దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2015 ఏప్రిల్ 27తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీవారం పాఠశాలకు సిద్ధపడుతున్నప్పుడు పరిశోధన చేయడానికి వీలుగా ప్రతీ ప్రశ్నను ఎప్పుడు చర్చిస్తారో ఆ తేదీని కూడా ఇచ్చారు.
యెహోవా నయోమి జీవితాన్ని కష్టాలపాలు చేసి ఆమెను బాధించాడా? (రూతు 1:13, 21) [మార్చి 2, w05 3/1 27వ పేజీ, 2వ పేరా]
రూతు, “యోగ్యురాలు” అనే పేరు ఎలా తెచ్చుకుంది? (రూతు 3:11) [మార్చి 2, w05 3/1 28వ పేజీ, 6వ పేరా]
సమస్యలు వచ్చినప్పుడు, హన్నా ఉదాహరణ నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? (1 సమూ. 1:16-18) [మార్చి 9, w07 3/15 16వ పేజీ, 4-5 పేరాలు]
‘బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు,’ ఏలీ కుమారుల చెడు ప్రభావం నుండి ఏది ఆయనను కాపాడింది? (1 సమూ. 2:21) [మార్చి 9, w11 4/1 16వ పేజీ, 2-3 పేరాలు]
“పనికిమాలినవారు కొందరు,” సౌలు రాజరికాన్ని అంగీకరించనప్పుడు ఆయన కఠినంగా ప్రవర్తించలేదు. దీన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (1 సమూ. 10:22, 27) [మార్చి 23, w05 3/15 23వ పేజీ, 1వ పేరా]
యెహోవాకు లోబడకుండా, బలి అర్పిస్తే సరిపోతుందనే సౌలు తప్పుడు ఆలోచన నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (1 సమూ. 15:22, 23) [మార్చి 30, w07 6/15 26వ పేజీ, 3, 4 పేరాలు]
యెహోవా “హృదయమును లక్ష్యపెట్టును” అని తెలుసుకోవడం మనకెందుకు ఓదార్పునిస్తుంది? (1 సమూ. 16:7) [ఏప్రి. 6, w00 11/15 32వ పేజీ]
సామెతలు 1:4 ప్రకారం, కష్ట సమయాల్లో మన దగ్గరున్న దేన్ని ఉపయోగించాలని యెహోవా కోరుకుంటున్నాడు? (1 సమూ. 21:12, 13) [ఏప్రి. 13, w05 3/15 24వ పేజీ, 5వ పేరా]
అబీగయీలు దావీదుకు, ఆయన మనుషులకు ఆహారం తీసుకెళ్లినప్పుడు తన భర్త శిరస్సత్వాన్ని ఎదిరించలేదని ఎందుకు చెప్పవచ్చు? (1 సమూ. 25:10, 11, 18, 19) [ఏప్రి. 20, w10 1/1 16వ పేజీ, 3వ పేరా]
అబీగయీలు, తాను చేయని తప్పుకు క్షమాపణ చెప్పింది. దీన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (1 సమూ. 25:24) [ఏప్రి. 20, w02 11/1 5వ పేజీ, 1, 4]పేరాలు]