కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 అక్టోబరు పేజీ 7
  • యెహోవాను స్తుతించడానికి జీవించండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను స్తుతించడానికి జీవించండి!
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • తలాంతుల ఉపమానం నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • యెహోవా కోసం మీరు చేస్తున్నదాన్ని బట్టి ఆనందించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • దేవున్ని సేవించడానికి మిమ్మల్ని ఏది పురికొల్పుతుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మీకు దేన్ని బట్టి ‘అతిశయం కలుగుతుంది’?
    మన రాజ్య పరిచర్య—2012
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 అక్టోబరు పేజీ 7

మన క్రైస్తవ జీవితం

యెహోవాను స్తుతించడానికి జీవించండి!

జీవితం ఒక విలువైన బహుమానం. మనం ప్రతీరోజు ఆ బహుమానాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేది మనం దాన్ని ఎంత విలువైనదిగా చూస్తున్నామో తెలియజేస్తుంది. యెహోవా సాక్షులుగా మనం, మన ప్రతిభను, సామర్థ్యాల్ని ఉపయోగించి జీవదాత అయిన యెహోవాను గౌరవించడానికి, ఘనపర్చడానికి కృషి చేస్తాం. (కీర్త 36:9; ప్రక 4:11) అయితే, ఈ దుష్ట లోకంలో రోజువారీ చింతలు మన ఆధ్యాత్మిక లక్ష్యాలను సులువుగా వెనక్కి నెట్టేయవచ్చు. (మార్కు 4:18, 19) మనలో ప్రతీ ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘నేను యెహోవాకు నిజంగా నా శ్రేష్ఠమైనది ఇస్తున్నానా? (హోషే 14:2) నా ఉద్యోగం లేదా కరీర్‌ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నా ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏంటి? నా పరిచర్యను ఎలా పెంచుకోవచ్చు?’ ఏ విషయంలోనైనా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని మీకు అనిపిస్తే, సహాయం కోసం యెహోవాకు ప్రార్థన చేసి అవసరమైన మార్పులు చేసుకోండి. నిస్సందేహంగా, ప్రతీరోజు యెహోవాను స్తుతించడం వల్ల మీరు జీవితంలో సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు.—కీర్త 61:8.

ఇడ్‌గార్డో ఫ్రాన్‌కో స్టేజీ మీద పాట పాడుతున్నాడు, ఇడ్‌గార్డో ఫ్రాన్‌కో పరిచర్య చేస్తున్నాడు

మీరు మీ ప్రతిభను ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు?

  • యెహోవా కోసం మీ ప్రతిభను ఉపయోగించండి అనే వీడియో చూసి, కిందున్న ప్రశ్నలకు జవాబులు చెప్పండి: మీకున్న ప్రతిభను సాతాను లోకం కోసం ఉపయోగించడం ఎందుకు తెలివైన పని కాదు? (1 యోహా 2:17)

  • తమకున్న శ్రేష్ఠమైన వాటిని యెహోవాకు ఇచ్చే వాళ్లకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

  • పవిత్ర సేవలో స్వచ్ఛందంగా ఏ రంగాల్లో మీ ప్రతిభను, నైపుణ్యాలను ఉపయోగించవచ్చు?

కుటుంబ ఆరాధన కోసం సలహాలు:

  • చాలా సంవత్సరాలుగా యెహోవా సేవ చేస్తున్న, బహుశా పూర్తికాల సేవ చేస్తున్న ఒక ప్రచారకుణ్ణి ఇంటర్వ్యూ చేయండి. యెహోవాకు తన శ్రేష్ఠమైనదాన్ని ఇవ్వడానికి అతను ఏ త్యాగాలు చేశాడు? యెహోవా అతన్ని ఎలా ఆశీర్వదించాడు?

  • ఇంటర్వ్యూలు, అనుభవాలు > పవిత్ర సేవలోని ఆశీర్వాదాలు చూడండి. పవిత్ర సేవలో వేర్వేరు రంగాల్లో జీవితాంతం సేవ చేసిన అనేకమంది సంతోషంగా చెప్తున్న మాటల్ని మీరు చూస్తారు, వింటారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి