కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 8/8 పేజీలు 15-17
  • పొగత్రాగుట నిజంగా అంత చెడ్డదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పొగత్రాగుట నిజంగా అంత చెడ్డదా?
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పొగత్రాగుట—దీని తరంగం వెనుదిరిగెనా?
  • పొగత్రాగుటకు వ్యతిరేకముగా చేసే ప్రచారములు—క్రొత్తవేమీ కావు!
  • పొగత్రాగుట—నీ శరీరానికేమి చేస్తుంది
  • నీవే నిర్ణయించుకో
  • సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?
    తేజరిల్లు!—1996
  • పొగత్రాగాలని కలిగే వత్తిడిని నేనెలా ఎదిరించగలను?
    తేజరిల్లు!—1992
  • పొగాకు ప్రతివాదుల మాటలు నీటిమూటలు
    తేజరిల్లు!—1995
  • పొగతాగడం గురించి దేవుడు ఏమంటున్నాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 8/8 పేజీలు 15-17

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

పొగత్రాగుట నిజంగా అంత చెడ్డదా?

ఓరెన్‌ చిన్నవాడుగా ఉన్నప్పటి నుండి పొగత్రాగుట అతనిని ఆకర్షించింది. వాని ఆంటీ సిగరెట్లు కాల్చినపుడెల్లా అతనిని అగ్గిపుల్లను ఆర్పనిచ్చేది. 16 ఏండ్ల వయస్సులో తానే స్వయంగా పొగత్రాగి చూడాలని నిర్ణయించుకున్నాడు. ఒక విందుకు వెళ్లి అక్కడ ఒక అమ్మాయిని సిగరెటు ఇమ్మని అడిగి తీసుకున్నాడు. గానీ దాన్ని పూర్తిగా త్రాగక ముందే వాంతి చేసుకున్నాడు.

అతని పురుషాహంకారం దెబ్బతిన్నది, ఓరెన్‌ పొగత్రాగుట “అలవాటు” చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు సాయంకాలం సుష్టుగా భోంచేసిన తర్వాత భయం భయంగానే ఓ సిగరెట్‌ వెలిగించి దమ్ములాగాడు. ఎంత ఆశ్చర్యం! ఈసారి కళ్లు తిరగలేదు, కక్కు రాలేదు. ఆనందంతో మరల మరల దమ్ములాగాడు. ఆ సిగరెట్‌ అయిన తర్వాత ఇంకా ఒకటి ఇలా ఆరు సంవత్సరాలపాటు ఓరెన్‌ ఒకదానివెంట మరొకటి ఎడతెరపి లేకుండా తాగే అలవాటు చేసుకున్నాడు.

పొగత్రాగుట—దీని తరంగం వెనుదిరిగెనా?

ఈనాడు అనేకమంది యౌవనస్థులు ఓరెన్‌ క్రియలను చూచి పరిహసించ వచ్చును. అమెరికా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం రోజు ఒకటి లేక ఎక్కువ సిగరెట్‌ ప్యాకెట్లు త్రాగేవ్యక్తి “చాలా అపాయస్థితిలో” వున్నట్లేనని 66 శాతం యౌవనస్థులు నమ్మిరి. తమాషా ఏమిటంటే, పొగత్రాగే వారినుండి దాన్ని గూర్చిన గట్టి ఆక్షేపణలు వినవస్తున్నవి! పొగత్రాగే ఒక 16 సం. ల కుర్రాడు “అదొక తుచ్ఛమైన అలవాటు” అని అంటున్నాడు. ఒక అధ్యయనంలో తేలినదేమనగా, పొగత్రాగిన యౌవనస్థులలో 85 శాతం మంది అది హానికరమని అనుకున్నట్లు ఒప్పుకున్నారు. వారిలో సగం మంది తాము ఈ అలవాటును అయిదు సంవత్సరములలో విడిచిపెట్టదలిచామని చెప్పారు.

గనుక స్పష్టంగా గమనిస్తే పొగాకునుగూర్చి దీర్ఘకాలంగావున్న జనాదరణను ఊడ్చుకొని పోయే పెద్ద అసమ్మతి తరంగమొకటి దాన్ని భయపెట్టుచున్నది. రెడ్యూసింగ్‌ ది హెల్త్‌ కాన్సిక్వెన్‌సెస్‌ ఆఫ్‌ స్మోకింగ్‌—25 ఇయర్స్‌ ఆఫ్‌ ప్రోగ్రెస్‌ అనే పేరుతోవున్న అమెరికా సర్జన్‌ జనరల్‌ 1989 నివేదికనందు ఇలా చెబుతున్నాడు: “1940, 1950 దశాబ్దములలో పొగత్రాగుట ఒక ఠీవిగా వుండేది; ఇప్పుడైతే ఎక్కువగా అది తిరస్కరించబడుతుంది. సినిమా స్టార్లు, క్రీడానాయకులు మరియు ఇతర సుప్రసిద్ధులు సిగరెట్‌ ప్రకటనలలో ప్రత్యక్షమౌతూ వుండేవారు. ఈనాడు నటీనటులు, క్రీడాకారులు, పుర ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు అరుదుగా పొగత్రాగుతూ కనిపిస్తారు . . . జనాబాలో అధికసంఖ్యాకులు పొగత్రాగుట మానివేస్తున్నారు.”

అమెరికాలోని వయోజనులలో 40 శాతమే 1965 సంవత్సరములో పొగత్రాగారు. 29 సంవత్సరముల అనంతరం 29 శాతం మాత్రమే పొగత్రాగారు. ఆ శస్త్రచికిత్స జనరల్స్‌ నివేదిక ఇంకా తెల్పునదేమనగా “ఎప్పుడైనా ఒకసారి పొగత్రాగిన వారిలో జీవించియున్న పెద్దలలో సగంమంది దాన్ని వదలిపెట్టారు.” 1976లో హైస్కూలుకు వెళ్లే, సీనియర్‌ విద్యార్థులలో షుమారు 29 శాతం ప్రతిరోజు పొగత్రాగేవారు. ఒక దశాబ్దం తర్వాత, 19 శాతమే త్రాగారు.

గనుక పొగత్రాగుటను గూర్చి యింకా కొంత అధికంగా చెప్పుట అనవసరమనిపిస్తుంది. పొగత్రాగుటను గూర్చిన వ్యతిరేక ప్రచారములు, వైద్యుల గట్టి హెచ్చరికలున్నప్పటికిని ప్రపంచం మొత్తం మీద పొగత్రాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. అమెరికాలో షుమారు 5 కోట్లమంది పొగత్రాగుచున్నారు. ఓరెన్‌కు జరిగిందే ఇతర అనేకమంది యౌవనస్థులకు జరుగుతుంది. ఒక అమెరికాలోనే ప్రతిరోజు షుమారు 3,000 మంది యౌవనస్థులు మొట్టమొదటి సారిగా సిగరెట్‌ వెలిగిస్తున్నారు. అలా చూస్తే, ప్రతి సంవత్సరము పదిలక్షలమంది క్రొత్తగా పొగత్రాగే వారి గొప్ప సంఖ్యను కలుపవలసి వస్తుంది! ఆశ్చర్యకరమైన విషయమేమంటే, క్రొత్తగా పొగత్రాగుటకు అలవాటు పడినవారిలో యువతులే ఎక్కువగా వున్నారు.

పొగత్రాగుటకు వ్యతిరేకముగా చేసే ప్రచారములు—క్రొత్తవేమీ కావు!

ప్రజలకు దీనిగూర్చిన అపాయములు తెలియవని కాదు. పొగత్రాగుట మానుకొనుటకు అవసరమైన వైజ్ఞానిక కారణములను పరిశోధకులు చూపకముందే ప్రజలకున్న ఇంగితజ్ఞానము ద్వారా ఇదొక నీచమైన దురలవాటని వారు తెలుసుకున్నారు. షుమారు 90 సంవత్సరాల క్రితమే అమెరికాలో అనేక భాగములందు సిగరెట్లు చట్టవిరుద్ధమైనవని పరిగణించబడినవి. కొన్ని ప్రాంతాల్లో సిగరెట్లు దగ్గర వుంచుకుంటే కూడ అరెస్టుకు ఆధారముండేది. అంతకుముందు తరాలలో పొగత్రాగే విషయంలో అంతకంటె కఠినచర్యలు తీసుకునేవారు.

స్మితానియన్‌ పత్రిక 17వ శతాబ్దంలో పొగత్రాగుటకు వ్యతిరేకముగా తీసుకున్న కొన్ని చర్యలనుగూర్చి ఇలా వివరిస్తుంది: “చైనాలో, 1638 సంవత్సరమున విడుదలైన చక్రవర్తి శాసనం, పొగాకు వినియోగం శిరచ్ఛేదన శిక్ష విధించే నేరముగా పేర్కొన్నది. . .రష్యాలో పొగత్రాగే వారిని బెత్తముతో కొట్టేవారు; మాటిమాటికి చేసే నేరస్థుల ముక్కు రంధ్రాలను నిలువునా చీల్చేవారు; మొండిగా ఆజ్ఞాతిక్రమం చేసేవారిని సైబీరియాకు బంధీలుగా పంపేవారు. పర్షియాలో అట్టివారిని హింసించేవారు, కొయ్యకు వ్రేలాడదీసేవారు లేదా శిరచ్ఛేదనం చేసేవారు.”

నిజమే అట్టి క్రియలు దారుణమైనవి, క్రూరమైనవే. అయితే పొగత్రాగేవారుకూడ వారు చేసే ఆ క్రియనుబట్టి వారి శరీరముల ఎడల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.

పొగత్రాగుట—నీ శరీరానికేమి చేస్తుంది

నికొటిన్‌ అనే విషక్షారపదార్థమే పొగాకుకున్న దుష్ప్రభావము. అయిననూ, ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతుంది: “ఓ గుటికెడు నికోటిన్‌—షుమారు 60 మిల్లీగ్రాములు ఒకే గ్రుక్కలో తాగితే పెద్దవారిని దెబ్బకు చంపుతుంది. ఒక సిగరెట్‌లో 1 మిల్లిగ్రాం నికొటిన్‌ ఉంటుంది.”

నికొటిన్‌ శక్తివంతమైన వ్యసనమును కలుగజేసేది. అమెరికా సర్జన్‌ జనరల్‌ నివేదిక యిట్టి నిర్ణయాని కొచ్చింది: “పొగత్రాగేవారిలో అధికులు యౌవనదశలోనే ప్రారంభించి తర్వాత వారు దానికి బానిస లౌతారు. ఈనాడు 80 శాతం మంది పొగత్రాగేవారు దాన్ని మానుకోవాలని యిష్టపడుచున్నారు; మూడింట-ఇద్దరు పొగత్రాగేవారు మానుకోవడానికి ఒక్కసారైనా తీవ్రంగా ప్రయత్నించారు.” అలా చేసే ప్రయత్నాలవల్ల మానుకునే సమయంలో వచ్చే బాధాకరమైన వత్తిళ్లకు గురౌతున్నారు: అవేమనగా పొగాకు కావాలనే తపన, వ్యాకులత, చిరచిరలాడుట, ఆదుర్దా, తలనొప్పులు, మగత, కడుపులో త్రిప్పుట, ఏకాగ్రత నిలుపలేకపోవుట మొదలగునవి.

అయినను, సిగరెట్లు ఒకనిని నికొటిన్‌తో మలినపరచుట కంటె యింకా ఎక్కువే హాని చేయును; వెలిగించిన సిగరెట్‌ నిశ్చయంగా ఒక విషపదార్థ కర్మాగారమైవుండి 4,000 విభిన్న రసాయనిక మిశ్రమాలను వెదజల్లుతుంది. వీటిలో నలభై-మూడు రసాయనిక పదార్థములు క్యాన్సర్‌ రావడానికి కారణమౌతున్నాయని గుర్తింపబడినవి. వాటిలో కొన్ని ఊపిరితిత్తులకు, శ్వాసకోశ నాళములకు అంటుకొనిపోయే తారువంటి జిగురు పదార్థాల రూపంలో ఉన్నవి. ఇది తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సరుకు నడుపగలదు. పొగత్రాగుటవలన “మూత్రాశయము, జఠర రస గ్రంధులు మరియు మూత్రపిండములకు క్యాన్సర్‌ సోకే ప్రమాదమున్నదనియు, ఉదర కోశము యొక్క క్యాన్సరుకు కారణమని” కూడ తలంచబడినది.—రెడ్యూసింగ్‌ ది హెల్త్‌ క్వాన్‌సిక్వెన్‌సెస్‌ ఆఫ్‌ స్మోకింగ్‌.

పొగత్రాగే వ్యక్తికి క్యాన్సర్‌ రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చును. అయితే ఒక్క సిగరెట్‌ త్రాగినా చాలా అపాయమే. అందులోని నికొటిన్‌ అనే పదార్థం నీ గుండెను వేగంగా కొట్టుకునేటట్లు చేసి, ప్రాణవాయువు కావలెనని నీ శరీరములో వత్తిడిని పెంచుతుంది. దురదృష్టమేమంటే, సిగరెట్‌ పొగలో కార్బన్‌ మోనాక్సైడ్‌ కూడ ఉంది—అది మోటారు వాహనములనుండి వెలువడే విషవాయువు వంటిది. ఈ విష పదార్థము రక్తములోనికి నేరుగా వెళ్లి ప్రాణవాయువు హృదయానికి చేరకుండ ఆటంకపరుస్తుంది. దానికంటి విపరీతంగా నికొటిన్‌, రక్త నాళిములను సంకుచితపరిచి ప్రాణవాయువు ప్రసరణ ఇంకా తగ్గిస్తుంది. అందుకే పొగత్రాగే వారికి గుండె జబ్బు చాలా ఎక్కువగా వస్తుంది.

జీర్ణావయవముల వ్రణములు, గర్భస్రావములు, వికలాంగ సంతానం, పక్షవాతములు—యీ పొగత్రాగే వారెదుర్కొను కొన్ని ఇతర ప్రమాదములు. ప్రతిసంవత్సరం ప్రపంచమంతట పొగత్రాగుట మూలంగా 25 లక్షలమంది మరణిస్తున్నారు. వీరిలో 4,00,000 మంది ఒక్క అమెరికాలోనే చనిపోతున్నారు. అమెరికా సర్జన్‌ జనరల్‌ ఇలా వివరిస్తున్నాడు: “అమెరికాలోని ఆరింటిలో ఒక్క మరణం పొగత్రాగుట మూలంగానే సంభవిస్తుంది. మన సమాజంలో మరణమును నిరోధించగల అతి ప్రాముఖ్యమైన ఏకైక మూలం పొగత్రాగకుండుటే.” కొందరు ఆరోగ్య అధికారుల భయమేమనగా ఇప్పుడు 20 సంవత్సరాల లోపు వయస్సున్న దాదాపు 20 కోట్లమంది చివరికి యీ పొగత్రాగుటవల్లనే చనిపోతారు.

అయితే పొగత్రాగేవారు తమకు మాత్రమే హాని కల్గించుకొనుటలేదు. వారినుండి వచ్చే విషవాయువులను ఇతరులు బలవంతంగా పీల్చకునేటట్లు చేస్తున్నందున పొగత్రాగని వారిని కూడ వీరు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఇతర శ్వాసకోశ రోగాలకు గురిచేస్తున్నారు.

నీవే నిర్ణయించుకో

పొగాకు వలన కలిగే అపాయములను గురించి లేదా దాన్ని వుపయోగించుట మానండి అని ప్రతి దేశము ప్రజలను హెచ్చరిస్తూ వస్తున్నదనుటలో అంత ఆశ్చర్యంలేదు. అయిననూ అందులోని అపాయములనుగూర్చి పెద్దగా చెప్పుట యౌవనస్థులలో అంత ప్రభావం కనబడుటలేదు. “నేను సిగరెట్‌ కాల్చితే చాలు నాకెంతో ప్రశాంతంగా వుంటుందని నేననుకుంటున్నాను. నాకు క్యాన్సర్‌ వస్తుందని నేనెప్పుడు ఆలోచించను” అని 15 సంవత్సరముల వయస్సున్న హోలి అనే అమ్మాయి అంటుంది.

జ్ఞానయుక్తమైన ఓ సామెత ఇలా హెచ్చరిస్తుంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానములేని వారు యోచింపక ఆపదలో పడుదురు.” (సామెతలు 27:12) పొగాకు అలవాటు మూలంగా వచ్చే శిక్ష అనగా క్యాన్సర్‌, గుండెజబ్బు, శ్వాసకోశవ్యాధులతో బాధపడాలని నీవు నిజంగా కోరుకుంటున్నావా? నికొటిన్‌ వలన వచ్చే హాయి నోటి దుర్వాసన, విపరీతమైన దగ్గు, దంతాలను పసుపుపచ్చగా మార్చే రంగుకంటె సుఖవంతమైనదా?

పొగత్రాగుట మానుకొనుటకు మరో శ్రేష్టమైన కారణమున్నది: అదేమంటే దేవునితో నీ స్నేహాన్ని కాపాడుకొనుటే. నీవెవరికైనా ఓ ఖరీదైన వస్తువును బహుకరిస్తే, అతడు లేక ఆమె దాన్ని విసిరిపారేస్తే, నీవు బాధపడవా? అవును, దేవుడు మనకు ‘జీవమును ఊపిరిని’ దయచేస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:25) ఆ బహుమానాన్ని నీవు దుర్వినియోగం చేసినపుడు ఆయనెంతగా మనస్సు నొచ్చుకుంటాడో ఊహించుము! అందుకే అపొస్తలుడైన పాలు ఇలా వ్రాశాడు: “ప్రియులారా, మనకు యీ వాగ్దానములు ఉన్నవి [దేవునితో అంగీకృతమైన సంబంధం] గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కల్గిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులను చేసికొందము.” (2 కొరింథీయులు 7:1) పొగత్రాగుటయనేది శరీరాన్ని కొంచెం మలిన పరచే దాని కంటె యింకా ఎక్కువ హానిచేస్తుంది, విషపూరిత రసాయనములతో శరీరమంతటిని కలుషితం చేస్తుంది; ఒకని ఆత్మను లేదా మానసిక శక్తిని కూడ పాడుచేస్తుంది. పొగత్రాగుట అవినీతి, స్వార్థం, భక్తిహీనతతో కూడిన క్రియ.

ఇంత హాని ఉన్నప్పటికి యౌవనస్థులింకా పొగత్రాగుటకే శోధింపబడుచున్నారు, మొగ్గు చూపుచున్నారు. మరి ఎందుకలా చేయాలనుకుంటున్నారు, యావనస్థుడెలా అట్టి వత్తిళ్లను తట్టుకొని నిలువగలడు అనే విషయము రాబోవు శీర్షికలో చర్చించబడును. (g91 8/8)

[16వ పేజీలోని చిత్రం]

నీవు దానివశం కాకముందే, కలుగబోవు ఫలితాలనుగూర్చి ఆలోచించుము

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి