దేవుని వాక్యానికి ఉన్న బలాన్ని మీ పరిచర్యలో ఉపయోగించండి
మనం చెప్పే సువార్త వినడానికి ఎవరైనా సమయమిస్తే, దేవుని వాక్యానికున్న శక్తి పనిచేసేలా బైబిలు నుండే లేఖనాలను చదవడం ద్వారా ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటాం. గత ఏడాది జరిగిన ఒకరోజు ప్రత్యేక సమావేశంలో ఈ విషయాన్ని నొక్కిచెప్పారు. ప్రాంతీయ పర్యవేక్షకుడు “దేవుని వాక్యానికి ఉన్న బలాన్ని మీ పరిచర్యలో ఉపయోగించండి” అనే ప్రసంగాన్ని ఇచ్చాడు. దానిలోని ముఖ్యమైన విషయాలు మీకు గుర్తున్నాయా?
మన మాటలకన్నా దేవుని వాక్యం ఎందుకు ఎంతో బలమైనది?—2 తిమో. 3:16, 17.
దేవుని వాక్యం మన భావావేశాలను ఎలా కదిలిస్తుంది? మన ఆలోచనలను ఎలా తీర్చిదిద్దుతుంది? మన ఉద్దేశాలను ఎలా సరిచేస్తుంది? మన ప్రవర్తనను ఎలా మారుస్తుంది?—కావలికోట జూన్ 15, 2012, 27వ పేజీ, 7వ పేరా.
పరిచర్యలో ఎవరికైనా లేఖనం చదివి వినిపించినప్పుడు, వాళ్ల అవధానం దేవుని వాక్యం వైపు మళ్లి దానిపట్ల గౌరవం కలిగేలా ఏమి చేయవచ్చు?—పరిచర్య పాఠశాల పుస్తకంలో 148వ పేజీ, 3-4 పేరాలు చూడండి. అలాగే మార్చి 2013 మన రాజ్య పరిచర్య, 9వ పేజీ, 8వ పేరా చూడండి.
మనం చదివిన లేఖనాలను వివరించి వాటి మీద తర్కించడం ఎందుకు ప్రాముఖ్యం? దాన్ని ఎలా చేయవచ్చు?—అపొ. 17:2, 3; పరిచర్య పాఠశాల పుస్తకంలో 154వ పేజీ, 4వ పేరా నుండి 156వ పేజీ 4వ పేరా వరకు చూడండి.
బైబిల్ని ఉపయోగిస్తున్నప్పుడు వివేచనను ఎలా చూపించవచ్చు?—మత్త. 10:16; జూలై 2008 మన రాజ్య పరిచర్య, 3వ పేజీ చూడండి.