కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 3/8 పేజీ 32
  • అవేక్‌! పత్రిక కొరకు కృతజ్ఞత

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అవేక్‌! పత్రిక కొరకు కృతజ్ఞత
  • తేజరిల్లు!—1993
తేజరిల్లు!—1993
g93 3/8 పేజీ 32

అవేక్‌! పత్రిక కొరకు కృతజ్ఞత

ఈ పత్రిక యొక్క పాఠకులు అనేక మంది అది అనేక విషయాలపై అందజేస్తున్న జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞత కలిగి వున్నారు. దక్షిణ ఫ్రాన్సులో యెహోవా సాక్షులైన భార్యభర్తలిద్దరు తాము అవేక్‌! పత్రికను ఇచ్చిన ఒక వ్యక్తి యొద్ద నుండి ఈ క్రింది ఉత్తరాన్ని అందుకున్నారు.

“డియర్‌ సార్‌ అండ్‌ మేడమ్‌:

“వీలైన ప్రతి పరిస్థితిలోను జోక్యం చేసుకొని మన చిన్న కోరికలను తృప్తిపరచడం కంటే దేవుడు చేయ వలసిన పనులు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు. నాకు ఇటువంటి విధమైన ఆలోచనా విధానం లేకపోయినప్పటికి, నేను ఇంట్లోంచి వెళ్లుతుండగా మీరు రావడమన్నది కేవలం కాకతాళీయం కాదని నేను ఒప్పుకుంటున్నాను. ఆగస్టు 8, 1990 అవేక్‌! సంచికను సరియైన సమయంలో దొరికింది. దాన్ని తప్పిపోయి వుంటే ఎంత ఆశాభంగం చెంది వుండేవాడిని!

“‘మానవ పరిపాలనను తూకంవేస్తే’ అనే శీర్షిక పరంపరలోని వివేకవంతమైన విశ్లేషణ నాకు చాల ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఆ శీర్షిక పరంపర అందజేసిన విధానం నాకెంతో నచ్చింది . . . కాబట్టి అవేక్‌! యొక్క రాబోయే సంచికలను తప్పిపోకుండ నాకు అందేలా చూడండి! ఈ శీర్షిక పరంపరలో ఏది పోగొట్టుకోవడం నాకిష్టం లేదు.”

యెహోవా సాక్షులు 40 లక్షలపైగా ఉన్న బైబిలు విద్యార్థులైయుండి ఒక అంతర్జాతీయ సంస్థగా ఉన్నారు. వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గూర్చి, దేవుని వాక్యాన్ని గూర్చి, దాని నెరవేర్పును గూర్చి ఎక్కువగా తెలుసుకొనుటకై ప్రజలకు సహాయ పడటానికి వారు తమను తాము సమర్పించుకున్నారు. మీరు ఇంకా ఎక్కువ సమాచారం కావాలనుకుంటే లేదా ఉచిత గృహ బైబిలు పఠనం కావాలనుకుంటే Watchtower, H-58, Old Khandala Road, Lonavla, 410 401 Mah.,కు వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి