శిష్యులను చేసే పనిపై మనసు పెట్టండి
1. ప్రజలు రక్షణ పొందాలంటే ఏం అవసరం?
1 దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలనే దేవుని ప్రజల నిర్ణయం, ఉత్సాహం 2014 సేవా సంవత్సరం రిపోర్టు చూస్తే అర్థమౌతుంది. (మత్త. 24:14) ఇంటింటి పరిచర్య, కరపత్రాలు-ఆహ్వాన పత్రాలు ఇవ్వడానికి చేసిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సాక్ష్యం కోసం చేసిన ఏర్పాట్ల వల్ల బైబిలు సందేశాన్ని ఎక్కువ మందికి చెప్పగలుగుతున్నాం. అయితే వాళ్లు రక్షణ పొందాలంటే, మనం బైబిలు అధ్యయనం ద్వారా యేసు శిష్యులయ్యేలా వాళ్లకు సహాయం చేయాలి.—1 తిమో. 2:4.
2. ఎల్లప్పుడూ బైబిలు అధ్యయనం మొదలు పెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామో లేదో తెలుసుకోవడానికి ఏ ప్రశ్నల్ని పరిశీలించుకోవాలి?
2 ఎల్లప్పుడూ బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలనే లక్ష్యంతో ఉండండి: ఎవరైనా మనం చెప్పిన విషయాలపై ఇష్టం చూపిస్తే, బైబిలు అధ్యయనం మొదలు పెట్టాలనే లక్ష్యంతో అతని వివరాలు తీసుకుని వీలైనంత త్వరగా అతన్ని కలుస్తున్నామా? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ఎలా చేస్తామో చూపించి ఎంతకాలం అవుతుంది? పత్రికా మార్గంలో బైబిలు అధ్యయనం మొదలుపెట్టి ఎంతకాలం అవుతుంది? తోటి ఉద్యోగులకు, విద్యార్థులకు, పొరుగువాళ్లకు, బంధువులకు, వేరేవాళ్లకు బైబిలు ఎందుకు చదవాలి? బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియోలు చూపించామా? కార్ట్, టేబుల్ ఉపయోగించి సాక్ష్యమిస్తున్నప్పుడు మన అధ్యయన పుస్తకాల్ని తీసుకునేవాళ్లతో ఆ పుస్తకం ఉపయోగించి ఉచితంగా బైబిలు అధ్యయనం చేస్తామని చెప్తున్నామా?
3. సత్యాన్ని విజయవంతంగా బోధించాలంటే ఏం అవసరం?
3 యెహోవా, యేసు సహాయం చేస్తారు: ‘శిష్యులను చేయుడి’ అనే ఆజ్ఞలో మొదటి మాటలోనే యేసు, మీరు “వెళ్లి” అని చెప్పాడు. అంటే మనం అందుకు కృషి చేయాలి, చొరవ తీసుకోవాలి అని ఆయన చెప్తున్నాడు. అయితే మనల్ని ఒంటరిగా విడిచి పెడతానని అనలేదు కానీ మనతో కూడా ఉంటానని మాటిచ్చాడు. (మత్త. 28:19, 20) అంతేకాక, యెహోవా మనకు పరిశుద్ధాత్మతో పాటు ప్రజలకు సత్యాన్ని నేర్పించడానికి సహాయపడే ప్రచురణలను, శిక్షణను కూడా ఇచ్చాడు. (జెక. 4:6; 2 కొరిం. 4:7) ఈ ముఖ్యమైన పనిలో పాల్గొనాలనే కోరికను, కావాల్సిన శక్తిని ఇవ్వమని మనం ప్రార్థన చేయవచ్చు.—ఫిలి. 2:13.
4. మనం శిష్యులను చేసే పనిపై ఎందుకు మనసుపెట్టాలి?
4 సువార్త ప్రకటించడం మనకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అయితే సత్యాన్ని చెప్పి, మనతో కలిసి “జీవమునకు పోవు” మార్గంలో ప్రవేశించేలా ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ ఆనందం ఇంకా ఎక్కువవుతుంది. (మత్త. 7:13, 14; 1 థెస్స. 2:19, 20) శిష్యులను చేసే పనిమీదే మనసుపెట్టడం ద్వారా “యెవడును నశింపవలెనని” ఇష్టపడక, “అందరు మారుమనస్సు పొందవలెనని” కోరుకునే యెహోవా దేవున్ని సంతోషపెడతాం.—2 పేతు. 3:9.