యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
క్రైస్తవ కూటములు నాకెట్లు సహాయపడగలవు?
“ఆత్మీయంగా నీవు అభివృద్ధి చెందుటకు చర్చీలు నీకు సహాయం చేయునని నేననుకొనుటలేదు. అంటే, ఒకడు ఆత్మీయంగా వుండాలని కోరుకుంటున్నాడా లేదాయనునది ఒకని యిష్టం అని నా భావం.”—19 సంవత్సరాల కెవిన్ [అబ్బాయి]
కెవిన్ చెప్పేది అనేక విషయాల్లో వాస్తవమే. నిజంగా “తాను ఆత్మీయంగా వుండాలని కోరుకుంటున్నాడా లేదాయని” ప్రతివ్యక్తి నిర్ణయించుకోవాలి. అయితే నీవు ఈ శీర్షికను చదువుచున్నావు గనుక నీవు కనీసం ఆత్మీయంగా వుండాలని కోరుకుంటావు అనేది సాధ్యమే. అయిననూ, ఆత్మీయవ్యక్తి అంటే ఎటువంటివాడు లేక నీవెట్లు అటువంటి వ్యక్తివి కాగలవు అనే విషయంలో కచ్చితమైన నిశ్చయత నీకు లేకపోవచ్చును.
మామూలుగా చెప్పాలంటే ఆత్మీయవ్యక్తి ఎవరంటే మహోన్నతుడైన యెహోవా నడిపింపునకు అతని ఆలోచనలను, అభిప్రాయములను క్రియలను అప్పగించువాడే. ప్రతిదిన నిర్ణయాలు చేయునపుడు, గమ్యము లేర్పరచుకొనునప్పుడు లేదా జీవితంలో ప్రాముఖ్యమైన వాటిని ఎన్నుకున్నపుడు అతడు తన సృష్టికర్తను పరిగణలోనికి తీసుకుంటాడు. అంటే, ఒక ఆత్మీయవ్యక్తి దైవసంబంధియై వున్నాడు.
కౌమారదశలోవున్న నీవు, “ఐహికవిచారము” నిన్ను ఆత్మీయంగా ఎదుగకుండ అడ్డగిస్తున్నట్లు నీవు గమనించవచ్చును. (మత్తయి 13:22) ‘ఎప్పుడూ చెడునే చేయుటకు యిష్టపడే’ తోటివిద్యార్థులతో దినమంత గడుపుట కూడ నిరుత్సాహకరంగానే వుండును. (ఆదికాండము 6:5) మంచిదానిపై నీ మనస్సు నిలుపుటకు నీకు కష్టంకల్గించే రీతిలో బహుశా కొందరు నిన్ను “అపహసించి నిన్నుగూర్చి చెడుగా మాట్లాడెదరు.” (కీర్తన 7:15; 3:8) మరి నీ తలిదండ్రులు లేక కుటుంబంలోని ఇతర సభ్యులు నీ విశ్వాసమును నమ్మకపోతే వారు నీకు ఎటువంటి ఆత్మీయ ప్రోత్సాహమును అందించలేరు. ఇటువంటి వ్యతిరేక ప్రభావముల నెదిరించి ఆత్మీయంగా ఎదుగుటకు నీవేమి చేయగలవు?
నీ వొకటి చేయవచ్చును అదేమంటే యెహోవాసాక్షుల రాజ్యమందిరములోని కూటములకు క్రమంగా హాజరగుటే. చర్చి కూటములవలెకాకుండ, అక్కడ జరిగే కూటములు నీవు “దైవభక్తిని నీ ధ్యేయముగా పెట్టుకొనుటకు నిన్ను ప్రోత్సహించుచు ఆత్మీయ బాల్యదశనుండి ఆత్మీయవయోజనదశ వరకు నీవు వృద్ధిచెందుటకు నీకు సహాయపడును.—1 తిమోతి 4:7; ఎఫెసీయులకు 4:13, 14.
నేర్చుకొనుటకు నీకు సహాయపడు కూటములు
భూలోకమంతట నున్న 63,000 సంఘాలలో యెహోవాసాక్షులు “పురుషులేమి, స్త్రీలేమి పిల్లలేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని ప్రోగుచేయవలెను” అను బైబిలు సలహాను పాటిస్తున్నారు. (ద్వితీయోపదేశకాండము 31:12) గనుక యెహోవాసాక్షులలో నీవంటి అనేకమంది యౌవనస్థులను నీవు చూస్తావు.
లోకమంతటనున్న యెహోవాసాక్షులు అదే విద్యాకార్యక్రమమునందు పాలుపంచుకుంటున్నారు. ఇందులో వారమందు జరిగే ఐదు కూటములున్నవి. ఒక్కొక్కటి ఒక గంట వ్యవధికల్గివున్నవి. ఆ ఐదు కూటములేమనగా:
బహిరంగ ప్రసంగము—బైబిలు మూలంశాన్ని ఉన్నతపరచే ఒక బైబిలు ప్రసంగం.
కావలికోట పఠనము—యెహోవాసాక్షుల ప్రముఖ ప్రచురణయగు కావలికోట పత్రికను వుపయోగించే లోతైన బైబిలు పఠనం.
దైవపరిపాలన పరిచర్య పాఠశాల—క్రైస్తవ పరిచర్యలో నిపుణతలనుగూర్చి బోధించేది.
సేవాకూటము—బైబిలు పఠనము, ఇంటింటి పరిచర్యను గూర్చిన ఫలభరితమైన బోధనా పద్ధతులను చర్చలద్వారా, ప్రదర్శనముల ద్వారా బోధించేది.
సంఘపుస్తక పఠనం—సాధారణంగా ఇండ్లలో చిన్న గుంపులుగా కూడి బైబిలు పఠన పుస్తకమునుపయోగించి ప్రశ్నా సమాధాన రూపంలోచేసే చర్చ.
ఈ కూటములలో అందించబడే విద్యాకార్యక్రమములు “దేవుని మర్మములను సహితం” నీవు గ్రహించునట్లు సహాయపడగలవు. (1 కొరింథీయులు 2:10; సామెతలు 2:5) అయినను కూటములకు హాజరగుటవల్ల ఇతర ప్రయోజనాలున్నవి.
“ఇనుము ఇనుముతో పదునగును”
“దేవున్ని సేవించే ఇతరులతో కలిసి క్రైస్తవుడైవుండుట సులభమే”నని 15 సంవత్సరముల వయసున్న మీషెల్ అంటుంది: “అయితే నీవు బడికి వెళ్లినపుడు అది కష్టతరంగా వుంటుంది ఎందుకంటే నీ తోటి విద్యార్థులు వివిధ నియమాలు గమ్యములు కల్గియున్నారు.” గనుక కూటములకు హాజరగుటవల్ల వచ్చే ఒక ప్రయోజనమేమంటే తోటి విశ్వాసులతో సహవాసము కల్గియుండే అవకాశం పొందుటయే.
జ్ఞానియైన సొలొమోను ఇట్లన్నాడు: “ఇనుముచేత ఇనుము పదునగును. అట్లు ఒకడు మరొకనికి వివేకము కల్గించును.” (సామెతలు 27:17 న్యూ ఇంగ్లీషు బైబిల్) కొన్నిసార్లు మన ఆత్మీయ “వివేకము”, అనగా మన ఆత్మీయ జ్ఞాన వివేచనలకు పదునుపెట్టవలసి వస్తుంది. పదునుపెట్టాలంటే నేర్పు, సరియైన పరికరాలెట్లు అవసరమో నీకు “ఆత్మసంబంధమైన కృపావరమేదైనా మీకిచ్చుటకు” సామర్థ్యము గలవారితో, సరియైన ప్రజలతో నీవు సహావాసము చేయవలయును.—రోమీయులు 1:12.
రాజ్యమందిరములో నీవు వివిధ దేశముల జాతుల వయస్సులోవున్న అట్టివారిని చూస్తావు. నీవు బహుశా నీ సమానులవైపు ఆకర్షింపబడుట గ్రహించదగినదే. అయిననూ, యెహోవాను అనేక సంవత్సరాలనుండి నమ్మకంగా సేవించువారి యెడల విశేషమైన శ్రద్ధవహించుము. (లేవీయకాండము 19:32) వారికున్న లోతైన బైబిలు జ్ఞానంతోపాటు జీవితంలో వారి అనుభవం నీకు బహు గొప్పగా సహాయంచేయగలదు. అటువంటి వారితో పరిచయం ఎలా చేసికొనగలవు? వారిని కొన్ని ప్రశ్నలడుగుటకు ప్రయత్నించుము. అనగా ‘నీవు సత్యంలోనికి ఎలా వచ్చావు”, లేక యౌవనస్థుడివిగా వున్నప్పుడు నీ యొక్క ప్రాంతీయసేవ ఎలావుండెను? వారు నీకు నిశ్చయంగా కొన్ని ఆత్మీయ వరాలను అందించగలరేమో.
నిజమే సంఘంలో ఇతరులను సమీపించునపుడు మొదటిసారి నీవు 12 సంవత్సరాల క్రేగ్ భావించినట్లే భావించవచ్చును, అతడిట్లన్నాడు: “వయస్సులో పెద్దవారితో మాట్లాడాలి అని అంటే నేను భయపడే వాన్ని. నేను ఏమైనా తప్పు చెబితే నాకు ఉపదేశమిస్తారని నేననుకునేవాన్ని.” అతని భావాలకు ఆధారంలేదని క్రేగ్ ఇప్పుడు గమనించాడు. “ఇప్పుడు వారితో నిర్భయంగా మాట్లాడగలుగుచున్నాను” అని అతడు వివరిస్తున్నాడు. సంఘంలో ఆత్మీయ పరిపక్వతగలవారితో సహవాసముచేయుటకు అటువంటి ప్రయత్నమెందుకు చేయకూడదు? అలా చేస్తే, పరిపక్వతగల క్రైస్తవులను గమనించి అనుకరించె ప్రశస్తమైన తరుణం నీకు లభిస్తుంది.—2 థెస్సలొనీకయులు 3:9.
ఒక “శిష్యునికి తగిన నోరు”
నీవు అభివృద్ధి సాధించవలసిన మరొక విషయంలో నీ బోధనా సామర్ధ్యములు ఇమిడియున్నవి. ఉదాహరణకు, నీవు బైబిలు సత్యములను స్పష్టంగా అందించగలవా? చదువుటలో నిజమైన అర్థమును ఎలా జోడించవలెనో నీకు తెలుసా? యెషయా ప్రవక్త ఇలా అన్నాడు: “సర్వోన్నతుడైన ప్రభువగు యెహోవా ఒక శిష్యునికి తగిన నోరును నాకిచ్చెను.” (యెషయా 50:4 NW) మరి తర్ఫీదు మూలంగా నీవు కూడ శిష్యునికి తగిన నోరును పొందగలవు. ఈ విషయంలో ఒక కూటం విశేషంగా నీకు ఉపయోగపడగలదు: అదే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. నీవా పాఠశాలలో ఇంకను చేరలేదా?
క్రైస్తవులు ఇతరులతో మాట్లాడుటకై ఉపదేశము పొందునిమిత్తమే ఆ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల తయారుచేయబడింది. దానికి వయస్సుతో నిమిత్తంలేదు, లేక బాప్తిస్మపుయొక్క అవసరతలేదు. అయిననూ, నీవు చదివి, వ్రాయగల్గివుండాలి, సంఘంతో క్రియశీలక సహవాసాన్ని కలిగివుండాలి మరియు క్రైస్తవ నియమాలకు అనుగుణ్యమైన జీవితాన్ని జీవిస్తు ఉండాలి. ఈ పరిచర్య పాఠశాల ఎలా పనిచేస్తుంది?
అందులోచేరిన తర్వాత ఒక ప్రత్యేక లేఖన అంశము మీద క్లుప్త ప్రసంగం ఇవ్వాలని నీ కిస్తారు. నీ ప్రసంగాన్ని తయారుచేసికొనుటకు శ్రమపడుము. ఉదాహరణకు, వాచ్‌టవర్ పబ్లికేషన్ ఇన్‌డెక్స్ వుపయోగిస్తూ బైబిలు ప్రచురణలను పరిశోధించుటద్వారాను ఇన్‌సైట్ ఆన్ ది స్క్రిప్చ్‌ర్స్a అను బైబిలు నిఘంటువును పరిశీలించుట ద్వారా నీ ప్రసంగాంశమునకు అవసరమయ్యే అదనపు సమాచారమును సేకరించవచ్చును. ఈ విషయంలో నీకు సహాయ మవసరమైతే, నీకు సహాయం చేయవలెనని నీ తలిదండ్రులో లేక అనుభవమున్న క్రైస్తవునినో అడుగుము. నీవు చేసే పరిశోధన నీ ప్రసంగానికి రమ్యతనిచ్చి నీ ఆత్మీయాభివృద్ధిని మరింత దోహదం చేయగలదు.—సామెతలు 2:1-5.
,సంఘంలో నీవొక ప్రసంగమిస్తే, ఆ పాఠశాలను నడిపించే అర్హతగల సేవకుడు నిన్ను జాగ్రత్తగా వింటూ వుంటాడు. నీ ప్రసంగమయిన తర్వాత థియోక్రటిక్ మినిస్ట్రీ స్కూల్ గైడ్‌బుక్‌లోని సమాచారాన్ని ఆధారంచేసికొని ఆయన నీకు తగిన ప్రోత్సాహాన్ని ఈ సలహాను యిస్తాడు. ఆ పుస్తకం మంచి బహిరంగ ప్రసంగికులుగా తయారగుటకు సహాయపడుతుంది. సలహాను చాలా జాగ్రత్తగా వినుము. అది నిన్ను విమర్శించడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి ఇచ్చే సలహా కాదు. ఇవ్వబడే సలహాలు నీకు సహాయం చేయుటకొరకే. నీవు “బహిరంగముగా చదువుటయందు కొనసాగిన ఎడల” నీ ఆత్మీయాభివృద్ధి “అందరికి తేటగా కనబడును.”—1 తిమోతి 4:13-15 NW.
‘నీ పెదవులతో యెహోవాను సన్నుతించుము’
క్రైస్తవకూటములలో ఆత్మీయంగా ఎదుగుటకు మరొక మార్గమేదనగా ప్రేక్షకులు పాల్గొనవలెనని అన్నప్పుడు స్వచ్ఛందంగా సమాధానములు లేక వ్యాఖ్యానములు చేయుటయే. ఇందుకు ముందే సిద్ధపడుట ప్రాముఖ్యముb. అయితే నీవు కూటముకొరకు సిద్ధపడినప్పటికి వ్యాఖ్యానించుటకు కష్టంగానే వున్నట్లు బహుశా నీవనుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో యెహోవా సహాయమునకై అర్థించుము. దావీదు రాజు యిలా ప్రార్థించాడు: “ఓ యెహోవా, నానోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.”—కీర్తన 51:15 NW.
జ్ఞాపకముంచుకొనండి: సమాధానం ప్రోత్సాహము నిచ్చేంతరీతిగా వుండాలంటే చాలా పొడుగుగా ఉండనక్కర్లేదు. 12 సంవత్సరాల రేచెల్ చెప్పినట్లుండాలి: “ఓ పెద్ద ప్రసంగమిచ్చే బదులు, బహుశా ఒక వాక్యములోనే వ్యాఖ్యానిస్తే సరిపోతుంది.” మొదట్లో, కూటములందు మాట్లాడవలెనంటె కష్టమనిపించవచ్చును, నీవు సహాయం కొరకు అడుగవచ్చును అయితే కాలంగడిచేకొలది నీవు రేచెల్ వలెనే భావిస్తావు. ఆమె ఇలా వివరిస్తుంది: “స్వంతగా నీవొక వ్యాఖ్యానంచేస్తే అది నిజంగా నీ వ్యాఖ్యానమే గనుక నీవు అందుకు గర్వపడతావు.” అదియునుగాక, నీ ప్రయత్నముల మూలంగా నీవు ఆత్మీయాభివృద్ధి చెందెదవు.
స్వప్రీతిగల యీనాటి లోకంలో యీనాడు ఆత్మీయ మనస్సు కల్గివుండుట అంత సులభంకాదు. గానీ నీవు క్రమంగా కూటములకు హాజరవుతూ, సిద్ధపడి, భాగం వహిస్తూంటే, నీవు ఆత్మీయంగా ఎదుగుటకు క్రైస్తవకూటములు నిజంగా నీకు సహాయంచేయును. (g91 7/8)
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్, ఇన్‌కార్పొ. చే ప్రచురింపబడింది.
b కూటముల కొరకు ఎలా తయారుకావాలి, ఎలా పాల్గొనాలి అనే అధిక సమాచారంకొరకు, అవేక్! జూన్ 22, 1988, పుటలు 11-13 చూడుము.
[12వ పేజీలోని చిత్రాలు]
దేవుని వాక్యముయొక్క సమర్థవంతమైన బోధకులగుటకు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వేలాదిమంది యౌవనస్థులకు తర్ఫీదు నిచ్చియున్నది