కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 152
  • కోపం గురించి బైబిలు ఏం చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కోపం గురించి బైబిలు ఏం చెప్తుంది?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • కోపం చూపించడం ఎప్పుడూ తప్పేనా?
  • కోపం చూపించడం ఎప్పుడు తప్పు?
  • కోపాన్ని ఎలా అదుపు చేసుకోవచ్చు?
  • కోపపడడం అన్నివేళలా తప్పేనా?
    తేజరిల్లు!—1994
  • భావోద్వేగపరమైన ఆరోగ్యం
    తేజరిల్లు!—2019
  • మీ కోపాన్ని ఎందుకు అదుపు చేసుకోవాలి?
    తేజరిల్లు!—1997
  • కోపం మిమ్మల్ని ఏలనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 152
పిడికిలి బిగించడం

కోపం గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

అదుపులేని కోపం దాన్ని చూపించేవాళ్లకు, వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లకు ప్రమాదకరమని బైబిలు చెప్తుంది. (సామెతలు 29:22) కొన్నిసార్లు కోపం చూపించడం సరైనదే అయినా “విపరీతమైన కోపం” చూపిస్తూ ఉండేవాళ్లు రక్షణ పొందరని బైబిలు చెప్తుంది. (గలతీయులు 5:19-21) కోపాన్ని అదుపు చేసుకోవడానికి సహాయం చేసే సూత్రాలు బైబిల్లో ఉన్నాయి.

  • కోపం చూపించడం ఎప్పుడూ తప్పేనా?

  • కోపం చూపించడం ఎప్పుడు తప్పు?

  • కోపాన్ని ఎలా అదుపు చేసుకోవచ్చు?

  • కోపం గురించిన బైబిలు సలహాలు

కోపం చూపించడం ఎప్పుడూ తప్పేనా?

కాదు. కొన్ని సందర్భాల్లో కోప్పడడం తప్పు కాకపోవచ్చు. ఉదాహరణకు, తన తోటి ఆరాధకులు బాధపడుతున్నారని తెలిసినప్పుడు నమ్మకస్థుడైన నెహెమ్యా ‘మిగుల కోపపడ్డాడు.’—నెహెమ్యా 5:6.

కొన్ని సందర్భాల్లో దేవుడికి కూడా కోపం వస్తుంది. ఉదాహరణకు, ఇశ్రాయేలు ప్రజలు తనను మాత్రమే ఆరాధించాలని చేసుకున్న ఒప్పందాన్ని మీరి అబద్ధ దేవుళ్లను పూజించినప్పుడు “యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను.” (న్యాయాధిపతులు 2:13, 14) అయితే, యెహోవా దేవుని వ్యక్తిత్వంలో కోపం ప్రధాన భాగం కాదు. ఆయన కోపం ఎప్పుడూ సరైనది, అది అదుపు చేసుకోగలిగేది.—నిర్గమకాండము 34:6; యెషయా 48:9.

కోపం చూపించడం ఎప్పుడు తప్పు?

అదుపులేకుండా లేదా సరైన కారణం లేకుండా కోపం చూపించడం తప్పు. అపరిపూర్ణ మనుషులు తరచూ అలా చేస్తారు. ఉదాహరణకు:

  • దేవుడు తన అర్పణను తిరస్కరించినప్పుడు కయీనుకు “మిక్కిలి కోపం” వచ్చింది. కయీను తన తమ్ముణ్ణి చంపేంతగా కోపాన్ని పెంచుకున్నాడు.—ఆదికాండము 4:3-8.

  • దేవుడు నీనెవె ప్రజల మీద కనికరం చూపించినప్పుడు యోనా ప్రవక్త కూడా ఎంతో ‘కోపగించుకున్నాడు.’ యోనా కోపగించుకోవడం న్యాయం కాదని చెప్తూ దేవుడు అతన్ని సరిదిద్దాడు. అంతేకాకుండా పశ్చాత్తాపపడిన ఆ పాపుల మీద దయ చూపించాలని అతనికి చెప్పాడు.—యోనా 3:10–4:1, 4, 11.a

ఈ ఉదాహరణలు, అపరిపూర్ణ మనుషుల “కోపం దేవుడు కోరే నీతిని సాధించదు” అని స్పష్టంగా చూపిస్తున్నాయి.—యాకోబు 1:20.

కోపాన్ని ఎలా అదుపు చేసుకోవచ్చు?

  • అదుపులేని కోపం వల్ల వచ్చే ప్రమాదాల్ని పసిగట్టండి. కొంతమంది కోపం చూపించడమే బలమని అనుకుంటారు. నిజానికి కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం తీవ్రమైన బలహీనత. “ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.” (సామెతలు 25:28; 29:11) ఇంకో మాటలో చెప్పాలంటే, కోపాన్ని అదుపుచేసుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటే మనకు నిజమైన బలం, వివేచన ఉందని చూపిస్తాం. (సామెతలు 14:29) బైబిలు ఇలా చెప్తోంది: “కోప్పడే విషయంలో నిదానించేవాడు బలశాలి కన్నా బలవంతుడు.”—సామెతలు 16:32, NW.

  • పశ్చాత్తాపపడే పరిస్థితి రాకుండా, ముందే మీ కోపాన్ని అదుపుచేసుకోండి. “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము” అని కీర్తన 37:8 చెప్తుంది. మనకు కోపం వచ్చినప్పుడు ‘కీడు’ చేయకముందే దాన్ని తగ్గించుకోవడం మన చేతిలో పనని గమనించారా! ఎఫెసీయులు 4:26 చెప్తున్నట్లు, “మీకు కోపం వచ్చినా పాపం మాత్రం చేయకండి.”

  • గొడవ పెద్దదౌతున్నప్పుడు వీలైతే అక్కడినుండి వెళ్లిపోండి. “కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము” అని బైబిలు చెప్తోంది. (సామెతలు 17:14) త్వరగా గొడవలు పరిష్కరించుకోవడం తెలివైన పనే అయినప్పటికీ, ప్రశాంతంగా మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకోవాలంటే, ముందు మీరిద్దరూ కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉండాలి.

  • వాస్తవాల్ని తెలుసుకోండి. “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును” అని సామెతలు 19:11 చెప్తుంది. ఒక ముగింపుకు వచ్చేముందు వాస్తవాలన్నీ తెలుసుకోవడం తెలివైన పని. మనం జాగ్రత్తగా విని, విషయాన్ని అన్ని వైపుల నుండి చూసినప్పుడు, సరైన కారణం లేకుండా కోపం తెచ్చుకునే అవకాశం తక్కువ ఉంటుంది.—యాకోబు 1:19.

  • మనశ్శాంతి కోసం ప్రార్థించండి. ప్రార్థన వల్ల మీరు “మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి” పొందగలుగుతారు. (ఫిలిప్పీయులు 4:7) దేవుని పవిత్రశక్తి పొందడానికి ప్రార్థన ఒక ముఖ్యమైన మార్గం. అది మనలో శాంతి, సహనం, ఆత్మనిగ్రహం వంటి లక్షణాల్ని కలిగిస్తుంది.—లూకా 11:13; గలతీయులు 5:22, 23.

  • స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. మనం ఎవరితో స్నేహం చేస్తామో వాళ్లలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. (సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33) కాబట్టి మంచి కారణంతోనే బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము.” ఎందుకని? “నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.”—సామెతలు 22:24, 25.

కోపం గురించిన బైబిలు సలహాలు

సామెతలు 16:32, NW: “కోప్పడే విషయంలో నిదానించేవాడు బలశాలి కన్నా బలవంతుడు.”

భావం: కోపాన్ని అదుపు చేసుకోవడం ఒక బలం.

సామెతలు 17:14: “కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.”

భావం: ఎదుటి వ్యక్తి కోపం పెరుగుతుంటే అక్కడినుండి వెళ్లిపోండి.

సామెతలు 19:11: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును.”

భావం: అనవసరంగా వచ్చే కోపాన్ని తగ్గించుకోవాలంటే, వెంటనే ఒక ముగింపుకు రాకుండా పరిస్థితిని అన్ని వైపుల నుండి చూడండి, వాస్తవాల్ని తెలుసుకోండి.

సామెతలు 22:24, 25: ‘కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగియుండకుము. నీవు వాని మార్గములను అనుసరించుదువేమో.’

భావం: త్వరగా కోపం తెచ్చుకునేవాళ్లతో స్నేహం చేస్తే మనం కూడా వాళ్లలాగే ప్రవర్తించే అవకాశం ఉంది.

సామెతలు 29:11: “బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును.”

భావం: కోపం మనల్ని అదుపు చేసే బదులు మనం దాన్ని అదుపు చేయడం తెలివైన పని.

గలతీయులు 5:22, 23: “పవిత్రశక్తి మనుషుల్లో పుట్టించే లక్షణాలు ఏమిటంటే: ప్రేమ, సంతోషం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనిగ్రహం.”

భావం: దేవుని పవిత్రశక్తి మనలో పుట్టించే లక్షణాలు మన కోపాన్ని తగ్గించుకోవడానికి సహాయం చేస్తాయి.

ఎఫెసీయులు 4:26: “మీకు కోపం వచ్చినా పాపం మాత్రం చేయకండి.”

భావం: మనం అన్ని సందర్భాల్లో కోపం రాకుండా చూసుకోలేకపోవచ్చు, కానీ దాన్ని అదుపుచేసుకోగలం.

యాకోబు 1:19: “ప్రతీ ఒక్కరు వినడానికి సిద్ధంగా ఉండాలి, తొందరపడి మాట్లాడకూడదు, త్వరగా కోపం తెచ్చుకోకూడదు.”

భావం: మనం వినడానికి సిద్ధంగా ఉంటే కోపాన్ని తగ్గించుకోగలం.

a దేవుడిచ్చిన దిద్దుబాటును స్వకరించి, యోనా తన కోపాన్ని తీసేసుకొని ఉంటాడు. ఎందుకంటే బైబిల్లోని యోనా పుస్తకాన్ని రాయడానికి దేవుడు అతన్ని ఉపయోగించుకున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి