బైబిలు బోధిస్తోంది పుస్తకంతో అధ్యయనాలు ఎలా ప్రారంభించాలి?
మనం అధ్యయనాన్ని ప్రారంభించగలిగితే చాలు మనలో చాలామంది బైబిలు అధ్యయనం నిర్వహించడానికి సంతోషిస్తాం. ఈ విషయంలో, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే క్రొత్త పుస్తకం మనకు సహాయం చేయగలదు. ఈ ప్రచురణను ఉపయోగిస్తూ గృహస్థునితో బైబిలు చర్చను ప్రారంభించేందుకు అనువుగా 3-7 పేజీల్లోని ముందుమాటలు రూపొందించబడ్డాయి. పరిచర్యలో పరిమిత అనుభవం ఉన్నవారు కూడా వీటిని ఉపయోగించి సులభంగా అధ్యయనాలు ప్రారంభించవచ్చు.
◼ మీరు 3వ పేజీని ఉపయోగిస్తూ ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు:
మీ క్షేత్రంలోని ప్రజలను కలవరపెడుతున్న ఒక వార్తాంశాన్ని లేక సమస్యను పేర్కొన్న తర్వాత, 3వ పేజీలో ముద్దక్షరాల్లో ఉన్న ప్రశ్నలవైపు గృహస్థుడి దృష్టిని మళ్ళించి వాటిపై వ్యాఖ్యానించమని ఆయనను ఆహ్వానించండి. ఆ తర్వాత 4-5 పేజీలు చూపించండి.
◼ లేక మీరు 4-5 పేజీలను ప్రత్యేకంగా చూపించడం ద్వారా సంభాషణను ప్రారంభించడానికి ఇష్టపడవచ్చు:
మీరు ఇలా అనవచ్చు: “ఇక్కడ చిత్రీకరించబడిన మార్పులు నిజంగా జరిగితే, అది అద్భుతంగా ఉండదంటారా?” లేక మీరు ఇలా అడగవచ్చు: “ఈ వాగ్దానాలలో ఏది నెరవేరాలని కోరుకుంటున్నారు?” ప్రతిస్పందనను జాగ్రత్తగా వినండి.
గృహస్థుడు, అక్కడ ఇవ్వబడిన లేఖనాల్లో ఏ లేఖనంపైనైనా ప్రత్యేక ఆసక్తి చూపించినట్లయితే, పుస్తకంలో ఆ వచనాన్ని వివరించే పేరాలు చర్చించడం ద్వారా ఆ అంశం గురించి బైబిలు ఏమి బోధిస్తోందో ఆయనకు చూపించండి. (ఈ పేజీలో ఉన్న బాక్సును చూడండి.) మీరు బైబిలు అధ్యయనమప్పుడు చర్చించే విధంగానే ఆ సమాచారాన్ని చర్చించండి. ఈ చర్చను గృహస్థుడ్ని మొదట కలుసుకున్నప్పుడు, ఆయన ఇంటి గుమ్మం దగ్గరే, ఐదు, పది నిమిషాల్లో చేయవచ్చు.
◼ 6వ పేజీ ఉపయోగిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయమని ఒక వ్యక్తిని ఆహ్వానించడం మరో పద్ధతి:
పేజీ దిగువున ఉన్న ప్రశ్నలవైపు గృహస్థుడి దృష్టిని మళ్ళించి ఇలా అడగండి: “ఈ ప్రశ్నల్లో ఏ ప్రశ్న గురించైనా మీరు ఎప్పుడైనా ఆలోచించారా?” ఆయన ఏదో ఒక ప్రశ్నపట్ల ఆసక్తి చూపినట్లయితే, పుస్తకంలో ఆ ప్రశ్నకు జవాబిచ్చే పేరాలను చూపించండి. (ఈ పేజీలోని బాక్సును చూడండి.) మీరు ఆ సమాచారాన్ని ఆయనతో కలిసి చర్చిస్తున్నారంటే, మీరు ఒక బైబిలు అధ్యయనాన్ని నిర్వహిస్తున్నట్లే.
◼ ఒక బైబిలు అధ్యయన ప్రదర్శనకు దారితీసేందుకు 7వ పేజీని ఉపయోగించవచ్చు:
ఆ పేజీలోని మొదటి మూడు వాక్యాలను చదివి ఆ తర్వాత 3వ అధ్యాయం తెరచి 1-3 పేరాలను ఉపయోగిస్తూ అధ్యయనాన్ని ప్రదర్శించండి. 3వ పేరాలోని ప్రశ్నలకు జవాబులను చర్చించేందుకు మళ్ళీ కలుసుకునే ఏర్పాటు చేసుకోండి.
◼ తిరిగివెళ్ళే ఏర్పాటు ఎలా చేసుకోవచ్చు:
మొదటి అధ్యయనాన్ని ముగిస్తున్నప్పుడు, ఆ చర్చను కొనసాగించే ఏర్పాటు చేసుకోండి. మీరిలా చెప్పవచ్చు: “మనం కొద్ది నిమిషాల్లోనే ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి బైబిలు ఏమి బోధిస్తుందో నేర్చుకున్నాం. మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నప్పుడు, [మీరు పరిశీలించబోయే ప్రశ్నను చెప్పండి] అనే ప్రశ్నను పరిశీలిద్దాం. వచ్చే వారం ఇదే సమయానికి నేను రావచ్చా?”
మనం యెహోవా నియమిత సమయాన్ని సమీపిస్తున్నకొద్దీ, చేయాల్సిన పని కోసం ఆయన మనల్ని ఎడతెగక సంసిద్ధులను చేస్తున్నాడు. (మత్త. 28:19, 20; 2 తిమో. 3:16) బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి మనం ఈ అద్భుతకరమైన క్రొత్త ఉపకరణాన్ని సమర్థంగా ఉపయోగిద్దాం.
[3వ పేజీలోని బాక్సు]
4-5 పేజీల్లో ఉన్న లేఖనాల చర్చ
◻ ప్రకటన 21:4 (27-8 పేజీలు, 1-3 పేరాలు)
◻ యెషయా 33:24; 35:5, 6 (36వ పేజీ, 22వ పేరా)
◻ యోహాను 5:28, 29 (72-3 పేజీలు, 17-19 పేరాలు)
◻ కీర్తన 72:16 (34వ పేజీ, 19 పేరా)
6వ పేజీలో ఉన్న ప్రశ్నలకు జవాబులు
◻ మనం బాధలు ఎందుకు అనుభవిస్తున్నాం? (108వ పేజీ, 6-8 పేరాలు)
◻ జీవన చింతలను మనం ఎలా తాళుకోవచ్చు? (184-5 పేజీలు, 1-3 పేరాలు)
◻ మన కుటుంబ జీవితాన్ని మనం ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు? (142వ పేజీ, 20వ పేరా)
◻ చనిపోయినప్పుడు మనకు ఏమి సంభవిస్తుంది? (58-9 పేజీలు, 5-6 పేరాలు)
◻ చనిపోయిన మన ప్రియమైనవారిని మనం మళ్లీ ఎప్పుడైనా చూస్తామా? (72-3 పేజీలు, 17-19 పేరాలు)
◻ భవిష్యత్తుకు సంబంధించిన తన వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడని మనం ఎలా నమ్మవచ్చు? (25వ పేజీ, 17వ పేరా)