దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 థెస్సలొనీకయులు 1-3
పాపపురుషుడు వెల్లడి అవ్వడం
పౌలు మాటల ఉద్దేశం ఏంటి?
“ఎవరు అడ్డుకుంటున్నారు” (6వ వచనం)—బహుశా అపొస్తలులు కావచ్చు
‘వెల్లడవ్వడం’ (6వ వచనం)—అపొస్తలులు చనిపోయిన తర్వాత, భ్రష్ట క్రైస్తవులు వేషధారణతో ప్రవర్తిస్తూ బహిరంగంగా అబద్ధ బోధలు బోధించడం మొదలుపెట్టారు
“అంతుచిక్కని అతని దుష్టత్వం” (7వ వచనం)—ఈ “పాపపురుషుడు” ఎవరో పౌలు కాలంలో స్పష్టంగా అర్థం కాలేదు
“పాపపురుషుడు” (8వ వచనం)—మనకాలంలో, క్రైస్తవ మత సామ్రాజ్యంలో ఉన్న నాయకుల గుంపు
“యేసు ప్రభువు తన ప్రత్యక్షత సమయంలో . . . అతన్ని [పాపపురుషుణ్ణి] నాశనం చేస్తాడు” (8వ వచనం)—‘పాపపురుషుడితో’ పాటు, సాతాను లోకం మీదికి దేవుని తీర్పుల్ని అమలు చేయడం ద్వారా యేసు, రాజుగా తన పరలోక ప్రత్యక్షతను చూపిస్తాడు
మీరు ఉత్సాహంగా, అత్యవసర భావంతో ప్రకటించేలా ఈ వచనాలు మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయి?