ఫిబ్రవరి 16తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 16తో మొదలయ్యే వారం
పాట 15, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: న్యాయాధిపతులు 15-18 (8 నిమి.)
నం. 1: న్యాయాధిపతులు 16:13-24 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: బైబిలు సందేశం ఏమిటి?—igw 8వ పేజీ, 1-4 పేరాలు (5 నిమి.)
నం. 3: అపొల్లో—అంశం: వినయం, చక్కగా మాట్లాడే సామర్థ్యం, ఉత్సాహం గలవాడు—అపొ 18:24-28; 1 కొరిం 1:10-12; 16:12 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘సత్క్రియలయందు ఆసక్తి’ కలిగి ఉండండి!—తీతు 2:14.
15 నిమి: సువార్తను ఆసక్తిగా ప్రకటించడానికి సిద్ధపడండి. చర్చ. పరిచర్య కోసం సిద్ధపడుతున్నప్పుడు మొదట యెహోవాకు ప్రార్థించడం ఎందుకు ప్రాముఖ్యం? (కీర్త 143:10; అపొ. 4:31) ప్రార్థనతో పాటు ఇంకా ఏమి అవసరం? (ఎజ్రా 7:10) అలా ఆధ్యాత్మికంగా సిద్ధపడిన తర్వాత ప్రచురణలను, పరిచర్య బ్యాగును ఎలా సర్దుకోవాలి? అలా చక్కగా సిద్ధపడి ఉండడం మనమీద ఎలాంటి మంచి ప్రభావం చూపిస్తుంది? (కావలికోట జూలై 15, 2008 సంచిక 10వ పేజీ, 9వ పేరా చూడండి.) పరిచర్యకు మీరెలా సిద్ధపడతారు? ఒక ప్రచారకునితో ప్రదర్శన చేయించండి. తాను ఉపయోగించనున్న కరపత్రాలు, పత్రికలు లేదా బ్రోషుర్లను సమీక్షిస్తూ పరిచర్యకు ఎలా సిద్ధపడుతున్నాడో చూపించండి. తర్వాత, అన్నీ చక్కగా బ్యాగులో పెట్టుకుంటాడు, తన మొబైల్ లేదా టాబ్లెట్లో వీడియో ప్లే చేయడానికి సిద్ధంగా ఉండేలా చూసుకుంటాడు. పరిచర్యకు వెళ్తున్నప్పుడు అందరం చక్కగా సిద్ధపడి ఉండాలని నొక్కిచెప్పండి. (2 తిమో. 3:16, 17)
15 నిమి: “యెహోవాకు, యేసుకు ఉన్న ఆసక్తిని ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మీరూ చూపిస్తారా?” ప్రశ్నాజవాబులు. ప్రతి ఒక్కరికీ జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రం ఇచ్చి, దానిలోని విషయాలు చర్చించండి. 4వ పేజీలో ఉన్న నమూనా ఉపయోగిస్తూ ఒక చిన్న ప్రదర్శన చేయించండి.
పాట 30, ప్రార్థన