దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 1-5
“యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి”
“అంత్యదినములలో” |
మనం ఇప్పుడు జీవిస్తున్న కాలం |
“యెహోవా మందిర పర్వతము” |
వేగంగా సాగుతున్న యెహోవా స్వచ్ఛారాధన |
“ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు” |
స్వచ్ఛారాధన చేయాలనుకున్న వాళ్లంతా ఏకమౌతున్నారు |
“దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి” |
నిజ ఆరాధకులు ఇతరులను కూడా ఆహ్వానిస్తున్నారు |
“ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము” |
యెహోవా తన వాక్యం ద్వారా మనకు నిర్దేశాన్ని ఇస్తూ ఆయన మార్గములలో నడవడానికి మనకు సహాయం చేస్తాడు |
“యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక” మానేస్తారు |
యుద్ధము చేయడానికి ఉపయోగించే ఆయుధాలను వ్యవసాయ పనిముట్లుగా మార్చడం గురించి యెషయా వర్ణిస్తున్నాడు. శాంతిని తీసుకురావడానికి యెహోవా ప్రజలు ఏమి చేస్తారో అది చూపిస్తుంది. యెషయా కాలంలో ఉపయోగించిన ఈ పనిముట్లు ఏమిటి? |
“ఖడ్గములను నాగటి నక్కులుగాను” |
1 నాగటి నక్కు అంటే నాగలిలో మట్టిని దున్నడానికి ఉపయోగించే భాగం. కొన్నిటిని ఇనుముతో తయారు చేసేవాళ్లు.—1 సమూ 13:20 |
“యీటెలను మచ్చుకత్తులుగాను” |
2 మచ్చుకత్తి అంటే కొడవలి ఆకారంలో పిడికి బిగించి ఉన్న పదునైన ఇనుప ముక్క. దీనిని ద్రాక్ష గెలలు కోయడానికి ఉపయోగించేవాళ్లు.—యెష 18:5 |