేను చదివేదంతా నాకెప్పుడు అర్థమయ్యేది కాదు. కష్టమైన పదాలను నేను దాటవేయాలని చూస్తాను. “మీ హద్దులను విస్తృత పరచుకొనుటకు చదవండి” (gbr-10-TU) అనే శీర్షిక ఈ విషయంలో మెరుగు పరచుకోవటానికి నాకు సహాయం చేసింది.
ఎ. ఆర్. బి., బ్రెజిల్
ది వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికల యొక్క ప్రతి సంచికను చదవాలని నేను ప్రయత్నించాను. వాటిని చదివే పట్టిక ఉన్నప్పటికి కూడ నేను విఫలమయ్యాను. నా సమస్య, సరైన చదివే లక్షణాలు లేకపోవడమని తెలుసుకోవటానికి మీ శీర్షిక నాకు సహాయం చేసింది. నా చదవటాన్ని మెరుగు పరచుకోవటానికి ఇచ్చిన సలహాలను మెచ్చుకుంటున్నాను.
ఎ. కె. ఎఫ్. ఎం., బ్రెజిల్
శరీరం యొక్క హెచ్చరిక చిన్న వైద్య సమస్యలు అని నేననుకొనుటకు ప్రారంభమైనప్పుడు నా వైద్యుడు సెలవు పై ఉన్నాడు. “శరీరం ఇచ్చే హెచ్చరికలను గమనించండి” (gbr-10-TU) అనే శీర్షికను పొందినప్పుడు నేను నా శరీరం ఇస్తున్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తుంటిని. సలహా ఇవ్వబడిన విధంగా నేను వైద్య సహాయం తీసుకున్నాను, నాకు క్యాన్స్‌ర్ అని తెలిసింది. నేను శరీరం ఇస్తున్న హెచ్చరికలను గమనించాను కాబట్టి, త్వరగా తెలుసుకొని చికిత్స పొంద గలిగాను.
ఎస్. ఎస్. అమెరికా