కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 4/8 పేజీ 31
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అందమైన బుద్ధిహీనురాలు!
  • డ్రైవర్లూ గమనించండి
  • పొగత్రాగే తండ్రులు
  • ఎలక్ట్రానిక్‌ తప్పుడు నోరు
  • ఇండియా విడిభాగాల వ్యాపారం
  • ఐగుప్తులో జలనిధి కనిపెట్టబడుట
  • సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?
    తేజరిల్లు!—1996
  • లక్షలాది ప్రాణాలు పొగలోనే కలిసిపోతున్నాయి
    తేజరిల్లు!—1995
  • పొగత్రాగుట నిజంగా అంత చెడ్డదా?
    తేజరిల్లు!—1992
  • పొగత్రాగాలని కలిగే వత్తిడిని నేనెలా ఎదిరించగలను?
    తేజరిల్లు!—1992
తేజరిల్లు!—1992
g92 4/8 పేజీ 31

ప్రపంచ పరిశీలన

అందమైన బుద్ధిహీనురాలు!

“ఏవో వ్రాతలు వ్రాసియున్న టి-షర్టులు వేసికోవడం ఈకాలంలో మంచి జనాదరణ పొంది యుండవచ్చును,” అని ఇండియా టుడే పత్రిక తెల్పుతుంది. అయితే ఆవిధమైన అలంకరణ చేసికొనుటకు ప్రయత్నించుటలో తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుచున్నవని కలకత్తాలో ఒక పడుచు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది. “మంచి సొగసైన వదులుగానున్న ట్రౌజర్సు కంటికి ఆకర్షణీయంగా వుండే టీ-షర్టు వేసుకొని” ఆమె అటుగా షికారుకెళ్లినపుడు కొంతమంది చైనీస్‌ కుర్రాళ్లు ఆమెను వేలెత్తి చూపిస్తూ అమితంగా నవ్వుటకారంభించారు. ఆమె వారిని ఎందుకు నవ్వుతున్నారని అడిగినప్పుడు వారు ఆమె టి-షర్టు మీద చైనా భాషలో ఇలా వ్రాయబడింది గనుకనే అని చెప్పారు: “నేను నున్నగా వున్న కొబ్బరి బోండం వంటి కోతిని. దీనిని చూసే వారెవరైనా నన్నుచూచి హేళనగా నవ్వాలి ఎందుకంటే నేను చదువలేని వ్రాయలేని భాషను కల్గిన దుస్తులను ధరించి కనబరుస్తూవున్నందున నేను అత్యంత బుద్ధిహీనురాలిని గనుక.”

డ్రైవర్లూ గమనించండి

ప్రతిసారి అడ్డరోడ్లదగ్గర రైళ్లను దాటిపోవాలనే కార్లు ప్రయత్నిస్తూవుండుట ఈనాడు ఒక అలవాటైపోయిందని ట్రైన్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. సంఘటనల లెక్కలను పరిశీలిస్తే ఇది రుజువౌతుంది. అమెరికాలో 1989 సంవత్సరములో అడ్డరోడ్ల దగ్గర 5,766 సార్లు వాహనాలు ఢీకొంటే 798 మంది చనిపోగా 2,588 మంది గాయపడ్డారు. అనేక సందర్భాలలో కారు డ్రైవర్లు గేట్ల దగ్గర ఇచ్చే సూచనలను రైలు వస్తుందని చూపించే లైట్లను ఖాతరు చెయ్యరు. అడ్డరోడ్డు దగ్గరనే రైలునుదాటి పోవాలని ఎందుకు కారు డ్రైవర్లు ప్రయత్నిస్తున్నారు, ఎందుకంటే బహుశా రైలు కూడా కారువలె పరుగెత్తుతుందని వారనుకుంటూ వుండవచ్చును. అయితే అది అలా పరుగెత్తలేదు. రవాణారైలులో, ఇంజను ఒక్కటే 169 టన్నులకంటే ఎక్కువ బరువుంటుంది. గంటకు 50 మైళ్ల చొప్పున (80 కి మీ గంటకు) ప్రయాణంచేస్తున్న రైలుబండికి బ్రేకులు వేస్తే ఒక మైలు (ఒకటిన్నర కి మీ) వెళ్లిన తర్వాతగాని ఆగదు. అందుకే కారు డ్రైవర్లు జ్ఞాపకముంచు కోవలసిన విషయమేమంటే: రైలు ఎప్పుడూ జయిస్తుంది.

పొగత్రాగే తండ్రులు

పొగ త్రాగే తల్లులవలన వారికి కలుగబోయే సంతానమునకు వచ్చే అనర్థం అందరికీ తెలిసిందే. గానీ పొగత్రాగే తండ్రుల విషయమేమిటి? “గర్బంతో వున్నకాలంలో తల్లులు పొగ త్రాగుచున్నందువలన కలిగే దుష్ఫలితాల విషయంలో పొగత్రాగే తండ్రులు కూడా తప్పనిసరిగా సమాన బాధ్యత వహించవలసివున్నది. ఆమె పొగత్రాగుట మానుకోవాలంటే గర్భిణీ స్త్రీ యొక్క భర్త సహకారము ఆమెకు వుండాలి, తల్లితండ్రులిద్దరూ పొగత్రాగుతుంటే గర్భస్థ శిశువుకు నిశ్చయంగా హానికలుగుతుంది,” అని సౌత్‌ ఆఫ్రికన్‌ మెడికల్‌ జర్నల్‌ హెచ్చరిస్తుంది. ఎడతెరపి లేకుండా పొగత్రాగుట మూలంగా శిశువు పుట్టిన తర్వాత కూడా దాని ప్రభావముంటుందని ఆ జర్నల్‌ హెచ్చరిస్తుంది. సిగరెట్లు త్రాగే అలవాటున్న ఇంట్లో పెరిగే పిల్లలలో అధికశాతం “రోగంమూలంగా బడికి పోలేదు” అనే కారణం చెప్పుటకును “వారే సిగరెట్లు త్రాగేవారుగా తయారగుటకును” అవకాశాలు మెండుగావున్నవి.

ఎలక్ట్రానిక్‌ తప్పుడు నోరు

ఇక సమస్తం అదే అన్నారు. జోబులో వేసికొనగల్గేంత చిన్నది, శబ్దంచేసే వస్తువువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలతో మాటలు కూర్చిన మాటలపెట్టె వారి తప్పులను గూర్చి తమకుతాము చెప్పుకోలేని పిరికివారికి బదులుగా మాట్లాడుటకు దాన్ని తయారు చేశారు. దాన్ని కదిలిస్తే చాలు వరుసగా పెద్దబూతులే ప్రేలుతుంది. “అది ఎంతో జనాదరణపొందిన సాధనం” అని ఒక కొట్టు యజమానుడు అన్నాడు. “విచారకరమేగానీ ఏంచేస్తాం ప్రజలు అటువంటి వాటినే కోరుకుంటున్నారు.” మొట్టమొదట అది రెండు రకాలుగా వచ్చింది. అందులో కొంచెం మెత్తనిది ఇదిగో అటువంటి మాటలు అంటే, “చచ్చిపో” మరియు “నువ్వు బుద్ధిహీనుడవు” అని పలికేది వ్యాపారరీత్యా విఫలమైంది.

ఇండియా విడిభాగాల వ్యాపారం

“ఇండియాలో ఇప్పుడు, రోగికి సంబంధంలేని బ్రతికియున్న ఇతరులనుండి దానంగా పొందిన మూత్రపిండాలను బహుశా అత్యధిక సంఖ్యలో మార్పిడిచేస్తున్నట్లు మోసపూరిత ఘనత పొందుచున్నది,” అని ఇండియా టుడే చెబుతుంది. దేశంలో ఇప్పుడు సంవత్సరమునకు 2,000 కంటే ఎక్కువ మూత్రపిండాలు బ్రతికియున్నవారు అమ్మేస్తున్నారు. ఈ అమ్మకముల వెనుకనున్న కారణం అప్పులు, దారిద్ర్యమే. “మేమెంతో నిరాశలో వుంటిమి, నాకు మిగిలిందొకటే, దొంగతనమైన చెయ్యాలి లేక నేరం చేసే స్థానిక దాదా నైనా కావాలి,” అని ముగ్గురు పిల్లల తండ్రి అంటున్నాడు. భార్యభర్తలిద్దరు వారివారి మూత్రపిండాలను అమ్మివేశారు. “ఘనంగా జీవించాలనుకున్నాం” అని తండ్రి అన్నాడు. శరీరావయవాలకు అంత అధిక ధరలుపెట్టవలసి వస్తున్నందున, కంటి శుక్లాలను, చర్మాన్ని అమ్మే వారు కూడ అధికమౌతున్నారు. మానవ అవయవాలను వ్యాపారంగా వినియోగంచేసే పద్ధతి ఈ దేశంలో వైద్యపరంగా పెద్ద నైతిక సమస్యగా తయారైంది,” అని ప్రముఖ వైద్యుడన్నాడు.

ఐగుప్తులో జలనిధి కనిపెట్టబడుట

నీళ్లకొరత ఉన్న దేశాలలో ఐగుప్తు ప్రథమస్థానం వహిస్తుంది. దానికున్న అతిపెద్ద జలనిధి నైలునదియే, అది కూడా చుట్టున్న దేశాల అవసరాలు తీర్చవలసి వస్తుంది. ఐగుప్తు జనాబా 5 కోట్ల 50 లక్షలకు చేరింది, ప్రతి తొమ్మిది నెలలకు పదిలక్షల మంది వరకు జనాబా పెరుగుతుంది. అయితే ఈ మధ్య ఉపగ్రహం ద్వారా పరిశోధనలు జరిపినందున, ఐగుప్తులోని పశ్చిమతీరానగల ఎడారిలో భూమిక్రింద మరుగైయున్న పెద్ద జలనిధి బయటపడింది. “ఆఫ్రికా మొత్తంలో వున్నంత జలంకంటె ఎక్కువ జలం ఇక్కడ వుండవచ్చునని విజ్ఞాన శాస్త్రజ్ఞులు నమ్ముచున్నారు,” అని వర్‌ల్డ్‌ ప్రెస్‌ రివ్యూ చెబుతుంది. ఒకోచోట త్రవ్విన బావిలోనే 2,00,000 ఎకరాలకు (80,000 హెక్టార్లకు) వ్యవసాయానికి 200 సంవత్సరముల వరకు సరిపడేంత నీరున్నదని” దూర పరిశోధన కొరకున్న ఐగుప్తులోని బోస్టన్‌ విశ్వవిద్యాలయ డైరెక్టర్‌ డా. ఫరూక్‌ అల్‌-బాజ్‌ అంటున్నాడు. (g91 3/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి