మార్పు ఎందుకు?
మనకు ముఖ్యమైన బలహీనతలున్నవని మనలో కొందరమే అంగీకరించుటకు ఇష్టపడతాము. స్కాట్‌లాండ్ దేశస్థుడైన రాబర్ట్ బర్న్ అనే కవియొక్క మాటలెంత సత్యమైయున్నవి: “ఏదో శక్తి మాకు ఇస్తే బహుమతి, ఇతరులు మమ్మును గాంచినట్లే మమ్మును మేము గాంచుదుము గదా!”a అవును ఇతరులలో తప్పులుపట్టుట మనకు సులభంగా వుంటుంది మరియు వారెలా అభివృద్ధిచేసికొనవలెనో సలహా ఇచ్చుటకు మనం త్వరపడవచ్చును. అయితే మనమే మన ప్రవర్తనను మార్పుచేసికొనవలసిన అవసరమున్నదని ఇచ్చే ఎటువంటి సలహాయైననూ మనలను బాధపెడుతుంది. నిన్ను అలా బాధపెడుతుందా?
ప్రతివారు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, యథార్థంగావున్నచోటును, అధికారంలో వున్నవారు సహితం దయ కనికరం కలిగి, ఇతరులకు మేలుచేసే శ్రద్ధకలిగిన వారున్నచోటును, దురాపేక్షలేనిచోట, తోటివారిని మోసంచేయని చోటును, అనురాగంచూపే తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలున్నచోటును, ఆగ్రహావేశాలు వెళ్లగ్రక్కని చోటును—హింస, నేరము, అవినీతిలేకుండా ఒకరినొకరు నమ్ముతూ సంతోషిస్తూవున్న చోటును, జీవితం క్షేమంగా ఆనందదాయకంగా వున్నదను భావనతో గడిపే పరిపూర్ణలోకాన్ని గూర్చి మనం ఓ క్షణమాగి ఊహిద్దాం.
అటువంటి పరిపూర్ణ ఆదర్శప్రాయమై సాంఘిక రాజకీయవిధానంగల ప్రపంచం ఉనికిలోవున్నట్లయితే నీవాలోకంలో జీవించుటకు సరిపోదువని తలంచగలవా? సరే, అటువంటి లోకం త్వరలో యీ భూమి మీదికి వస్తుందనియే బైబిలునందున్న సువార్త. గనుక ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏమంటే: అటువంటి ఆనందదాయకమగు సమాజంలో వుండు అర్హత కోల్పోవు గుణాలేవైనా నీకున్నవా? అట్టి పరదైసులో జీవించునర్హతకొరకు ప్రయత్నించుట ఎంత కష్టమైనా సాధించదగినదే అని నీవనుకుంటున్నావా?—యెషయా 65:17-25; 2 పేతురు 3:13.
అట్టి క్రొత్త లోకం రాకమునుపే, ఇప్పుడే నీ ప్రవర్తన, స్వభావం విషయంలో నీవేదైనా చేసియున్నచో నీ జీవితం అభివృద్ధిచెందగలదా? అలాగైతే ఎందుకు మార్పుచేసికొనకూడదు? అలాచేయుట సాధ్యమే. జ్ఞాపకముంచుకొనండి, కొన్ని ప్రత్యేక ప్రభావములే మొదటిగా నిన్ను మలచి నీ ప్రవర్తనను రూపుదిద్దినవి గనుక యింకా ఎక్కువ నియంత్రణ శ్రద్ధవహించినట్లయితే ఇప్పటికీ నీ ప్రవర్తనను మరల మార్చుకొనుటకు నీకు సాధ్యమౌతుంది.
అయినను నీవింకా ఇలా ఎదురాడవచ్చును: ‘కానీ నేను నిజంగా మార్చుకోగలనా? ముందెన్నో మారులు ప్రయత్నించి విఫలమయ్యాను. నేను ఎలా వున్నానో అలాగేవుంటాను, మరిక దాన్నిగూర్చి నేనేం చెయ్యలేను!
యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలును గమనించండి. (రోమీయులు 7:18-21) పౌలు క్రైస్తవులను వ్యతిరేకించే క్రూరుడైన స్వనీతిపరుడైయుండియు తానే క్రైస్తవుడయ్యాడు. తాను మారవలెననుకున్నాడు ఆయన మారిపోయాడు. ఆటంకములు లేక జన్యుసంబంధమైన ప్రభావాలకు లొంగి తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. తన ప్రాచీన స్వభావం మార్పు చెందుట అసాధ్యమని ఆయన నమ్మలేదు. ఆయన గట్టి కృషిచేశాడు. అయితే ఆయనకు చాలా సహాయం లభించింది.—గలతీయులు 1:13-16.
ఆ సహాయం ఎక్కడనుండి వచ్చింది? (g91 7/8)
[అధస్సూచీలు]
a [వాచ్‌టవర్ 88 9/1 పే. 15, పేరా 8 చూడుము.]