“నేనాయనకు కళ్లు, ఆయన నాకు కాళ్లు”
“జోసి లూయిస్ ఇస్కొబార్ మరియు అర్తెమియొ దురాన్ అనువారు మెక్సికోలోని క్రైస్తవ యెహోవా సాక్షుల సంఘములో పెద్దలుగా సేవచేస్తున్నారు. జోసె లూయిస్ అంధుడు అర్తెమి నడువలేడు.
జోసె లూయిస్‌కు 16 సంవత్సరములనుండే బాక్సింగ్ అంటే మహాప్రీతి. ఒకరోజు బాక్సింగ్‌నే వృత్తిగా తీసికొన్న ఓ వ్యక్తికి బదులు ఇతన్ని ఆ ముష్టియుద్ధం చేయాలంటూ ఆహ్వానించారు. నాల్గవ రౌండ్ ముగిసేటప్పటి ఇద్దరూ ఎంతగా ముష్టిఘాతాలతో గుద్దుకున్నారంటే అసలు ఆ పోటీని ఆపాల్సివచ్చింది. జోసె లూయిస్ విజయాన్ని వరించినా, తిన్నదెబ్బలకు అతని కంటిచూపే పోయింది.
జోసెలూయిస్ వేర్వేరు డాక్టర్లను సంప్రదించాడు. మాంత్రికుల దగ్గరికి కూడ వెళ్లాడు. అయితే అతనికెవరూ సహాయంచేయలేక పోయారు. నిరాశతో అతడు అనేకసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ పిదప యెహోవా సాక్షులతన్ని కలుసుకున్నారు. బైబిలు సత్యాలు నేర్చుకున్నాడు. ఆయన 1974 ఆగష్టులో బాప్తిస్మం తీసుకున్నాడు.
అర్తెమియొ అయితే 1981లో మోటారు వాహన తీవ్ర దుర్ఘటనకు గురయ్యాడు. అతడు అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తూ పనిచేస్తున్న కాలంలో ఇది జరిగింది. వివిధ మత శాఖల ప్రతినిధులు ఆసుపత్రిలో అతన్ని కలుసుకొని అతని చెడుజీవితానికి ఫలితంగా దేవుడతన్ని శిక్షించెనని అతనితో అన్నారు. అర్తెమియొ కూడ ఆ తర్వాత యెహోవా సాక్షులను కలుసుకున్నాడు. ఆయన బైబిలును పఠించాడు, అతని జీవితంలో అవసరమైన మార్పులు చేసుకున్నాడు. 1984 మే నెలలో బాప్తిస్మం పొందాడు.
ఇప్పుడు వీళ్లిద్దరు ఒకే సంఘములో సహచరులుగా ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఇంటింటి పరిచర్యకు వెళ్తారు, కలిసి శ్రద్ధగలవారిని పునర్దర్శిస్తారు, సంఘసభ్యులు ఆత్మీయంగా బలపడుటకుగాను ఇద్దరూ కలిసి వారిని సందర్శిస్తూ ఉంటారు. జోసిలూయిస్ చక్రాల కుర్చీని నెట్టుతూవుంటాడు, అర్తెమియొ ఎక్కడికి వెళ్లాలో ఆయనకు చూపిస్తూవుంటాడు. అర్తెమియొ, తామిద్దరు ఒకే యూనిట్ అని అంటాడు: “నేనాయనకు కళ్లు, ఆయన నాకు కాళ్లు.” (g91 6/22)