కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 అక్టోబరు పేజీ 7
  • మీరు దేవుని వాక్యాన్ని ఎంత విలువైనదిగా చూస్తున్నారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు దేవుని వాక్యాన్ని ఎంత విలువైనదిగా చూస్తున్నారు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్లు బైబిల్ని విలువైనదిగా ఎంచారు—చిన్నభాగం (విలియమ్‌ టిండేల్‌)
    అదనపు అంశాలు
  • విలియమ్‌ టిండేల్‌—దూరదృష్టిగల వ్యక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • బైబిలు మనకు చేరిన విధానం—భాగం రెండు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • సహాయం మీకు చేరువలో ఉంది
    తేజరిల్లు!—2020
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 అక్టోబరు పేజీ 7

మన క్రైస్తవ జీవితం

మీరు దేవుని వాక్యాన్ని ఎంత విలువైనదిగా చూస్తున్నారు?

బైబిల్లో యెహోవా దేవుని ఆలోచనలు, మాటలు ఉన్నాయి. ఈ పవిత్ర పుస్తకానికి ఆయనే మూలం. (2 పేతు 1:20, 21) దేవుడు తన రాజ్యం ద్వారా తన సర్వాధిపత్యం నిరూపించుకుంటాడని, అలా మనుషులందరికీ ఒక మంచి భవిష్యత్తును తీసుకురాబోతున్నాడని బైబిలు తెలియజేస్తుంది. మన పరలోక తండ్రి అయిన యెహోవా దేవుని అద్భుతమైన లక్షణాల గురించి కూడా బైబిలు చెప్తుంది.—కీర్త 86:15.

మనలో ప్రతీ ఒక్కరం వేర్వేరు కారణాల్ని బట్టి యెహోవా వాక్యాన్ని విలువైనదిగా చూస్తాం. అయితే బైబిల్ని ప్రతీరోజు చదువుతూ, అందులో ఉన్నది పాటించడం ద్వారా దాన్ని విలువైన బహుమతిగా ఎంచుతున్నామని చూపిస్తున్నామా? “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది” అని చెప్పిన కీర్తనకర్త భావాల్ని మనం కూడా మన పనుల ద్వారా చూపిద్దాం.—కీర్త 119:97.

వాళ్లు బైబిల్ని విలువైనదిగా ఎంచారు—చిన్న భాగం (విలియమ్‌ టిండేల్‌) వీడియో చూపించి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • విలియమ్‌ టిండేల్‌; తన ప్రింటింగ్‌ ప్రెస్‌లో విలియమ్‌ టిండేల్‌; విలియమ్‌ టిండేల్‌ అనువదించిన కొత్త నిబంధన మొదటి ఎడిషన్‌ కాపీ

    విలియమ్‌ టిండేల్‌ బైబిల్లోని పుస్తకాల్ని ఎందుకు అనువదించాడు?

  • బైబిల్ని అనువదించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఎందుకంత గొప్పవి?

  • టిండేల్‌ అనువదించిన బైబిళ్లు ఇంగ్లాండ్‌కు రహస్యంగా ఎలా వచ్చాయి?

  • దేవుని వాక్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని మనలో ప్రతీఒక్కరం ఎలా చూపించవచ్చు?

ధ్యానించడం కోసం: దేవుని వాక్యం ఈ కింది వాటిలా ఎలా ఉంది?

  • దీపంలా, వెలుగులా—కీర్త 119:105

  • నీళ్లలా—ఎఫె 5:26

  • ఖడ్గంలా—ఎఫె 6:17

  • అద్దంలా—యాకో 1:23-25

దేవుని వాక్యాన్ని రోజూ చదవండి

బైబిలు రీడింగ్‌ కోసం షెడ్యూలు

jw.org వెబ్‌సైట్‌లో ఉన్న బైబిలు పఠనం కోసం పట్టిక మీరెప్పుడైనా ఉపయోగించారా? ఈ పట్టిక PDFలో మీరు చదవాలనుకుంటున్న బైబిలు అధ్యాయాల మీద క్లిక్‌ చేస్తే, వెంటనే jw.orgలో ఆ బైబిలు భాగం తెరుచుకుంటుంది. మీ భాషలో ఆడియో రికార్డింగ్‌లు అందుబాటులో ఉంటే, మీరు వాటిని కూడా jw.orgలో వినొచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి