కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 7/8 పేజీలు 17-19
  • నీకు ఎయిర్‌-కండిషనింగ్‌ అవసరమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నీకు ఎయిర్‌-కండిషనింగ్‌ అవసరమా?
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అసౌకర్యమును కల్గించుట
  • అనుకూల ప్రతికూలతలు
  • అవసరతను తీర్చుట
  • నీ కవసరమా?
  • గాలి
    తేజరిల్లు!—2023
  • ఊపిరితిత్తులు—ఒక అద్భుత నిర్మాణం
    తేజరిల్లు!—1992
తేజరిల్లు!—1992
g92 7/8 పేజీలు 17-19

నీకు ఎయిర్‌-కండిషనింగ్‌ అవసరమా?

అది ఉష్ణతాపం అమితంగా వున్నరోజు. నీవు పనినుండి ఇంటికి వెళ్లేటప్పుడు సూర్యుడు నిర్ధాక్షిణ్యంగా నీమీద ఉష్ణతాపాన్ని వెదజల్లుచున్నాడు. అయితే నీ ఇంటి ముఖద్వారాన్ని నీవు తెరువగానే లోపలినుండి చల్లని, సేదదీర్చే గాలి నిన్నాహ్వానిస్తుంది. ఆహా, అదే ఎయిర్‌ కండిషన్‌! అదెంత ఉపశమనాన్ని ఇస్తుందో!

అయితే, అదొక చల్లని చలికాలపు రోజు అని అనుకుందాం, మరి నీవు నీ తలుపు తెరిస్తే, వెచ్చని, మృదువైన గాలి, నిన్నాహ్వానిస్తుంది. అప్పుడు కృతజ్ఞతదో నీకునీవే ‘ఆహా, ఇదే ఎయిర్‌ కండిషన్‌ అని’ చెప్పుకుంటావా?

బహుశా అలా అనవు. అయిననూ అలా అనడం యుక్తమే. “ఎయిర్‌ కండిషన్‌, వాతావరణం వేడిగా వున్నపుడు గాలిని చల్లబరుచును. వాతావరణం చల్లగానున్నప్పుడు గాలిని వెచ్చగా చేయును” అని వరల్డ్‌బుక్‌ ఎన్‌సైక్లొపీడియా వివరిస్తుంది.

అయిననూ “ఎయిర్‌ కండిషన్‌“ అనే మాట సాధారణంగా మూయబడిన ఒక ప్రాంతములోనున్న గాలిని చల్లబరచేదానికి వర్తించును, అది ఒక ఇల్లు, కార్యాలయభవనం, సినిమా థియేటర్‌, మోటారువాహనం, బస్సు, రైలు, లేదా ఏదైనా ఒక మూయబడిన స్థలమే అయ్యి ఉండవచ్చును. అయితే, గాలి ఉష్ణోగ్రతను మార్చుటయేగాక ఎయిర్‌ కండిషన్‌ ఇంకా ఎక్కువ పనిచేస్తుంది; గాలి కదలికను, పరిశుభ్రతను, అందులోని తేమను లేక తడిని అదుపులో పెడుతుంది.

అసౌకర్యమును కల్గించుట

అయితే మూయబడిన ప్రాంతంలో అధిక వేడిని, తేమను ఉత్పత్తిచేసే దేమిటి? వేడికి మూలం సూర్యుడే అనుకోండి. అయిననూ ఇంటిలో, కార్యాలయంలో, మోటారు వాహనములో లేదా మూయబడిన ఏ ఇతర స్థలములోనైనా వున్న నీవు లేక నీతోపాటువున్న ఇతరులు కూడ కారకులే. ఎందుకంటే మానవులమైన మనం వేడిని, తేమను తయారుచేసే యంత్రాలమే. మనమెంత శ్రమిస్తే అంత ఎక్కువ వేడిని తేమను ఉత్పత్తిచేస్తాము. మనం ఊరకనే కూర్చున్నప్పటికి మన శరీరాలు కొంత వేడిని తేమను తయారుచేస్తాయి.

గనుక మనం హాయిగా వుండాలనుకుంటే మనం వదిలే వేడిని, తేమను వదలివేసేంత వేగంగా తీసివేయాలి. దాన్ని అతి వేగంగా తీసివేస్తే, మనకు అతి చలివేస్తుంది. దాన్ని అతి నెమ్మదిగా తీసివేస్తే మనం అతి వేడెక్కుతాము. ఒక పెద్ద గదిలో మౌనంగా కూర్చున్న వందమంది ప్రజలనుండి తయారగు వేడిని, తేమను, తీసివేయాలంటే సాంకేతిక మాటల్లో అది గంటకు షుమారు మూడు టన్నుల శీతలం లేదా 36,000 బిటియులు (బ్రిటీష్‌ థర్మల్‌ యూనిట్స్‌) అవుతుంది.

ఒక బిటియు, అనగా షుమారు ఒక అగ్గిపుల్ల కాల్చగా వచ్చే వేడిమితో సమానంగా వుంటుంది. 252 కాలరీలు ఒక బిటియు తయారుచేసేంత ఉష్ణమునకు సమానంగా వుంటుంది. అట్లు, సదాకూర్చొని పనిచేసేవ్యక్తి వదిలే వేడి షుమారు 360 కాల్చిన అగ్గిపుల్లలు వెదజల్లే ఉష్ణమంత వుంటుంది. అయితే మూసివున్న ప్రాంతంలోనుండి ఒక గుంపు వ్యక్తులు ఉత్పత్తిచేయు ఉష్ణము, బహుశా అక్కడున్న లైట్లు ఇతర విద్యుత్‌ఉపకరణములు ఉత్పత్తిచేసే ఉష్ణంతో సమానంగా వుంటుంది. గనుక ఎయిర్‌ కండిషన్‌ యొక్క ఉపయోగము సులభంగా అర్థంచేసికోగలం.

అనుకూల ప్రతికూలతలు

లోపలి వాతావరణమును ఎక్కువ ఆహ్లాదకరంగా చేయుటయేగాక, దాని సామాగ్రిని సరిగ్గా ఉపయోగిస్తూ వాడుకుంటే ఎయిర్‌ కండిషన్‌ నీ ఆరోగ్యానికి ప్రయోజనకరము కావచ్చును. అది వేడి దద్దులను తీసివేయవచ్చును మరియు తరచు పుప్పొడిని వడపోస్తుంది గనుక ఉబ్బసంవంటి ఒక విధమైన జబ్బుతో బాధపడువారికిది ఉపశమనం కల్గించవచ్చును. ముఖ్యంగా ఉష్ణోగ్రతను తగురీతిలో వుంచుటవలన ఆరోగ్యవిషయంలో వృద్ధులకు ప్రయోజనము కలుగును. మరియు వాడిన గాలిని తీసివేసి స్వచ్ఛమైన దానిని ప్రసరింపజేయుట, దుమ్ము ధూళి తీసివేయుట మొదలగునవి ఎయిర్‌ కండిషన్‌ వలన జరిగేపనులే.

అయినను అదే సమయంలో ఆధునిక ఎయిర్‌ కండిషన్‌, రిఫ్రిజిరేషన్‌ వినియోగించుట, ఆరోగ్య సమస్యలకు కారణం కాగలదు. బయట 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వుండి, ఎయిర్‌ కండిషన్‌ వలన లోపల 26 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణానికి ఉన్న అధిక తేడా మూలాన, చాలమంది రోగగ్రస్థులై పోతున్నారు. నిజానికి, యీ కారణంచేతనే కొందరు ఆధునిక ఎయిర్‌కండిషనర్‌లను వాడుట మానుకొని సీలింగ్‌ ఫ్యాన్‌లను ఉపయోగిస్తూ తత్ఫలితంగా మంచి ప్రయోజనం పొందుచున్నారు.

మరోవైపు గమనిస్తే, కార్యాలయ ఉద్యోగస్థులకు ఎయిర్‌ కండిషన్‌ ఎక్కువ ప్రయోజనకరంగా వున్నట్లు కనబడుతుంది. పూర్తిగా కప్పివేయబడిన మైదానంలో గానీ ఆడిటోరియంలోగాని సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులు యింకా శ్రద్ధగా వినడానికి కూడ యిది సహాయపడుతుంది. అటువంటి ప్రాంతములు వేడిగాను, ధారాళమైన గాలి ప్రసారం కొరవడియున్నపుడు అక్కడున్నవారు చురుకుగా ఉండుట కష్టమని నీవు నిశ్చయంగా అంగీకరిస్తావు.

అనేక పరిశ్రమలు విజయవంతంగా నడచుటకు కూడ ఎయిర్‌ కండిషన్‌ ముఖ్యంగా అవసరం. ఆహార పరిశ్రమకు ఎయిర్‌ కండిషన్‌ విశేషమైన సొత్తు. ఆహారపదార్థములను పాడుచేసే క్రిముల పెరుగుదలను అడ్డగించి సంవత్సరం పొడవునా వాటిని భద్రపరచుకొనుటకు దానివలన వీలౌతుంది. బేకరీలలోని పిండిని బూజుపట్టకుండా చేస్తుంది. మరియు జున్ను గడ్డలను చేయుటకు దానిని ఉపయోగిస్తారు. ఒక నాడు రాక్‌ ఫోర్టు—చీస్‌ను ఫ్రాన్స్‌లో చల్లని, తడిగాలి వున్న ఏవోకొన్ని గుహలలోనే తయారుచేసేవారు. అయితే గుహలలోని వాతావరణమువంటి ఉష్ణోగ్రతయేవున్న ఎయిర్‌ కండిషన్‌లోను ఇతరస్థలాలలోను అటువంటి చీస్‌ను తయారుచేయవచ్చును.

అయిననూ, ఆధునిక ఎయిర్‌ కండిషన్‌ అనేకుల రోగానికి, మరణానికి కారణమైనదని కూడ నిందించబడుచున్నది. ఉదాహరణకు, 1976లో అమెరికా లీజియన్‌ సమావేశమునందు లీజినరీల రోగమని ఆ పిదప గుర్తించబడిన రోగముతో 182 మంది లీజినరీలు వ్యాధిగ్రస్థులయ్యారు, అందులో 29 మంది చనిపోయారు. ఈ రోగ వ్యాప్తిని గూర్చి ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా తెల్పింది: “సెంట్రల్‌ ఎయిర్‌ కండిషన్‌లలోని కలుషితమైన నీరు, చుట్టున్న వాతావరణములోనికి లిజినెల్లా మోఫీలియాను చిరుజల్లుగా వెదజల్లి వ్యాపింపజేయగలదు.” సెంట్రల్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టములను సరిగ్గా నిర్వహించక పోయినందున, అవి ఇతరరోగాలకు కారణభూతమగు కలుషితమైన గాలిని ఉత్పత్తిచేయుటకు దోహదపడియున్నవి.

అవసరతను తీర్చుట

అనేకులు ఎయిర్‌ కండిషన్‌ నిజంగా అవసరమని భావిస్తారు. గతంలో వేసవినందు కిటికీలు లేక ద్వారములకు గడ్డితో అల్లిన తడికెలు తడిపి వ్రేలాడతీసేవారు. అది తేమను ఆవిరి చేయుచున్నందువలన లోపలికి వచ్చేగాలి చల్లబడేది. షుమారు 500 సంవత్సరాల క్రితం మొట్టమొదటి సాంకేతిక పరిజ్ఞానముతో ఫ్యాన్‌ నిర్మించబడింది. అది గాలిని ప్రసరింపజేయుట ద్వారా వేడినుండి ఉపశమనం నిచ్చేది. ఈనాడు కూడ మంచి వేసవి తాపము తప్పించుకొని చల్లగా వుండాలంటే వారికవసరమైందల్లా ఒక మంచిఫ్యాన్‌ అందించే గాలియేనని అనేకులు అనుకుంటున్నారు.

అనేకులు తేమ తక్కువగావున్న ఎడారివంటి ప్రాంతాలలో తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిలో చల్లదనాన్ని అనుభవిస్తారు. అటువంటి పద్ధతిలో బయటనుండి వచ్చేగాలి తడిగా వున్న పీచు తడిక ద్వారా పీల్చబడుతుంది గనుక గాలి భవనంలోపలికి ప్రవేశించకముందే చల్లబడుతుంది. అయితే ఈ పద్ధతిలో గాలిని చల్లబరచేటప్పుడు చల్లనిగాలిని లోపలికి ప్రసరింపజేయునంత వేగంగా లోపలిగాలిని బయటికి పంపివేయునట్లు చేయాలి. ఇందుకు సాధారణంగా కొన్ని కిటికీలు తెరచివుంచితే సరిపోతుంది. అయిననూ యీ పద్ధతిలో ఎయిర్‌ కండిషన్‌ చేయుట తరచూ అసంతృప్తికరంగా వున్నట్లు రుజువైనది. ఎందుకంటే గాలిలోని తేమ అసౌకర్యమైన స్థాయికి పెరుగుతుంది.

గనుక ఇటీవలి కాలంలో గాలిని శీతలీకరించు ఓ పద్ధతి కనిపెట్టబడినపుడు ఆ అవసరం తీరింది. నిజానికి ఆధునిక ఎయిర్‌ కండిషనర్‌ నడిపే సూత్రము, ఆహారాన్ని చల్లగా వుంచుటకుపయోగించే ఇంటిలోవుండే ఒక రెఫ్రిజరేటర్‌ నడిచే పద్ధతి మాదిరిగానే వున్నది. ఆ విధంగా, ఎయిర్‌ కండిషన్‌తోవున్న భవనం—బహుశా నీ ఇల్లు లేదా ఆఫీసు—నిజానికి ఒక పెద్ద రెఫ్రిజరేటర్‌ అవుతుంది.

లోపలి గాలి ఉష్ణోగ్రతను తగ్గించాలంటే, ప్రసరించు వేడిగాలిని చల్లబరచవలసియున్నది. ఇలా జరుగుటకు శీతలీకరించు ఆవిరిచెందే ద్రవపదార్థము (రెఫ్రిజరెంట్‌), రెండు ఆవిరి చెందించే గొట్టపుచుట్టల మీదుగా ప్రవహిస్తుంది. ఈ గొట్టపుచుట్టలమీదుగా వేడిగాలిని పంపించగా, శీతలీకరణము ఆవిరియై వేడిని పీల్చుకుంటుంది అందుమూలంగా అది గాలిని చల్లబరుస్తుంది. ఈ సమశీతలమైన గాలి, పిదప చల్లపరచు ప్రాంతంలోనికి తిరిగి వస్తుంది. గాలి చల్లబడినపుడు కొంత తేమకూడ తొలగించబడుతుంది, అది చల్లని ఆవిరి చెందించే గొట్టపుచుట్టల మీద ఘనీభవనం చెంది కారిపోతుంది.

ఇంతలో, వేడిని పీల్చుకున్న కారణంగా ఆవిరైన శీతలీకరణం కంప్రెస్సర్‌లోనికి ప్రవేశిస్తుంది. అది అచ్చట వత్తిడికి గురౌతుంది. తదుపరి అది కండెన్‌సర్‌ గొట్టపుచుట్టలద్వారా నెట్టివేయబడి అది అచ్చట తన వేడిని విడిచిపెడుతుంది మరల అది ద్రవరూపానికి మారుతుంది. వేడి భవనంనుండి బయటికి పంపబడుతుంది, శీతల పద్ధతిని కొనసాగించుటకు శీతలీకరణము ఆవిరి తీగచుట్టల ద్వారా మరల పరిభ్రమిస్తుంది.

శీతలీకరణము ద్వారా గాలిని సమశీతోష్ణస్థితికి తీసుకొని రావడం అనే పద్ధతి ఇటీవలి కాలంలో ప్రారంభమైనదే. మానవుని సౌకర్యార్ధం ఎయిర్‌ కండిషన్‌ వాడుక మొట్ట మొదటిసారి 1922 సంవత్సరంలో సినిమా హాలులో ప్రవేశపెట్టారు, మరియు 1931లో మొదటిసారి రైలులో ఎయిర్‌కండిషన్‌ ప్రవేశపెట్టారు, మరియు మోటారు వాహనములో 1939లో మొదటిసారిగా వీటిని ప్రవేశపెట్టారు. ఇళ్లలోను భవంతులలోను 1930వ దశకంలో యీ ఎయిర్‌ కండిషన్‌ వాడుక ఆరంభమైంది.

ఎయిర్‌కండిషన్‌యొక్క అవసరత ప్రజలకు వేర్వేరుగావుంటుంది అనేది స్పష్టం. అయిననూ అనేకమందికి సౌకర్యంగావుండే ఉష్ణోగ్రత ఒకటున్నది. అదేమంటే 40 నుండి 60 శాతం తేమవున్న 22 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుండి 26 డిగ్రీల సెంటీగ్రేడ్‌ హాయిగా సరిపడేంత వుండే ఉష్ణోగ్రత. వేడిచేయవలసివచ్చేంత చల్లగా వాతావరణముంటే, అనేకమంది ప్రజలు 22 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుండి 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతవుంటే సుఖంగా వున్నట్లు భావిస్తారు.

అయితే బయట వేడిగావుంటే ఎయిర్‌ కండిషన్‌లోపలి ఉష్ణోగ్రతను 24 నుండి 27 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వుంచితే చాలామందికి సుఖంగా వుంటుంది. అయితే బయట ఉష్ణోగ్రత చాలా అధికంగా వుండి ఒకడు తరచూ బయటికి లోపలికి వస్తూపోతూవుంటే అతని ఆరోగ్యం నిమిత్తం లోపలి ఉష్ణోగ్రతను సాధారణంకంటె కొంత ఎక్కువగానే వుంచుకుంటె మంచిది

నీ కవసరమా?

కావున నీ పరిస్థితులను బట్టి, ఎయిర్‌ కండిషనింగ్‌ మీకు ఇంకా మంచి సౌకర్యముగల వాతావరణమును అందించవచ్చును. నిజమే లోకంలో కొన్నిచోట్ల దాని అవసరముండదు, లేక అది కావాలని ఆశించరు. లేక ఎయిర్‌ కండిషన్‌ కొనుట ఆర్థికంగా నీవల్ల కాకపోవచ్చునేమో.

అయిననూ, ఎయిర్‌ కండిషన్‌వల్ల కలిగే ప్రయోజనాలు దాని కొనుటకు పెట్టే ఖర్చుకు తగియున్నవని నీవు నిర్ణయం చేసికోవచ్చును. సరియైన సైజును ఎన్నుకుని, బిగించి, వాడుతూ, కాపాడుకుంటూవుంటె అది తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం నీకు సేవ చేస్తుంది మరియు నిజంగా నీకు అధిక హాయినిస్తుంది. (g91 6/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి