కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 8/1 పేజీలు 6-7
  • అణు భయం—శాశ్వతంగా తొలగించబడింది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అణు భయం—శాశ్వతంగా తొలగించబడింది!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అవాస్తవికమైన “శాంతి భద్రతలు”
  • శాంతి భద్రతలు—వాస్తవమైన విషయం
  • అణు భయం చివరికి అంతరించిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 8/1 పేజీలు 6-7

అణు భయం—శాశ్వతంగా తొలగించబడింది!

అనుచితమైన భయంతో మానవజాతి జీవించాలని దేవుడు కోరుకోవడంలేదు. ‘సంతోషముగల దేవునిగా,’ ప్రజలు శాంతిని అనుభవిస్తూ భద్రతతో జీవిస్తూ ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమోతి 1:11) అయినా అణు భయంతో నిండివున్న లోకంలో యిది పూర్తిగా అసంభవము.

అవాస్తవికమైన “శాంతి భద్రతలు”

అణు భయం అంతరించలేదన్నది సుస్పష్టమైన సంగతి. ఒకవైపు రాజకీయ, ఆర్థిక, సాంఘిక అస్థిరతలు ఉన్నప్పటికీ, మొత్తంమీద రాజ్యాలు యింకా ఆశావాదంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ అపాయాన్ని తీసివేయడానికి చేసే గట్టి ప్రయత్నం, ఐక్యరాజ్య సమితి 1986ను అంతర్జాతీయ శాంతి సంవత్సరంగా ప్రకటించిన నాటి నుండి కనిపిస్తోంది.

ది బులెటిన్‌ ఆఫ్‌ ది అటామిక్‌ సైన్‌టిస్ట్‌, గత పది సంవత్సరాలలో అది తన నాశనదిన గడియారాన్ని—అణు యుద్ధం సంభవిస్తుందని సూచించే పద్ధతిని—అర్థ రాత్రికి మూడు నిమిషాలు ఉండే సమయాన్ని పదిహేడు నిమిషాలు ఉండేటట్లుగా మార్చినట్లు తెల్పుతున్నది. స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ 1989లో, “విబేధాల శాంతియుత పరిష్కారం, రెండవ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత మరి ఏ యితర సంవత్సరం కన్నా స్పష్టంగా కనిపిస్తుంది” అని చెప్పింది.

అంతర్జాతీయ విభేదాలు సంభవించే ప్రాంతాలతో వ్యవహరించడానికి ఐక్యరాజ్య సమితి యిటీవలి సంవత్సరాల్లో మరింత పటిష్టవంతమయ్యింది. దాని విజయం సంపూర్ణం కాకపోయినప్పటికీ, అది అందరిలోనూ ఆశావాద స్ఫూర్తిని కలిగించడానికి సరిపోయింది. ఈ దిశలో మరికొంత విజయం భవిష్యత్తులో రాగలదు. “శాంతి భద్రతల” పిలుపు బహుశ మరింత బిగ్గరగా, మరింత ఉదృతంగా అయ్యే అవకాశముంది. వారు నమ్మకాన్ని కూడా చూరగొనవచ్చు.

అయితే జాగ్రత్త! “లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.” కనుక, “శాంతి భద్రతల” కొరకైన పిలుపు, “భూమిని [అణు కాలుష్యం వల్లగానీ లేక యితర వాటివల్లగానీ] నశింపజేయువారిని నశింపజేయుటకు” దేవుని సమయము వచ్చియున్నదని సూచిస్తుంది.—1 థెస్సలొనీకయులు 5:3, 4; ప్రకటన 11:18.

దేశాలు “శాంతి భద్రతను” సాధిస్తాయని బైబిలు చెప్పడంలేదన్న విషయాన్ని గమనించండి. మునుపెన్నడులేని విధంగా ఆశావాదాన్ని, నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ వారు దాన్ని గూర్చి సాటిలేని రీతిలో మాట్లాడుకుంటారు. శాంతి భద్రతలను పొందే అవకాశం మునుపెన్నటికన్నా మరింత సమీపంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అణు భయం కొనసాగుతున్నప్పటికీ, భద్రత వస్తుందనే కల్పిత భావనలోకి దేశాలు తీసుకెళ్లబడతాయి.

అయితే, నిజ క్రైస్తవులు మాత్రం మోసపోరు. శ్రద్ధతో కూడిన ఆసక్తితో వారు మానవులు తెచ్చే శాంతి భద్రతలకు మించిన శ్రేష్ఠమైన దాని కొరకు ఎదురుచూస్తారు!

శాంతి భద్రతలు—వాస్తవమైన విషయం

కీర్తన 4:8 ప్రకారం, నిజమైన శాంతి భద్రతలు యెహోవా దేవుని ఏర్పాటులోనే కనిపిస్తాయి: “యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.” యెహోవా రాజ్య ఏర్పాటును దాటిన, “శాంతి భద్రతల”కైన ఏ పిలుపైనప్పటికీ మోసకరమైనదే అవుతుంది. అది శాశ్వత ప్రయోజనకరమైన దేన్నీ సాధించలేదు.

క్రీస్తు ఆధ్వర్యంలోనున్న దేవుని రాజ్యం పాక్షికమైన పరిష్కారాలను అందించడంతో సంతృప్తిచెందదు. దైవిక ప్రభుత్వం కేవలం అణ్వాయుధాల సంఖ్యను తగ్గించడం కంటే యింకా ఎక్కువే చేస్తుంది; అది వాటిని, మరితర యుద్ధ ఆయుధాలన్నిటినీ సమూలంగా నాశనం చేస్తుంది. కీర్తన 46:9 యిలా వాగ్దానం చేస్తోంది: “ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.”

అదే విధంగా, అణు ఉత్పాదక కేంద్రాల లోపాలవలన లేక రేడియోధార్మిక వ్యర్థ పదార్థం మూలంగా కలిగే అణు భయాలు యిక ఉండనే ఉండవు. అలా జరగకపోతే ఈ మాటలు అబద్ధమౌతాయి: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.”—మీకా 4:4; తీతు 1:2.

అణు భయం శాశ్వతంగా తీసివేయబడిన లోకంలో జీవించాలనే ఉత్తరాపేక్షను కల్గివుండడానికి మీకు యిష్టముందా? మీరు జీవించగలరు కారణం, యెహోవా వాక్యం దానికి కావల్సిన అర్హతలను స్పష్టంగా చూపుతోంది. వాటిని నేర్చుకొని, వాటికనుగుణంగా జీవించడంవల్ల ఒక నాటికి మీరు కూడ “అణు భయం—చివరికి అంతరించిపోయింది” అనే ఆనందభరిత కేరింతను వేస్తారు.

[7వ పేజీలోని చిత్రం]

ఏ అణు భయం లేకుండా, దేవుని నూతనలోకంలో శాంతి ఏలుతుంది

[క్రెడిట్‌ లైను]

M. Thonig/H. Armstrong Roberts

[6వ పేజీలోని చిత్రసౌజన్యం]

U.S. National Archives photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి