కోపం యొక్క అధిక మూల్యం
కోపం తెప్పించే ఓ చిన్నమాటకే మహోద్రేకుడవగుటకు సిద్ధపడి, కోపగించుకొందువా? ఎవరైనా నిన్ను నిర్లక్ష్యంగా చూస్తే లోలోపల రగిలిపోతూ, దినములకొలది కోపావేశములను దిగమ్రింగుచూవుంటావా? అలాచేస్తే, నీచుట్టూన్న వారిని దూరం చేసుకొనుటకంటె యింకా ఎక్కువే చేస్తున్నావేమో; కోపంతో నిన్ను నీవే చంపుకుంటున్నావేమో.
కోపం నిజంగా ప్రాణహానికరమైనదా? ది న్యూయార్క్ టైమ్స్ న్యూస్ సర్వీస్‌లో ఇచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం, అది సాధ్యమే. ఉదాహరణకు ఆ నివేదిక నొక్కిచెప్పునదేమనగా “ఎల్లప్పుడూ వుండే కోపం శరీరానికి ఎంతటి హానికరమంటే అకాల మరణానికి ఎంతో దోహదకారియైన స్థూలము, క్రొవ్వు పదార్థముల తిండికి, సిగరెట్ త్రాగుటకు సమానంగా వున్నది లేదా మించివున్నది.”
ఆ నివేదిక, అనేక విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను ఇందుకు ఎత్తిచూపిస్తున్నది. అందులో ఒకటి 25 సంవత్సరముల వయస్సుగల కొంతమంది విశ్వవిద్యాలయ విద్యార్థులకు ప్రతిదినం వేర్వేరు పరిస్థితులందు వారు వ్యక్తపరచే వైర స్వభావ స్థాయిని పరిశీలించడానికి వ్యక్తిత్వపు పరీక్షలు పెట్టారు. పరిశోధకులు 25 సం.ల తర్వాత ఆ విద్యార్థులను పరిశీలించారు. అతి తక్కువ వైరస్వభావం వ్యక్తపరచిన వారిలో అతితక్కువ మరణ సంఖ్యవుండెను. వారిలో 4 శాతం మాత్రమే 50 సం.లకు చనిపోయారు. అత్యంత ఎక్కువ వైరస్వభావం గలవారిలో 20 శాతం చనిపోయారు! మరో అధ్యయనము ప్రకారం యౌవనములోనే అత్యంత వైరస్వభావమున్నవారిలో రాబోవు కాలమందు హానికరమైన క్రొవ్వుపదార్థమును అత్యధికంగా కల్గివుంటారని, అదివారిని హృద్రోగమునకు నడిపించే అపాయ స్థితిలో వుంచునని తేలింది.
వారిసమస్యలను పరిష్కరించుటకు మార్గం అన్వేషించే బదులు మహోద్రేకాన్ని దిగమ్రింగుకొని మనస్సులో మదనపడే వారి విషయమేమిటి? మిచిగన్ విశ్వవిద్యాలయములో అంటువ్యాధి నిపుణురాలు డాక్టర్ మారా జూలియస్, 18 సంవత్సరముల కాలములో ఒక స్త్రీల గుంపుతో సర్వే నిర్వహించింది. కోపం మనస్సునందుంచుకొనని వారికంటె దీర్ఘకాల, అంతర్గత వైరమున్నట్లు తేటగా సూచనలున్న వారిలోనే మూడింతలు ఎక్కువగా మరణములు సంభవిస్తున్నట్లు ఆమె కనుగొన్నది. ఆమె ఇలా ముగిస్తున్నది: “అనేకమంది స్త్రీలలో పొగత్రాగుటకంటె, నిత్యం అణగారిన కోపమే వారి అకాల మరణానికి బలమైన కారణమౌతున్నట్లు కనబడుతుంది.”
అట్టి విజ్ఞాన శాస్త్ర పరిశోధనల కంటె వేల సంవత్సరాల ముందే బైబిలు కోపమును గూర్చి హెచ్చరించింది: “సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచి యుండకూడదు,” అని ఒక వచనం సలహా యిస్తుంది. (ఎఫెసీయులు 4:26) “కోపము మానుము ఆగ్రహము విడిచి పెట్టుము” అని మరొక వచనం సలహా యిస్తుంది. (కీర్తన 37:8) అంతకంటె ముఖ్యముగా, మన భావోద్రేక స్థితికి మన శారీర ఆరోగ్యమునకు మధ్యనున్న సంబంధమును గూర్చి బైబిలు యిట్లు నొక్కి తెలిపినది: “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము.”—సామెతలు 14:30 (g91 7/22)
[14వ పేజీలోని చిత్రం]
కాటికాపరి కోపిష్టివాన్ని చూచి, తనకొక “ఖాతాదారుడు” వచ్చునని సంతోషంతో ఎదురుచూచును