కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 2/8 పేజీలు 3-4
  • ఒక నూతన లోకం కొరకు మానవజాతి వాంఛిస్తున్నది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక నూతన లోకం కొరకు మానవజాతి వాంఛిస్తున్నది
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎటువంటి నూతన లోకం?
  • నూతన లోకం—ఎన్నటికైనా వస్తుందా?
    తేజరిల్లు!—1994
  • శాశ్వత శాంతిని ఎవరు తీసుకురాగలరు?
    తేజరిల్లు!—1996
  • అణు భయం—శాశ్వతంగా తొలగించబడింది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
తేజరిల్లు!—1993
g93 2/8 పేజీలు 3-4

ఒక నూతన లోకం కొరకు మానవజాతి వాంఛిస్తున్నది

నూతన లోకం కొరకైన ఆశ నేడున్నంతగా మునుపెన్నడూ లేదు. గత ఎనిమిది దశాబ్దాల నుండి జరుగుతున్న యుద్ధాలు, అల్లర్లు, క్షామాలు, తెగుళ్లు, నేరము, కాలుష్యం యివన్నీ ఒక పీడకలగా వున్నవి. శాంతియుతమైన నూతన లోకం కొరకు మానవత్వం మేల్కొనాలని వాంఛిస్తున్నది. ఈ కోరికకు స్పందిస్తూ, అట్టి లోకాన్ని సృష్టించే విషయమై ప్రపంచ నాయకులు మాట్లాడుట మొదలు పెట్టారు.

ఒక నూతన లోకం సమీపంగా ఉందని ప్రముఖులు చేసే ప్రసంగాలను నీవు నిస్సందేహంగా వినియుంటావు లేదా చదివుంటావు. సెప్టెంబరు 1991లో అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ ఒక ప్రసంగములో యిలా అన్నారు: “నేడు ప్రపంచమంతటా ప్రజాస్వామ్య నాటకం బహిర్గతమగుట నేను గమనించగా, బహుశ మనమా నూతన లోకానికి మునుపెన్నటికంటె మరింత సమీపమగుతున్నామేమోననిపిస్తున్నది.”

అట్టి నూతన లోకం సమీపంగా ఉన్నదనుటకు సాక్ష్యాధారంగా, తూర్పు దేశాల కూటమికి, పశ్చిమ దేశాల కూటమికి మధ్య అంతమైన ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రపంచ నాయకులు చూపిస్తున్నారు. నిజమే, నిరాయుధీకరణ కార్యక్రమాలు అమలుపర్చిన కారణంగా లోకం కొంచెం ఉపశమనం పొందింది. శాంతి భద్రతలతో కూడిన ఒక నూతన లోకం కొరకు అనేక ప్రజలకున్న నిరీక్షణను పరమాణు ఆయుధాల తగ్గింపు బలపర్చింది.

అమెరికా అధ్యక్షుడు కీ.శే. జాన్‌ ఎఫ్‌. కెనడీ పరిపాలనా కాలంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన జార్జి మెగి గత సంవత్సరం ఏప్రిల్‌లో యిలా అన్నారు: “నూతన భద్రతా నమ్మకాలపై ఆధారపడిన ఒక నూతన లోకవిధానము కొరకైన నీలివర్ణ చిత్రాన్ని గీసే అవకాశం—అట్టి అవసరతను యిప్పుడు మనము కలిగియున్నాం.” ఆయన యింకా యిలా అన్నారు: “విజయవంతమైన నూతన లోక విధానము కొరకైన గొప్ప వాగ్దానపు నిరీక్షణ అంతర్జాతీయ సమాజముయొక్క బంధాలను బలపర్చుటపై ఆధారపడియున్నదని నేను నమ్ముతున్నాను.”

ఫ్రాన్సు 1992 అంతానికల్లా పరమాణు పరిశోధనలను నిషేధించినప్పుడు, “యితర పరమాణు శక్తులు కూడ అలానే చేయాలని సమ్మతింపజేసే ఆజ్ఞను జారీచేసిందని” మెగి చెప్పారు. రష్యా “పరమాణు ఆయుధశాలలను తగ్గించుటలో చొరవ తీసుకొనుట వలన యుద్ధతంత్ర పరమాణు శక్తులను ఉపయోగించే వైఖరి ప్రమాద స్థితినుండి వైదొలగింది,” అని కూడ ఆయన అన్నారు.

అంతేకాదు, 1991 జూలైలో లండన్‌నందు జరిగిన ప్రపంచ అగ్రనాయకుల సమావేశములో, “పర్షియన్‌ గల్ఫ్‌ యుద్ధంలో ఏకమైన దేశాలు అంతర్జాతీయ శాంతి భద్రతలను నెలకొల్పుటకు, వివాదాలను పరిష్కరించుటకు ఉన్న అంతర్జాతీయ సమాజపు సామర్థ్యాన్ని రూఢిపరచిందని” వారిలో ఏడుగురు అన్నారు.

ఎటువంటి నూతన లోకం?

ఇది ప్రోత్సాహకరంగా ఉన్నట్లు అన్పిస్తుంది. అయితే నిన్ను నీవిలా ప్రశ్నించుకో, దేశాలు ఎటువంటి నూతన లోకాన్ని సృష్టించ నిరీక్షిస్తున్నవి? అది ఆయుధాలు లేని, యుద్ధం లేని లోకమా?

దానికి మెగి ఇలా సమాధానమిస్తున్నారు: “భవిష్యత్తులో ఎలాంటి సంకీర్ణ సైనిక చర్యకైనను తనవంతు భాగము వహించుటకు లేదా యుద్ధం అనివార్యమైతే తనను కాపాడుకొనడానికి అమెరికా తగినంత ఆయుధ శక్తిని ఉంచుకోవాల్సిందే.” గనుక, ప్రపంచ నాయకులు పూర్తి నిరాయుధీకరణను గూర్చి మాట్లాడుట లేదు, లేక మెగి చెప్పినట్లు “యుద్ధం అనివార్యమైతే” సైనిక చర్యకు పాల్పడుటకును వారు వెనుకాడుట లేదు. యుద్ధం లేని నూతన లోకాన్ని ప్రభుత్వాలు వాగ్దానం చేయజాలవు. వాస్తవంగా, అట్టి లోకాన్ని తాము సృష్టించలేమని వారికి తెలుసు.

దృష్టాంతానికి, యిప్పటికే సంభవించినదాన్ని చూడండి. న్యూయార్క్‌ టైమ్స్‌ మే 17, 1992 నందు “ది న్యూ వరల్డ్‌ ఆర్డర్‌” అను శీర్షిక క్రింద పత్రికా శీర్షిక రచయిత ఆంథోని లూయిస్‌ యిలా వ్రాసెను: “బాంబుల [సారాజివో, బోస్నియా, హెర్జ్‌గోవినా] దాడిని, పౌరులు భయముతో తల్లడిల్లుటను దూర దర్శిని దృశ్యములందు చూచినప్పుడు, రోటర్‌డమ్‌పై నాజీ బాంబులు దాడిచేసిన నాటినుండి సమాజం ఏమాత్రం పురోగమించలేదని నేను అనుకున్నాను. ఇదేనా నూతన లోకం!”

అయినా, యుద్ధాన్ని లేకుండా చేయడమే కాదు, సంతృప్తికరమైన ఒక నూతన లోకాన్ని సృష్టించాలంటే, పరిష్కరించబడవలసిన యితర సమస్యలెన్నో ఉన్నాయి. మన వాతావరణాన్ని, భూమిని, సముద్రాలను క్రమేపి పాడుచేస్తున్న అపాయకరమగు కాలుష్యాన్ని పరికించండి; ఘోరమైన నేరాలు చేసే సంస్థలు, మాదక ద్రవ్య అక్రమ రవాణా సంస్థలు లక్షలాది ప్రజల ఆస్తులను, ఆరోగ్యాన్ని దోచుకొంటున్నవి. వర్షపాతానికి దోహదపడే అడవులను నరికివేయడం మూలంగా నేల హరించుకుపోయి, తుదకు పంటలను నాశనము చేసే వరదలు సంభవిస్తున్నాయి.

అంతేకాదు, హృద్రోగము, క్యాన్సర్‌, ఎయిడ్స్‌, లుకేమియా, మధుమేహం వంటి భయంకరమైన శారీరక రోగాలకు ఇంకా నివారణ కన్పించడం లేదు. పేదరికము, యిండ్లు లేకపోవడం, ఆహారం, నీటి కొరతలు, కుపోషణ, నిరక్షరాస్యత, ఓజోన్‌పొర అంతరించిపోవుట మున్నగు సమస్యల విషయమేమి? అవును, ఆ సమస్యల పట్టిక అలా కొనసాగుతునే ఉంటుంది. ఈ క్లిష్ట సమస్యలన్నీ సమయం నిర్దేశించి పేర్చబడిన టైం బాంబుల వంటివి. అవి ప్రేలినందువలన వచ్చే విపత్తులు ఒకదాని తర్వాత ఒకటి సంభవించి తనను సమూలంగా నాశనం చేయకముందే మానవుడు వాటిని నిర్వీర్యం చేయాలి. దీనిని చేయడానికి తగిన సమయమందే తానొక నూతన లోకాన్ని నెలకొల్పగలడా?

భూమి మీదనున్న సమస్యలను పరిష్కరించుటకు సంస్థలు, సమావేశాలు అనేక సంవత్సరాల నుండి బహు ప్రయాసతో కృషి సల్పుతున్నవి. అయినను, సమస్యలు పెరిగిపోవుటే కాకుండా క్రొత్తవి, మరింత జటిలమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటన్నింటిని పరిష్కరించలేని మానవ అసమర్థతను బట్టి శాంతియుతమైన, భద్రతగల్గిన నూతన లోకం కొరకు మానవులు అర్రులు చాచుట వ్యర్థమేనని దీని భావమా? కానేకాదని మనం ధైర్యంగా ప్రత్యుత్తరమీయగలం! మేమెందుకిలా చెబుతున్నామో దయచేసి గమనించండి. (g92 10/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి