మార్పు చేసికొనుటకు శ్రేష్టమైన పద్ధతులు కావు
ఒకసారి ప్రవర్తనా పద్ధతులు స్థాపించబడిన తర్వాత మరి మార్పులెలా వర్తించును? నీ వెవరివైపు తిరగాలి, మరి శాశ్వత అభివృద్ధి సాధించు నిమిత్తం నీవు ఎటువంటి పద్ధతులుపయోగించగలవు?
ఈనాడు ఉపయోగించే కొన్ని విపరీత పద్ధతులను మనం పరిశీలిద్దాం.
రాజకీయవత్తిడి
ఈనాడు లక్షలాదిమంది ప్రజలు ప్రవర్తనా నియమావళిని ఆదర్శములను అదుపులో పెట్టుటకు ప్రయత్నించే పరిపాలనల క్రింద జీవిస్తున్నారు. అటువంటి కొన్ని ప్రభుత్వాలు వాటి అధికారాలనుపయోగించి—కొన్ని కుయుక్తితోను మరికొన్ని బలవంతముగనో వారిని మార్చుటకు ప్రయత్నిస్తున్నవి. కొన్ని, తరచూ బెదిరించుట, ఖైదీచేయుట, యాతన పెట్టుటవంటి క్రియలతో సహా మనస్సులో నూతన ఆశయాలను రుద్దే ప్రక్రియలు వాడుచున్నవి. వార్తాపత్రికలు, ఇతర విద్యాసంస్థలమీద ఆధిపత్యము చెలాయిస్తూ, అవి ప్రస్తుత ఉన్నతవర్గపాలకుల అభీష్టాలమేరకు పూర్వం స్థిరపరచబడిన ఆశయాలను తొలగించుటకు వెదకుచున్నవి. సమస్త అసమ్మతిని బలవంతంగా అణచివేస్తున్నవి. ఎవరైనా మరల అభ్యసించుటకు అయిష్టతను ప్రకటిస్తే ఆ వ్యక్తి తన ఆశయాన్ని తరచూ భగ్నంచేసే కఠినశిక్షకు గురికావచ్చును.
మస్తిక శస్త్రచికిత్స మరియు ఎలక్ట్రికల్ ఉత్తేజకము:
మెదడులోని కొన్ని భాగాలు, ప్రవర్తనయొక్క విశేష తలంపులు గుణగణాలపై ప్రభావం చూపునని గుర్తించబడినది. మస్తిక శస్త్రచికిత్సతో ఆ భాగాన్ని తీసివేయుటలేక మెదడునందున్న ఆ భాగంలోని మస్తిక ధాతువును నాశనంచేయుట ఇమిడియున్నది. అలా ఒకసారి తొలగించబడిన పిదప ఇక మెదడులోని ఆ భాగం మరల ఎన్నటికి పనిచేయదు మరియు అది ప్రభావితంచేసిన ఏ ప్రవర్తనయైనను మాయమైపోతుంది.
అట్టి వేలాది శస్త్ర చికిత్సలు చేయబడినవి, ముఖ్యంగా అసాధారణ, అపాయకర లైంగిక ప్రవృత్తిగల ప్రజలకు చేశారు అని చెప్పబడుచున్నది. కొందరు మెదడు లోపలి భాగాన చిన్న విద్యుత్ప్రవాహనాళములను అతికించుకున్నారు, దానిలో విద్యుత్ ప్రవహించినపుడు అది మెదడులోని ఆ భాగాన్ని ఉత్తేజపరచడము లేక అడ్డగించడముగాని చేస్తుంది దీనినిబట్టి మెదడునందలి ఆ భాగం యొక్క అధీనమునందున్న ప్రవర్తనను ప్రభావితము చేయు ప్రేరణములను యీ పద్ధతి మార్చుతుందని అనుకుంటున్నారు.
మాదక ద్రవ్యములు:
మనోవైద్య రంగములో మాదక ద్రవ్యముల వాడుక చాల తరచు అనవసరమనిపిస్తుంది. నిమ్మళపరచి నిద్రకల్గించేవి, చైతన్యవంతంచేసేవి, మెదడులో రసాయనిక అసమానతలను సరిచేసే మందులున్నవి. జైళ్లలోను, ఇతర సరిదిద్దేసంస్థలో శిక్షించునిమిత్తం వుపయోగించబడుచున్న మాదకద్రవ్యాలు కూడ వున్నవి. అందులోని రెండు మాదక ద్రవ్యాలేవనగా అపోమార్ఫిన్, అనెక్టైన్.
అనంగీకృత ప్రవర్తనగల ఖైదీలకు యీ అపోమార్ఫిన్ ఇవ్వబడింది. అది విపరీతమైన వెగటు, వాంతులను కల్గిస్తుంది. మరల చెడుగా ప్రవర్తిస్తే ఇంకా ఎక్కువ గా అపొమార్ఫిన్ ఇవ్వవలసివుంటుందని ఖైదీకి చెప్తున్నారు. దీనిని విరక్తి చికిత్స అని కూడ పిలుస్తారు. చెడుగా ప్రవర్తించే ఖైదీలో యీ అనెక్టైన్ అనేది ఒక విధమైన నీరసమును ఉబ్బసమున్న తలంపును కల్గిస్తుంది. తాను చనిపోతాడనే అతడనుకుంటాడు. అతడు మరల చెడుగా ప్రవర్తిస్తే మరలా అతనికి అనెక్టైన్ ఇస్తారు.
నీ ప్రవర్తనా పద్ధతిని మార్చుకొనుటకు నీవు ఈ మార్గములనుపయోగిస్తావా?
పైన తెలుపబడిన పద్ధతులలో అనేకములు స్వేచ్ఛాచిత్తాన్ని భంగపరచునవే. ఎదుటివారి మీద అధికారం చెలాయించే ప్రజల ప్రాబల్యం కూడ వాటిలో ఇమిడివున్నది గానీ ఎప్పుడూ ఆ వ్యక్తి ప్రయోజనాన్ని మనస్సునందుంచుకొని అలా చేయడంలేదు. రాజకీయ అధికారం స్వప్రయోజనం వెదకుతుందా లేక వ్యక్తి ప్రయోజనమునా? మస్తిక శస్త్రచికిత్సలో శస్త్రవైద్యుని కత్తి పట్టకునే దెవరు? విద్యుత్సంబంధిత ఉత్తేజకము నిచ్చునపుడు స్విచ్ ఎవరి అధీనములో వుంటుంది? విరక్తి కలిగించే చికిత్స ఎంతకాలం నిలుస్తుంది? చికిత్సనిచ్చువారిని నమ్మవచ్చునా?
అంతకంటె అధికంగా అంగీకరించబడే పద్ధతినిగూర్చి మనం పరిశీలిస్తాం. (g91 7/8)