దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 పేతురు 1-3
“యెహోవా రోజు కోసం ఎదురుచూస్తూ, దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకొని జీవించాలి”
యెహోవా నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఆయన త్వరగా తీర్పు అమలుచేస్తాడు. అయితే యెహోవా రోజు కోసం సిద్ధంగా ఉన్నామని మన పనులు చూపిస్తున్నాయా?
“పవిత్రంగా నడుచుకుంటూ, దైవభక్తిగల పనులు చేస్తూ” ఉండడం అంటే ఏంటి?
తప్పొప్పుల విషయంలో యెహోవా పెట్టిన ప్రమాణాల్ని పాటిస్తూ మన విశ్వాసానికి అనుగుణంగా జీవించాలి
మన ఆరాధనలో భాగమైన ప్రతీది క్రమంగా చేయాలి, అవి ఒంటరిగా చేసేవైనా, బహిరంగంగా చేసేవైనా