అసలు నీవెవరో కనుగొనుట
నీవు అద్దంలో చూచుకుంటే నీ కేమి కనబడుతుంది? నీ ప్రతిబింబమే. అయితే అది నిజంగా నీ వెవరో నీకు చెప్పునా? నీవెవరో నిజంగా నీకు తెలుసా? మొదట నీ వ్యక్తిగత ప్రవర్తన ఎలా నాటబడిందో నీకు తెలుసా? అవును, ఓ వ్యక్తిగా నీ వెలా ఎదిగావు?
నీ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దిన వాటన్నిటినిగూర్చి నీవు కొంచెమాగి పరిశీలిస్తే, అనేక ప్రభావములు నీపై మోపబడినవని నీవు గమనించవచ్చును—ఇతర వ్యక్తుల ద్వారా లేక ఇతర అంశముల ద్వారా. మన పసితనంలో మనలో అనేకమంది మన స్వంత అలవాట్లను పద్ధతులను ఏర్పరచుకొనుటలో బహు స్వల్ప ప్రమేయం కల్గివుంటిమి. గనుక నీ స్వంత ప్రవర్తన విషయంలో నీవేదైనా చేయగలిగే అవకాశము పొందుటకు చాలాకాలం ముందే వున్న కొన్నింటిని—మనం పరిశీలిద్దాం.
జన్యుశాస్త్రము అధిక భాగం నిర్వహిస్తుంది
జన్యుశాస్త్రమెంతవరకు నీ పై ప్రభావం చూపింది? వంశ లక్షణాలను సంక్రమింపజేసే క్రోమోసోములయందు కనుగొనబడే డియన్‌ఎ బ్లూ ప్రింట్ అనునది ప్రతివ్యక్తి అభివృద్ధి నిమిత్తం వివరణలను మరియు సూత్రీకరించబడిన ఆదేశములను కలిగియుంటుంది. గనుక జన్యుసంబంధమైనది ఎంతవరకు నీ వ్యక్తిగత ప్రవర్తన మీద ప్రభావం చూపుచున్నది? జన్యుకణములకును వ్యక్తిత్వమునకు మధ్య కచ్చితమైన అనుబంధమున్నదని రుజువుచేయుట ఇంకా కష్టతరంగానే వున్నట్లు కనబడుతుంది. అయిననూ కొన్ని ఆలోచనలు యోగ్యమైనవిగా కనిపించుచున్నవి. ఉదాహరణకు, సంక్రమించిన భౌతిక లక్షణాలు చాలవరకు నీ వ్యక్తిగత ప్రవర్తన మీద గట్టి ప్రభావం చూపును. ఆవిధంగా ఒక రంగు లేక జాతి వ్యక్తుల విషయంలో అనేకమంది ప్రజలు పక్షపాత ధోరణులు లేక ముందే తలంచిన అభిప్రాయాలను కల్గియున్నారు.
గర్భిణీ స్త్రీ తన క్రియలు, తలంపులు, భావముల మూలంగా పుట్టబోయే శిశువుపై మంచి లేక చెడు ప్రభావాన్ని చూపగలదు. నీవు నీ తల్లిగర్భంలో వున్నపుడు ఎంత నెమ్మది లేక వత్తిడికి గురిచేయబడ్డావు? నీ తలిదండ్రుల స్వరాన్నిబట్టి, వారు వినే సంగీతాన్నిబట్టి నీవెంతవరకు వారినుండి నేర్చుకొంటివి? నీ తల్లి తిన్న ఆహారం నీమీద ఎట్టి ప్రభావం చూపెను? ఆమె మత్తు పానీయాలు సేవించినా లేదా మత్తు పదార్ధాలువాడినా, వాటి ప్రభావం ఎంతవరకు ఆమెపై వుండెనో? నీవు జన్మించేటప్పటికే నీలో అనేక గుణగణాలు ఏర్పడ్డవి మరియు వాటిని బహుశా మార్చుటకు కష్టంగా వుండవచ్చును.
ఆహారం, సరిపడని శరీరతత్వములు, పర్యావరణముల విషయమేమిటి?
నీవు బాల్యదశకు ఎదిగేకొలది నీ ఆహారములోని కొన్ని మూల పదార్ధములు నీ ప్రవర్తన మీద ప్రభావం చూపియుండవచ్చును. మధురం చేసేవి, కృత్రిమ రంగులు మరియు చెడిపోకుండచేయు రసాయన ప్రక్రియలు—ఇవన్నియు ప్రవర్తన మీద అదృశ్యమైన ప్రభావమును కనబరచును. అతి చురుకుతనం, వత్తిడికి గురియగుట, ముంగోపం, ఉద్రిక్తత; మరియు మితిమీరిన అదుపుతప్పిన క్రియలే దాని ప్రభావము వలన కలిగే కొన్ని ఫలితాలు. వాహనము వదిలే పొగమూలంగా కలిగే కల్మషము, పారిశ్రామిక వ్యర్ధ పదార్ధముల వలన వెలువడే కలుషితం మరియు పర్యావరణములోని ఇతర విషపదార్ధములు కూడ ప్రవర్తనను రూపించును. లేదా, వ్యక్తిగతంగా నీకు తీవ్రంగా హానికల్గించేది నీ శరీరాన్ని వికటింప జేసేది వుండవచ్చును గానీ నీ చుట్టున్న వారిమీద దాని ప్రభావం ఉండకపోవచ్చును.
ఈ ప్రభావములతోపాటు, నీ తల్లిదండ్రుల ప్రవర్తన అంటే పసితనంనుండి వారి దగ్గర పెరిగిన వ్యక్తిగా వారికున్న ఇష్టాయిష్టాలు, వారికున్న దురభిమానములు కూడ నీ మీద ప్రభావంచూపి కొంతవరకు నీ వ్యక్తిత్వమును రూపుదిద్దియున్నవి. తత్ఫలితంగా నీ పద్ధతులలో అనేకములు మరియు జీవితంమీద నీకున్న సాధారణదృష్టి, వారు కల్గియున్నవాటి ప్రతిబింబమే. వారిని చీకాకుపరచేవాటిని చూచి నీవు చీకాకు చెందుదువు. నీవు నీ తల్లి నీ తండ్రిలా ప్రవర్తిస్తున్నావని ఎవరో ఒకరు చెప్పేంతవరకు నీవు వారి ప్రవర్తనను అనుకరిస్తున్నావని నీవు అరుదుగా గమనిస్తావు. నీ పాఠశాల, నీ ఇరుగుపొరుగు పరిసర ప్రభావం నీమీద వున్నట్లే వారి ఆర్ధిక సామాజిక స్థితిగతులుకూడ నీపై ప్రభావం చూపియున్నది. నీ మిత్రులు, సహవాసుల ప్రభావం కూడ నీ మీద ఎంతగానోవున్నది. బహుశా ఒక చెడు దుర్ఘటన, ఏదో ఒక స్థానిక దుస్సంఘటన, లేక బాధకల్గించే లోక సంఘటనలు సహితం నీపై ప్రభావం చూపియుండును. లేదా విడాకులు లేక తీవ్రవ్యాధివంటి ఏదొక దుఃఖదాయక ఘటన నీ వ్యక్తిత్వము మీద మాయనిమచ్చను మిగిల్చివుండవచ్చునేమో.
అటువంటి ప్రభావములను, నీవు ఆలోచించి గుర్తించగలవా?
మతమెట్టి ప్రభావమును చూపించుచున్నది?
సిద్ధాంతరీత్యచూస్తే, మతం నీ నైతిక ప్రవర్తనను, నీతినియమాల విషయములను, దైనందిన కార్యక్రమాన్ని మెరుగుపరుస్తూ నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా వుండుటకు సహాయంచేయాలి. సరే, మతం నీవు ఉన్నతంగా ఎంచు ప్రమాణముల మీద, క్రియలమీద ఎంతవరకు ప్రభావం చూపినది? బాధ్యతలేని నేర ప్రవృత్తిని మతం అడ్డుకొనవలసియున్ననూ, అనేకులు మతంతో సంబంధం కల్గివున్నందుచేత వేరొక పద్ధతిలో దాని ప్రభావమునకు గురౌతున్నారు. చర్చీలలో ఆత్మీయవిలువలకన్న ధనానికి అధిక విలువ ఇస్తున్నట్లు, చాలవరకు వేషధారణతోకూడి వున్నట్లు వారు గమనించి అందుమూలంగా వాటిని అసహ్యించుకుంటున్నారు. వారు అమతస్థులై, ఆత్మీయతను నిరీక్షణను కోల్పోయే అవకాశమున్నది.
ప్రవర్తనను మార్చే ఇతర వెలుపలి ప్రభావములనుగూర్చి కూడ నీవు తలంచవచ్చును. ఇప్పటికివరకు నీపై చూపిన ప్రభావములలో ఏదోఒక దానిని గూర్చి కొన్ని క్షణాలు ఆలోచించుము. ఇలా సంకల్ప సహితముగా ఆలోచించుట సులభమైనది కాదు గానీ, అలాచేసే ప్రయత్నం ప్రయోజనకరమే మరియు నీకు సహాయకారిగా వుండవచ్చును. అదెలా?
సరే, నీ ప్రవర్తన విషయంలో ఒక ప్రత్యేక ప్రభావమును లేదా వ్యతిరేక స్వభావానికి దోహదంచేసిన కారణములను నీవు గుర్తించగలిగితే, నీవు దాన్ని ప్రత్యేకంగా విడదీయగలిగితే, అప్పుడు దాన్ని నీ అదుపులో పెట్టుకొనగలవు. బహుశా దాన్ని మార్పుచేయగలవు. కోరదగని ప్రభావాన్ని నీవు అదుపులో పెట్టగలిగితే లేక దాన్ని తీసివేసికొన గల్గితే నీవు ఇతరుల విషయములో బాగుగా ప్రవర్తించినవాడవై ఓ క్రొత్త వ్యక్తిగా తయారుకాగలవు.
అది సవాలుతోకూడినది, వాస్తవమే. గానీ నీ అధీనములోలేని పరిస్థితులు లేక ఇతర ప్రజలు నీ ప్రవర్తనమీద ప్రభావము కలిగిస్తున్నందున పరిస్థితిని చక్కదిద్దుకొనుటకు నీవే స్వయంగా ఎందుకు ముందుకు రాకూడదు? అభివృద్ధి అవసరమైతే, నీవేమైయున్నావో నీవెందుకు మార్పుచేసికొనకూడదు? (g91 7/8)
[4వ పేజీలోని చిత్రం]
గర్భిణీ స్త్రీయొక్క క్రియలు, తలంపులు పుట్టబోవు శిశువుమీద ప్రభావం చూపవచ్చును