మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం “దేవుని ప్రేమలో నిలిచి ఉండండి” పుస్తకం ద్వారా హృదయాలను చేరుకోండి
ఎందుకు ప్రాముఖ్యం? యెహోవాకు నచ్చిన విధంగా ఆరాధించాలంటే ప్రజలు ఆయన ప్రమాణాలను నేర్చుకుని వాటి ప్రకారం జీవించాలి. (యెష 2:3, 4) మనం అధ్యయనం చేసే రెండో పుస్తకం “దేవుని ప్రేమ” పుస్తకం. దేవుని సూత్రాలకు రోజువారీ జీవితంలో ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోవడానికి ఇది బైబిలు విద్యార్థులకు సహాయం చేస్తుంది. (హెబ్రీ 5:14) మనం బోధిస్తున్నప్పుడు వాళ్ల హృదయాలకు చేరేలా బోధించాలి, వాళ్ల జీవితంలో మార్పులు చేసుకునేలా మనం నేర్పించాలి.—రోమా 6:17.
ఎలా చేయాలి?
విద్యార్థి అవసరాలను బట్టి మీరు బాగా సిద్ధపడండి. చర్చిస్తున్న సమాచారం గురించి వాళ్లు ఏమనుకుంటున్నారో, ఎలా భావిస్తున్నారో బయటకు చెప్పేలా మీరు ముందే ప్రశ్నలు తయారు చేసుకోండి.—సామె 20:5; be 259
బైబిలు సూత్రాలను పాటించడం ఎంత ముఖ్యమో మీ విద్యార్థి తెలుసుకోవడానికి పుస్తకంలో ఉన్న బాక్సులను ఉపయోగించండి
మనస్సాక్షికి సంబంధించిన విషయాలను సొంతగా ఆలోచించుకునేలా మీ విద్యార్థికి సహాయం చేయండి. వాళ్లకోసం మీరు నిర్ణయాలు తీసుకోవద్దు.—గల 6:5
ఏ బైబిలు సూత్రాలను మీ విద్యార్థి పాటించాలో జాగ్రత్తగా తెలుసుకోండి. యెహోవా మీద ప్రేమతో ఆ మార్పులు చేసుకోవడానికి అతనికి ప్రేమగా సహాయం చేయండి.—సామె 27:11; యోహా 14:31