మ్యాన్‌కైండ్ సర్చ్ ఫర్ గాడ్ పుస్తకమునకు ప్రతిస్పందన
యెహోవాసాక్షులు 1990మధ్య భాగమునుండి 1991తొలి భాగమువరకు నిర్వహించిన “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశముల విశేషములలో “మ్యాన్కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ అను పుస్తకముయొక్క విడుదల ఒకటి, ప్రపంచమందలి ప్రధానమతముల ప్రారంభము వాటి చరిత్ర మరియు నమ్మకములను గూర్చి అది సంక్షిప్త వివరములను అందించుచున్నది. నిజదేవుని ఎట్లు కనుగొనవచ్చునో అది తెల్పుచున్నది. ప్రపంచ వ్యాప్తంగానున్న పాఠకులు ఎలా స్పందించారు?.
“మ్యాన్కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్” పుస్తకమునకు నా హృదయపూర్వక అభినందన, అని ఇ. జి. సాక్షికాని ఒక మహిళ జర్మనీలో వ్యాఖ్యానించెను. వివిధమతములను గూర్చిన అట్టి వివరణాత్మకమైన కూలంకుష అన్వేషణ నిజంగా అద్భుతం, చదువ ముచ్చటగా ఉన్నది. అంతేకాదు, సహేతుకమైన తర్కన విషయములో అల్పమైనది కాదు.—దానికి విరుద్ధంగా ఉన్నది. ప్రజలు తమ మతాలను ఈ పుస్తక ఆధారముతో పరిశీలించాలని నేను సిఫారసు చేస్తాను.
ఫ్లషింగ్, అమెరికాలోని న్యూయార్కు నుండి ఒక పాఠకుడు యిలా వ్రాసెను: “నేను ముస్లింను, అల్-ఇస్లామ్ నా మతము. మ్యాన్కైండ్స్ సర్చ్ఫర్ గాడ్ అనే పుస్తకము విషయంలో మీరు అందించిన సమాచారమును నేను ముఖ్యంగా అభినందిస్తున్నాను.
నెదర్లాండులో 17 సంవత్సరముల ప్రాయముగల ఎ.వి.డి. తన తోటి విద్యార్థికి ఒక ప్రతిని ఇచ్చింది, ఆమె తన పాఠశాల పాఠమును సిద్ధపడుటలో దానిని ఉపయోగించింది. ఆమె సేకరించిన సమాచార మూలమును టీచరు తెలిసికొనగోరాడు. ఆ పుస్తకాన్ని చూచి, అతడు మూడు ప్రతులకు ఆర్డరు చేశాడు. ఎ.డి.వి యింకా యిట్లనుచున్నది: “మరుసటి దినమున నేను మూడు క్రొత్త పుస్తకములను టీచరుకు అందించాను, వెంటనే ఆయన మరి కొంతమంది టీచర్లకు వాటిని చూపాడు. కొద్ది సమయము తర్వాత అతడు నాతో యీలాచెప్పాడు, ‘బాగుంది. ఈ పుస్తకం 35 ప్రతులు ఆర్డరు చేయడానికి పాఠశాల నిర్వాహకుల అంగీకారమును నేను తీసుకున్నాను.’”
“గతములో మరి ఏ యితర వాచ్‌టవర్ సాహిత్యము ప్రభావితము చేయనివిధంగా వివిధ వర్గముల ప్రజలను “మేన్కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్” చేయగలదు, అని బ్రిటీషు కొలంబియా, కెనడానుండి ఒక దంపతులు వ్రాశారు.
లీ హావ్రి, ఫ్రాన్సునుండి యం. హెచ్. యిలా వ్రాసింది: “ఈ పుస్తకము నా ఊహలను పూర్తిగా అధిగమించినదనే నేను చెప్పాలి; అది ఎంతో తేటగా స్పష్టంగా కనులకింపుగా నున్నది, ఎంత మహత్తరమైనదో!
టెక్సాస్, అమెరికానుండి హెచ్.డబ్ల్యు.డబ్ల్యు. యిలా వ్రాసాడు: “ఈ పుస్తకము అత్యంత ఆసక్తిదాయకంగాను, విలీనము చేసికొనునదిగాను ఉన్నది, నేను దానిని విడువలేక పోయాను. రాత్రి చాలా ప్రొద్దుపోయేవరకు దానిని చదువుతూ ఉండిపోయాను. దాని రచనాశైలి అద్భుతం. ఇతరుల నమ్మకాలను ఈ పుస్తకము న్యాయమైన గౌరవనీయమైన విధంగా చర్చించి అదే సమయంలో నిజదేవుడైన యెహోవాను వెదకుటలో కొనసాగుమని వారిని ప్రోత్సహించుచున్నది. ఎవరో మనప్రక్కన కూర్చుని మాట్లాడుచున్నట్లే అందలి మాటలు రమ్యంగా ఉన్నవి.
పనామానుండి జి. మరియు యస్. అనే దంపతులు యిలా చెప్పారు: “స్పానిష్ భాష మాట్లాడువారు ఈ పుస్తకాన్ని వెంటనే స్వీకరిస్తున్నారు. దేవాలయములను, విగ్రహములను రంగుల చిత్రములలో చూచుటకు వారెంతో పులకరించిపోయారు.“
అమెరికా నౌకాదళములోని నావికుడు డి.యం. యిలా వ్రాశాడు: “నేను ఒక స్త్రీని కలిసాను, ‘మీకు ఆత్మీయ సంబంధమైన పుస్తకము కావాలా?’ అని ఆమెనన్నడిగింది. అప్పుడు నేను, అది ఎటువంటి పుస్తకమో తెలియకుండానే ‘కావాలి’ అని అన్నాను. ఆశ్చర్యకరంగా, అది నేనెంతో కాలంగా ఎదురుచూస్తున్న పుస్తకమే అయ్యింది.”
అమెరికా విశ్వవిద్యాలయములో ప్రపంచ మతమునుగూర్చి నేర్చుకొనిన ఒక ఫ్రొఫెసరు యిలా వ్రాశాడు: “వివిధ మతములనుగూర్చిన ముఖ్య బోధనల సంక్షిప్త భావప్రకటన, ఖచ్చితమైన వివరణ మనస్సును దోచుచున్నది. ఆ రంగములో గుర్తింపు పొందిన అనేకమంది రచయితలను పేర్కొనడంవలన సంపాదకుడు సమకాలిక పాండిత్యమునకు, వాటి వాడుకతో పరిచయము కల్గియున్నాడని తేటతెల్లమగుచున్నది. అందులో సంపూర్ణ నమ్మకత్వమున్నది. దాపరికములేదు.”
నగోయా నగరము జపాన్ నుండి ఒక బాలిక ఎన్. వై. ఇలా వ్రాసెను: “నా వయస్సు 12 సంవత్సరములు, స్కూలులో చరిత్రను చదువుచున్నాను. జపాను మతమును ఈ పుస్తకము వివరంగా తెలియజేయుచున్నది. మాంత్రిక విద్య, అభిచారమునుగూర్చి 4వ అధ్యాయములోను, నిజదేవుని వైపు తిరుగుట అనుదానిని 15వ అధ్యాయములోను చదువుటలో నేనెంతో ఆనందించాను.
మరి యితర అనేక అభినందనా ఉత్తరములు అర్జెంటీనా, కొలంబియా, ఇంగ్లాండ్, ప్యూర్టొరికొ; స్పెయిన్ మరియు యితర అనేక దేశములనుండి వచ్చినవి. ప్రస్తుతము 26 భాషలలో ప్రచురించబడిన ‘మాన్కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ పుస్తకమును పొందగోరిన యెడల 3వ పేజీ చూడుము. (g91 7/8)