కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwhf ఆర్టికల్‌ 1
  • కోపాన్ని అదుపుచేసుకోవడం ఎలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కోపాన్ని అదుపుచేసుకోవడం ఎలా?
  • కుటుంబం కోసం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరేం తెలుసుకోవాలి?
  • మీరేం చేయవచ్చు?
  • కోపం గురించి బైబిలు ఏం చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • కోపపడడం అన్నివేళలా తప్పేనా?
    తేజరిల్లు!—1994
  • వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు . . .
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • కోపం మిమ్మల్ని ఏలనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కుటుంబం కోసం
ijwhf ఆర్టికల్‌ 1
తను అంట్లు తోముతుంటే భర్త టీవీ చూస్తున్నాడని భార్య కోపంగా ఉంది

కుటుంబం కోసం

కోపాన్ని అదుపుచేసుకోవడం ఎలా?

మీ భర్త/భార్య మీకు కోపం తెప్పించే ఏదోక మాట అన్నారు, లేదా అలాంటి పని చేశారు, మీరు కోపాన్ని అణచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈలోగా అతను/ఆమె ఏదో తప్పు జరిగిందని గమనించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. దాంతో మీ కోపం ఇంకా పెరిగిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో మీ కోపాన్ని అదుపుచేసుకోవడం ఎలా?

  • మీరేం తెలుసుకోవాలి?

  • మీరేం చేయవచ్చు?

మీరేం తెలుసుకోవాలి?

  • కోప్పడడం ఆరోగ్యానికి మంచిది కాదు. అదుపులేని కోపం వల్ల హై బీపీ, గుండె జబ్బులు, డిప్రెషన్‌, జీర్ణకోశ వ్యాధుల వంటి సమస్యలు ఎక్కువౌతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాదు, కోపం వల్ల నిద్రపట్టకపోవడం, ఆందోళన పెరిగిపోవడం, చర్మ వ్యాధులు, స్ట్రోక్‌ లాంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే బైబిలు ఇలా చెప్తోంది: “కోపము మానుము ... అది కీడుకే కారణము.”—కీర్తన 37:8.

  • కోపాన్ని అణచుకోవడం కూడా మంచిది కాదు. కోపాన్ని అలాగే మనసులో ఉంచుకుంటే అది జబ్బులా లోపలి నుండి మిమ్మల్ని తినేస్తుంది. ఉదాహరణకు, దానివల్ల మీకు వెటకార ధోరణి, విమర్శించే స్వభావం అలవాటు కావచ్చు. అలాంటి స్ఫూర్తి వల్ల మీతో కలిసి ఉండడం కష్టం కావచ్చు, మీ వివాహ బంధానికి తీవ్ర నష్టం జరగవచ్చు.

మీరేం చేయవచ్చు?

  • మీ భర్త/భార్యలో ఉన్న మంచి లక్షణాలు చూడండి. మీ భర్త/భార్యలో మీకు నచ్చే మూడు లక్షణాలు ఏమిటో రాయండి. ఈసారి అతనిమీద/ఆమెమీద కోపం వచ్చినప్పుడు ఆ మంచి లక్షణాల గురించి ఆలోచించండి. దానివల్ల మీ కోపం తగ్గవచ్చు.

    బైబిలు సూత్రం: “కృతజ్ఞులై ఉండండి.”—కొలొస్సయులు 3:15.

    ఒక భార్య పని చేసుకుంటూ, తన భర్త ఇంటిపనుల్లో ఎలా సహాయం చేస్తాడో, ఆమె చెప్పేది ఎలా వింటాడో, తనకు బాగోలేనప్పుడు ఎలా శ్రద్ధగా చూసుకుంటాడో ఆలోచిస్తోంది
  • క్షమించే స్ఫూర్తి అలవర్చుకోండి. ముందుగా, విషయాల్ని మీ భర్త/భార్య వైపు నుండి చూడడానికి ప్రయత్నించండి. దానివల్ల మీరు “సహానుభూతిని” అలవర్చుకోగలుగుతారు. (1 పేతురు 3:8) తర్వాత, ‘ఇది నేను క్షమించలేనంత పెద్ద తప్పా?’ అని ఆలోచించండి.

    బైబిలు సూత్రం: “తప్పులు క్షమించుట ... ఘనతనిచ్చును.”—సామెతలు 19:11.

  • మీ భావాల్ని దయతో, నొప్పించకుండా చెప్పండి. ఎక్కువగా “నేను,” “నాకు” అంటూ మాట్లాడండి. ఉదాహరణకు, “నా మీద నీకు శ్రద్ధ లేదు, అందుకే ఎక్కుడున్నావో ఫోన్‌ చేసి చెప్పవు” అనే బదులు “నువ్వు రావడం ఆలస్యమైతే నాకు కంగారుగా ఉంటుంది, ఎలా ఉన్నావో అని అనిపిస్తుంది” అని చెప్పండి. మృదువుగా మాట్లాడడం వల్ల మీ కోపం తగ్గవచ్చు.

    బైబిలు సూత్రం: “ఉప్పుతో ఆహారానికి రుచి వచ్చినట్టు, మంచితనంతో మీ మాటలకు రుచి వస్తుంది.”—కొలొస్సయులు 4:6.

  • గౌరవపూర్వకంగా వినండి. మీకు ఏమనిపిస్తుందో చెప్పాక, మీ భర్తను/భార్యను మాట్లాడనివ్వండి, మధ్యలో అడ్డుపడకండి. అతను/ఆమె చెప్పడం పూర్తయ్యాక, ఆ మాటల్లో మీకేం అర్థమైందో చెప్పండి; దానివల్ల మీరు సరిగ్గా అర్థంచేసుకున్నారో లేదో తెలుస్తుంది. కేవలం వినడం అనే చిన్న పని కూడా మీ కోపాన్ని తగ్గించుకోవడానికి ఎంతో సహాయం చేయవచ్చు.

    బైబిలు సూత్రం: “వినడానికి సిద్ధంగా ఉండాలి, తొందరపడి మాట్లాడకూడదు.”—యాకోబు 1:19.

టిమ్‌, జెన్నిఫర్‌

“మీరు కోపాన్ని మనసులో అలాగే ఉంచుకుంటే, సమస్య మళ్లీమళ్లీ తలెత్తుతుంది, ఏదోకరోజు మీ కోపం కట్టలు తెంచుకుంటుంది. కాబట్టి సమస్య గురించి గౌరవపూర్వకంగా మాట్లాడుకోవడం మంచిది. అలా మాట్లాడుకున్నాక నేను, నా భర్త ‘మళ్లీ ఎప్పటిలా ఫ్రెండ్స్‌గా ఉందాం’ అని చెప్పుకుంటాం.”—జెన్నిఫర్‌, ఆమె భర్త టిమ్‌తో కలిసి.

జేడ్‌, కోరే

“నా భర్తలో నాకు నచ్చే విషయం ఏమిటంటే, అతను నేను చెప్పే మాటల్ని ఎప్పుడూ వింటాడు, నా ఆలోచనల్ని అర్థం చేసుకుంటాడు. అతను వాటితో అంగీకరించకపోయినా, విషయాన్ని నా వైపు నుండి కూడా చూడడానికి ప్రయత్నిస్తాడు. నేను అలా అనుకుంటున్నానేంటి అని ఎప్పుడూ నన్ను చిన్నచూపు చూడడు.”—జేడ్‌, ఆమె భర్త కోరేతో కలిసి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి