కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జనవరి పేజీ 8
  • కరపత్రాలను ఉపయోగిస్తూ పరిచర్యలో ఎలా మాట్లాడవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కరపత్రాలను ఉపయోగిస్తూ పరిచర్యలో ఎలా మాట్లాడవచ్చు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • సరికొత్త రూపంతో కొత్త కరపత్రాలు!
    మన రాజ్య పరిచర్య—2014
  • లాభసాటి ఫలితాలకు కరపత్రాలను ఉపయోగించడం
    మన రాజ్య పరిచర్య—1993
  • ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఎలా ఉపయోగించాలి?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • సువార్తను వ్యాప్తి చేయడానికి కరపత్రాలు ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—2012
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జనవరి పేజీ 8
‘బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?’ అనే కరపత్రం చూపిస్తూ బస్టాప్‌ దగ్గర ఒకామెకు సాక్ష్యమిస్తున్న ఒక సహోదరి

మన క్రైస్తవ జీవితం

కరపత్రాలను ఉపయోగిస్తూ పరిచర్యలో ఎలా మాట్లాడవచ్చు?

మీటింగ్‌ వర్క్‌బుక్‌ మొదటి పేజీలో ‘ఇలా మాట్లాడవచ్చు’ అనే అంశాన్ని 2018 జనవరి నుండి మీరు చూసేవుంటారు. మనం ఊరికే ప్రచురణల్ని ఇవ్వడం కాదుగానీ, ప్రజలతో మాట్లాడడం పై మనసుపెట్టాలనే ప్రోత్సాహాన్ని పొందాం. పరిచర్యలో కేవలం బైబిల్ని ఉపయోగిస్తూ ఎలా మాట్లాడాలో తెలియజేసే వీడియోలు కూడా చూశాం. దానర్థం మనం ఇక ఇంటింటి పరిచర్యలో ప్రచురణల్ని ఉపయోగించకూడదనా? కానేకాదు! ఉదాహరణకు, మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు కరపత్రాలు బాగా ఉపయోగపడతాయి. ఏదైనా ఒక కరపత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మనం ఈ పద్ధతిని పాటించవచ్చు:

  1. కరపత్రం పైనున్న ప్రశ్నను, అలాగే దాని కిందున్న వాటిని చూపిస్తూ ఇంటివ్యక్తి అభిప్రాయం అడగండి.

  2. కరపత్రం లోపల, పైభాగంలో ఉండే బైబిలు జవాబును చూపించండి. సమయం ఉంటే, కరపత్రంలో ఉన్న కొంత సమాచారాన్ని వాళ్లతో చదివి, చర్చించండి.

  3. తర్వాత, కరపత్రాన్ని వాళ్లకు ఇచ్చి మిగతా సమాచారాన్ని తీరిక సమయంలో చదవమని చెప్పండి.

  4. చివరిగా, “ఒక్కసారి ఆలోచించండి . . . ” కిందున్న ప్రశ్నను చూపించి, దానికి బైబిలు ఇచ్చే జవాబును చెప్పడానికి మళ్లీ కలుసుకునే ఏర్పాటు చేసుకోండి.

భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?’ అనే కరపత్రంలో ఉన్న నాలుగు ప్రత్యేకతల్ని అంకెలతో చూపిస్తున్న చిత్రం

మీరు మళ్లీ కలిసినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పి, ఇంకో ప్రశ్న వేసి రండి. దానికోసం, మన వెబ్‌సైట్‌లో లేదా కరపత్రం వెనుక ఇచ్చిన ప్రచురణలో ఉండే ఏదైనా ప్రశ్నను ఎంపిక చేసుకోవచ్చు. సరైన సమయం చూసి, దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌ను లేదా బోధనా పనిముట్లలో బైబిలు స్టడీ కోసం ఉపయోగించే వేరే ఏదైనా ప్రచురణను పరిచయం చేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి