యెహోవాకు, యేసుకు ఉన్న ఆసక్తిని ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మీరూ చూపిస్తారా?
1. యేసు మరణ జ్ఞాపకార్థ సమయంలో, యెహోవాసాక్షులు ఎలా ప్రత్యేక కృషి చేస్తున్నారు?
1 యెహోవా ఎంతో ఆసక్తితో తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. దేవుని రాజ్యం తెచ్చే కొన్ని ఆశీర్వాదాల గురించి యెషయా 9:7 చెప్తుంది. అక్కడ ఇలా ఉంది, “సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.” అదేవిధంగా, దేవుని కుమారుడు తన భూపరిచర్యలో సత్యారాధన పట్ల గొప్ప ఆసక్తి చూపించాడు. (యోహా. 2:13-17; 4:34) ప్రతీ సంవత్సరం యేసు మరణ జ్ఞాపకార్థ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలమంది యెహోవా సేవకులు ఎక్కువ గంటలు పరిచర్య చేస్తున్నారు. అలా యెహోవాకు, యేసుకు ఉన్న ఆసక్తిని చూపించడానికి వాళ్లు ప్రత్యేక కృషి చేస్తున్నారు. వాళ్లలో మీరూ ఉంటారా?
2. ఆసక్తి ఉంటే, మార్చి 7 నుండి మనం ఏమి చేస్తాం?
2 ప్రచార కార్యక్రమం: ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం శనివారం, మార్చి 7న మొదలౌతుంది. ఆసక్తితో పరిచర్య చేయడానికి ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి. క్షేత్రంలో వీలైనంత ఎక్కువ భాగాన్ని పూర్తిచేయడానికి కృషిచేస్తూ సంఘాలు ఎంతో ఆసక్తి చూపిస్తాయి. ఆహ్వానపత్రం ఇచ్చి లేదా jw.org ఉపయోగించి మీ బైబిలు విద్యార్థులను, ఆసక్తి చూపించినవాళ్లను, తోటి ఉద్యోగులను, బంధువులను, స్కూల్లో తోటివాళ్లను ఆహ్వానించడానికి శాయశక్తులా కృషిచేయండి.
3. మార్చి, ఏప్రిల్ నెలల్లో మనమెలా ఎక్కువ గంటలు పరిచర్య చేయవచ్చు?
3 సహాయ పయినీరు సేవ: ఎక్కువ పరిచర్య చేసేలా ఆసక్తి మనల్ని కదిలిస్తుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎక్కువమంది సహాయ పయినీరు సేవ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్లకు 30 గంటలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ ఆరాధన లేదా వ్యక్తిగత అధ్యయనం చేస్తున్నప్పుడు దీని గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. (సామె. 15:22) ప్రచార కార్యక్రమంలో మీ ఆసక్తిని చూసినప్పుడు, ఉత్సాహంగా అందులో పాల్గొనాలనే ప్రేరణ ఇతరుల్లో కూడా కలుగుతుంది. ఎక్కువ గంటలు పరిచర్య చేయడానికి సర్దుబాట్లు చేసుకుంటే యేసుకు ఉన్న ఆసక్తినే మీరూ చూపించినట్లు అవుతుంది.—మార్కు 6:31-34.
4. యెహోవాకు, యేసుకు ఉన్న ఆసక్తిని మనం చూపిస్తే వచ్చే ప్రయోజనాలు ఏమిటి?
4 ఈ జ్ఞాపకార్థ సమయంలో యెహోవాకు, యేసుకు ఉన్న ఆసక్తిని మనం కూడా చూపిస్తే గొప్ప ఆశీర్వాదాలు పొందుతాం. మన ప్రాంతంలో ఉన్న చాలామందికి సాక్ష్యమిస్తాం. యెహోవాను సేవించడంలో, ఇతరులకు ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని, సంతృప్తిని మనం ఆస్వాదిస్తాం. (అపొ. 20:35) మరిముఖ్యంగా, ఆసక్తిగల మన దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి సంతోషపెడతాం.