కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 7/8 పేజీలు 7-10
  • నీవేమైయున్నావో నీవెలా మార్చుకోగలవు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నీవేమైయున్నావో నీవెలా మార్చుకోగలవు?
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 1వ మెట్టు: నీవు నిజంగా ఏమైయున్నావో కనుగొనుము
  • 2వ మెట్టు: నీ వేమి కావాలెనని కోరుకుంటున్నావో నిర్ణయించుకొనుము
  • 3వ మెట్టు: యోగ్యమైన మాదిరులను వెదకుము
  • 4వ మెట్టు: విజయం సాధించుటకు నీకవసరమైన బలాన్ని సంపాదించుము
  • 5వ మెట్టు: పునరావృతములను పరిష్కరించుట
  • అసలు నీవెవరో కనుగొనుట
    తేజరిల్లు!—1992
  • మార్పు ఎందుకు?
    తేజరిల్లు!—1992
  • “దేవుని వాక్యము సజీవమును బలము గలదైయున్నది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • మీ జీవితంపై ఇప్పుడే నియంత్రణను సాధించండి!
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 7/8 పేజీలు 7-10

నీవేమైయున్నావో నీవెలా మార్చుకోగలవు?

ఇదివరకే చర్చించిన ప్రవర్తనను స్థిరపరిచి మార్పుకలిగించే పద్ధతులలో ఏది లోపించినది? ఆ వ్యక్తియొక్క స్వంత అభిలాషలు మరియు స్వేచ్ఛాధికారము. తెలియజేయబడిన వ్యక్తిగత ఇష్టంద్వార అతని స్వయం స్వేచ్ఛాచిత్తాన్ని అమలుపెట్టుటయే. క్లుప్తరూపంలో అతని ఆశానిగ్రహం అక్కడ కనబడుటలేదు!

చికిత్సపొందే వ్యక్తి తన ఇష్టాన్ని తన ప్రవర్తనా గమ్యములను ఏర్పరచుకొనుటలో తన ఇష్టాన్ని వ్యక్తపరచనిస్తే, చిరకాల ఫలితాలను సాధించే సదవకాశము వారికున్నదని ప్రవర్తనా వైద్యులు కనుగొనియున్నారు. ది పీపుల్‌ షేపర్స్‌ అనే తన పుస్తకంలో వాన్స్‌పాకార్డ్‌ ఇలా వ్రాస్తున్నాడు: “స్పష్టంగా, కొద్దిపాటి సలహావుంటే తెలివైన హేతువుగల ఏ వ్యక్తియైనా తన స్వంత ప్రవర్తనను సరిదిద్దుకొనగలిగేవాడుగా తయారుకావచ్చును.” ఇది స్వయంనిర్వాహణ అని పిలువబడుతుంది. అనగా ఆశానిగ్రహం అమలుపరచినచోట ప్రాముఖ్యమైన మార్పులు సాధించినట్లు గమనించడం జరిగింది.

ఆశానిగ్రహమును అమలుపెడితే క్రైస్తవులకు ప్రయోజనముగలదు, ఎందుకనగా దేవుని పరిశుద్ధాత్మ యొక్క తొమ్మిది ఫలములలో ఇదొకటిగా దానిని అమలుపరచుటకు వారు నేర్చుకొనియున్నారు. (గలతీయులు 5:22, 23) దీనిభావమేమనగా, సర్వోన్నతుడగు దేవుని చురుకైనశక్తిని, నీ ప్రవర్తన మార్పుపై ప్రభావము కలిగి సరళమగుటకు నీకు సహాయపడును.

గనుక నీ ప్రవర్తన విషయంలో నీవేమి చేయదలచావు? నీవు నిజంగా మార్పు చేసికొనవలె ననుకుంటున్నావా? ఆలాగైతే దేనినుండి? ఎంతవరకు? ఎందుకు? నీకున్న నిగ్రహశక్తిని నీవు నమ్మగలవా? ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చే సహాయం కొరకు ఎక్కడ వెదకవలెను?

ప్రవర్తనా నియమావళిని, మార్పుకొరకు వున్న కొన్ని పద్ధతులను మార్గాలను మనమిప్పుడు గమనిద్దాం.

1వ మెట్టు: నీవు నిజంగా ఏమైయున్నావో కనుగొనుము

నీవు ఏమైయుండవలెనని కోరుకుంటున్నావో దానికి నీవు ముడిసరుకువు. పాత మనిషివైన నీవు మార్పు చెందుటద్వారా క్రొత్త మనిషివౌతావు. నిన్ను నీవు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నీ ప్రవర్తనలోని ఏ భాగాన్ని నీవు మార్పు చేసికొనుట కిష్టపడుచున్నావో నీవు వివరించగలవా?

నీ స్వప్రవర్తనను మదించుటకు కష్టం గనుక గౌరవనీయమైన, నమ్మదగిన ప్రమాణము నొకదానిని నీవు సంప్రదించవలసిన అవసరమున్నది. ఇందుకు పరిశుద్ధ బైబిలు గ్రంథం సిఫారసు చేయబడినది. బైబిలునుపయోగించుము అపుడు నీవు బహుశ క్రితంలోచూడని దాన్ని నీలోనీవు చూస్తావు. ప్రతిబింబించిన దాన్ని చూచి నీవు ఇష్టపడకపోవచ్చునుగానీ అది నీయొక్క కచ్చితమైన ప్రతిబింబమేనని నీవు నిశ్చయత కల్గియుండగలవు.

బైబిలు ఒక అద్దంగా పోల్చబడింది, మరి ప్రజలు అందులోనికి తొంగిచూడవలెనని ఉపదేశించబడుచున్నారు. “ఎవడైనను వాక్యము వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికిపోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా! అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణ నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.” (యాకోబు 1:23-25) బైబిలును సరిగ్గా అర్థంచేసికొని, అమలుపరచినచో, అది వ్యక్తిగా నీవేమైయున్నావో లోతుగా పరిశోధించుటకు నీకు సహాయము చేయుటయేగాక నీ భావోద్దేశాలను సహితం బహిర్గతం చేయగల శక్తిదానికున్నది. అందుకే పౌలు ఇలా వ్రాశాడు: “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించు నంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.”—హెబ్రీయులు 4:12; 5:14.

బైబిలు నీకు వీటన్నిటిని చేయగలదు ఏలయనగా అది జ్ఞానంగల సత్యదేవుడైన యెహోవా వాక్యం. కీర్తన 139 ప్రకారం దేవుడు నిన్ను పరిశీలించి నీవేమైయున్నావో నిశితంగా పరిశోధించి చెప్పగలడు. 1వ వచనం ఇలా చెబుతుంది: “యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలిసికొనియున్నావు.” నీవు గర్భంలో పడినప్పటినుండి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నిన్నాయన సంపూర్తిగా ఎరిగియున్నాడు. బైబిలునందాయన సాధ్యమైనన్ని వివరణలిస్తూ మానవుని జీవితాన్ని గూర్చి లిఖింపజేశాడు. అందలి పుటలలో నీవు ఎక్కడో ఒకచోట సరిపడునట్లుగాను లేక సరిపడనట్లుగాను ప్రతిబింబిస్తున్నట్లు గమనిస్తావు.

అట్లు నిజంగా నీవెవరివో నీవు కనుగొనగలవు—నీవు కోరినట్లయితే.

2వ మెట్టు: నీ వేమి కావాలెనని కోరుకుంటున్నావో నిర్ణయించుకొనుము

నీవు మార్చుకోవాలనుకుంటె ఆ మార్పు ఉపయోగకరమో కాదో రూఢీపరచుకో. అదే నీవు కోరేదనియు ఇప్పుడున్న దానికంటె అదే మంచిదనే విషయాన్ని నిశ్చయపరచుకో. వృద్ధిచేసికొనుటకు ఏ ప్రవర్తనా గమ్యములను నీవు ఏర్పరచుకుంటావు? కోరదగిన ప్రవర్తనా లక్షణాలపై ఎచట నీవు సరియైన సలహాను పొందగలవు? ఇందుకు కూడ బైబిలే సిఫారసు చేయబడింది.

బైబిలు, నీవు మంచిగా మారిపోవలెనని, “నూతన స్వభావమును” ధరించుకోవలెనని ఉపదేశిస్తుంది. పౌలు యిలా సలహాయిచ్చాడు: “కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.” (ఎఫెసీయులు 4:22-24) ఈ సద్గుణాలేమిటో బైబిలు నీకు చూపిస్తుంది. ఇంతకుముందు వర్ణించబడిన పరిపూర్ణ ప్రపంచమునుగూర్చి నీవు జ్ఞాపకం చేసికోగలవా? నీవాలోకంలో భాగస్థుడవై వుండాలనుకుంటే కొలొస్సయులకు 3:12-17నందు వివరింపబడిన గుణములను పెంపొందించుకునే అవసరతను నీవు గమనించాలి. అవేవనగా కనికరము, దయ, వినయము, సాత్వికము, సహనం, క్షమాపణ, ప్రేమ సమాధానము మరియు కృతజ్ఞత మొదలగునవి.

గనుక నీ బైబిలును పరిశీలించినమీదట నీ గమ్యములను ఏర్పరచుకొనుము. వాటిని గుర్తుగా వ్రాసికొనుము. ప్రతి గమ్యమునకు ప్రాధాన్యత యివ్వుము. సాధనచేయుము!

3వ మెట్టు: యోగ్యమైన మాదిరులను వెదకుము

నీ ప్రవర్తనలోని అధికభాగం ఇతరులను—స్నేహితులను, సహవాసులను, తలిదండ్రులను, ఉపాధ్యాయులను అనుకరించుట ద్వారా స్థిరపడింది.

మరి నీవాశించిన గమ్యములనుగూర్చి నిర్ణయించుకొనిన తదుపరి, నీవనసరించదలచిన పద్ధతిలో నడుచుకొను వ్యక్తికొరకు ఇక నీవెందుకు చూడకూడదూ? అటు తరువాత ఆయన సహాయంకొరకు వెదకుము. బైబిలుయొక్క ఒక సామెత జ్ఞానయుక్తంగా ఇలా సూచిస్తుంది: “జ్ఞానుల సహవాసముచేయువాడు జ్ఞానవంతుడగును”—సామెతలు 13:20.

బైబిలు మనందరికి శ్రేష్టమైన జీవిత మాదిరిని కలిగివున్నది. అదే యేసుక్రీస్తు స్వీయచరిత్ర. ఆయన అన్ని పరిస్థితులలోను ఎలా ప్రవర్తించాడు, ఆయన నైతిక నడవడి, ఆయన జ్ఞానవివేచనలు, ఆయన మర్యాద, ఆయన సమయోచిత జ్ఞానం, మరియు తన సహచరుల ఎడల చూపిన అసాధారణ దయాదాక్షిణ్యములను గూర్చి చదవండి. ఆయన ఇలా చెప్పినప్పుడు ఎంత ఓదార్పుకరంగావున్నదో: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా? నాయొద్దకురండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.”—మత్తయి 11:28-30.

ఆయనకూడ తన పరలోకపు తండ్రియైన యెహోవా దేవుని ఉపదేశమార్గంలో నడిచినట్లే, అన్నిదేశాలలోని లక్షలాది మంది ఇప్పటికే క్రీస్తు యేసు వైపు తిరిగి ఆయనను తమకు మాదిరిగావుంచుకుని, ఆయన అడుగుజాడలను అనుసరించుటకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ లక్షలాదిమంది, లోకమందున్న దుష్పవర్తనతో విరక్తిచెంది సహాయసహకారముల కొరకు వారు యెహోవాసాక్షుల స్థానిక సంఘాలను ఆశ్రయించి, నిరుత్సాహంచెందలేదు. సాక్షుల రాజ్యమందిరాలలో క్రీస్తువంటి అతిశ్రేష్టమైన మాదిరులు సమృద్ధిగా వున్నవి. మరి తమ స్వప్రవర్తనను సత్‌ప్రవర్తనగా మార్చుకొనగోరువారికి ఎంతో సహాయం అందించబడుతుంది. నిజమే, సాక్షులకు అసంపూర్ణులైన మానవులకున్నట్టి సాధారణ అసంపూర్ణతలున్నవి; గానీ మనస్సును పురికొల్పు సరియైన ఆత్మీయశక్తి కూడ వారిలోవున్నది.—ఎఫెసీయులు 4:23.

4వ మెట్టు: విజయం సాధించుటకు నీకవసరమైన బలాన్ని సంపాదించుము

వారి మార్గములను మార్పుచేసికొనవలెనని ఆశించువారికి సహాయం అందుబాటులోవుందని తెలిసికొనుట ఓదార్పుకరమే. “నవీన స్వభావము,” అనేది “నీతియు యథార్థమైన భక్తియుగల దేవుని పోలికగా సృష్టింపబడిన”దిగా వర్ణించబడింది. (ఎఫెసీయులు 4:24) దాన్ని కోరినవారికి దేవునినుండియే మానవాతీతమైన సహాయం దొరుకుతుందనే అభయాన్ని అందిస్తుంది. నీవు యెహోవా దేవుని సహాయాన్నెట్లు పొందగలవు?

అన్నిటికంటె ముఖ్యమైన సహాయం వ్యక్తిగత ప్రార్థనద్వారా వస్తుంది. ప్రార్థన నీ మార్గములను మార్చుకొనుటకు అవసరమైన శక్తికి మూలమైన వ్యక్తితో ముఖ్యమైన సంప్రదింపు పనిచేయుటకు సుగమము చేస్తుంది. ప్రార్థన, నేవెప్పుడైనా, క్లిష్టపరిస్థితిలో సహితం స్వేచ్ఛగా మాట్లాడుటకు వీలు కల్పిస్తుంది. నిజమైన మరియు శ్రద్ధచూపే దేవుని అలా సమీపించుట ఏ మానవ సహాయంకన్న సాటిలేనిదై సత్వర ఫలితాన్నిస్తుంది. అందుకే అపొస్తలుడైన యోహాను యిలా వ్రాయగలిగాడు: “ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.” (1 యోహాను 5:14) మరి యెషయా ప్రవక్త మాటలు మనలనిట్లు ప్రోత్సహిస్తున్నవి: “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును. వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.”—యెషయా 55:6, 7.

బైబిలు పఠనం కూడ నీకు బలాన్నిస్తుంది., నీకు సేదదీర్చుచూ, నీ గమ్యములమీద ప్రతిదినము ధ్యానముంచునట్లు తోడ్పడుతుంది, నీవు ఎన్నుకున్న ప్రవర్తనా గురిని చేరుటకు నీవు కృషి చేస్తూవుంటె బైబిలు నీకు సరియైన అదనపు బలాన్ని అందించును. ఇంకనూ, నీ పాతపద్ధతులను నీవు అసహ్యించుకొనునట్లు నిన్నుపురికొల్పుతుంది. అందులోవున్న వాటిని గూర్చి ప్రతిదినమూ జ్ఞానం సంపాదించుకొనుటవలన, బైబిలు ఇహలోక వార్తావాహినినుండి, విద్యావిధానంనుండి జారివచ్చు ఎటువంటి నిరుపయోగ సమాచారమునైనను నెట్టి వేస్తుంది.

యెహోవాసాక్షుల స్థానిక రాజ్యమందిరంలోని క్రైస్తవ కూటములు బైబిలు నియమనిబంధనలనుగూర్చి విద్య నొసంగుటయేగాక సామూహిక మద్దతును, పరివర్తనచెందిన ప్రవర్తనకు పరస్పర పురికొల్పునందింస్తుంది. సంఘంద్వారా ఏర్పాటుచేయబడు యీ మద్దతు, విజయవంతముగా ప్రవర్తనా మార్పును చేసికొనుటకు అనేకులకు సహాయపడింది. ఈ పత్రిక ఇచ్చిన వ్యక్తితో అటువంటి సహాయమును గూర్చి ఎందుకు చర్చించకూడదూ?

5వ మెట్టు: పునరావృతములను పరిష్కరించుట

అనేకులు వారి పద్ధతులను మెరుగుపరచుకోవలెనని ప్రయత్నించారుగానీ బహుశా తప్పనిసరిగా పునరావృతములగు క్రియలమూలంగా నిరుత్సాహం చెందియున్నారు. దాని ఫలితమేమంటే కొందరిక తమ ప్రయత్నములనే చేయకుండ పూర్తిగా మానుకున్నారు. వారికున్న ఏకైక నిరీక్షణ యిప్పుడిక విఫలమైంది గనుక అసలు నిరీక్షణే లేదనుకుంటున్నారు. అప్పుడిక వారు లోక ప్రభావముల క్రిందికి తమను తాము అప్పగించుకొందురేమో. మార్పుచేసికొనుటకు ప్రయత్నించక పూర్వము వారున్న స్థితికంటే హీనమైన స్థితికి వారు తరచూ దిగజారుదురు.

మునుపటి అవాంఛనీయమైన ప్రవర్తన విడిచిపెట్టుటే ఉత్తమమని నీకునీవే మరల నిశ్చయపరచు కుంటూనేవుండుము. అపొస్తలుడైన పౌలు తన మునుపటి ప్రవర్తనను విసర్జించదగినదని లేక చెత్తకుండీయని తెలిపాడు. (ఫిలిప్పీయులు 3:8) గనుక మార్పుచేసికొనుటలో ఏదైన ఆటంకమువలనగానీ పునరావృతమువల్లగానీ నీవు తొట్రుపడితే మరల ప్రయత్నించుము, ముందుకు సాగుచునే వుండుము. కొనసాగించుము! పోరాడుము! అట్టి శ్రమ ప్రయోజనకరమే!

జ్ఞాపకముంచుకొనండి, అప్పుడు నీ ఇష్టానికిమించి లేదా నీ స్వాధీనము తప్పిన బయటి ప్రభావముల మూలంగానే నీయొక్క పద్ధతులు, లక్షణాలలో అనేకములు నీమీద రుద్దబడినవి. ఈ శక్తులింకా పనిచేస్తున్నవి. అవి నిన్ను వాటి కబంద హస్తాల క్రింద నలుగగొట్టనిస్తావా? లేదా? ఆలాగైతే నీ ప్రయత్నాన్ని ఎన్నటికీ మానవద్దు!

వివిధ సంస్కృతులున్న లక్షలాది మంది ప్రజలు—నేరస్థులు అవినీతి ప్రవర్తనలో కూరుకుపోయిన ప్రజలు సహితం జయప్రదంగా వారి ప్రవర్తనను మార్చుకొనియున్నారు. వారు యీనాటివరకును మార్పుచేసుకున్న పద్ధతులలో కొనసాగుచునేయున్నారు, కొందరైతే దశాబ్దముల తరబడి అలాచేస్తూ, వారు మెచ్చుకోదగిన స్వేచ్ఛ యథార్థతతో మంచి మార్గములకు హత్తుకొనియున్నారు. వారు అలాచేయుటకై దేవుడిచ్చిన బలమునకు, స్ఫూర్తికి వారాయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నారు. అపొస్తలుడైన పౌలు యిలా తెలియజేశాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.

యథార్థమైన దాన్ని చేయుటకై వారు చేసే పోరాటంలో విజయాన్ని సాధిస్తున్నారు. నీవు నిజంగా కోరుకున్నచో నీవును అట్టి మార్పు చేసికొనవచ్చును. మరియు దేవుని నూతనలోకంలో జీవితాన్ని నీవనుభవించగలవు.—కీర్తన 37:29; 2 పేతురు 3:13. (g91 7/8)

[7వ పేజీలోని చిత్రం]

1వ మెట్టు: నిజంగా నీవేమైయున్నావో కనుగొనుము

[8వ పేజీలోని చిత్రం]

2వ మెట్టు: నీవేమి కావాలని కోరుకుంటున్నావో నిర్ణయించుకొనుము

[8వ పేజీలోని చిత్రం]

3వ మెట్టు: యోగ్యమైన మాదిరులను వెదకుము

[9వ పేజీలోని చిత్రం]

4వ మెట్టు: విజయం సాధించుటకు నీ కవసరమైన బలాన్ని సంపాదించుము

[9వ పేజీలోని చిత్రం]

5వ మెట్టు: పునరావృతములను పరిష్కరించుట

[10వ పేజీలోని చిత్రం]

మార్పుచేసికున్నవారు మార్పుచెందిన భూమిని స్వతంత్రించుకొనగలరు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి