పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం —ఇంటివాళ్లు కోప్పడితే ఏంచేయాలి?
ఎందుకు ప్రాముఖ్యం? మనం పరిచర్యలో కలిసే చాలామంది మర్యాదగానే మాట్లాడతారు. అయితే, కొంతమంది మనల్ని ద్వేషిస్తారని యేసు ముందే చెప్పాడు. (యోహా. 17:14) కాబట్టి, పరిచర్యలో ఎవరైనా కోప్పడితే మనం ఆశ్చర్యపోకూడదు. అలాంటప్పుడు, మనం యెహోవా ప్రతినిధులం కాబట్టి ఆయనకు నచ్చేలా ప్రవర్తించాలి. (రోమా. 12:17-21; 1 పేతు. 3:15) దానివల్ల కొన్నిసార్లు వాళ్ల కోపం తగ్గవచ్చు. అంతేకాదు అది ఇంటివాళ్లకు, చూసేవాళ్లకు మంచి సాక్ష్యమిస్తుంది. ఈసారి యెహోవాసాక్షులు వచ్చినప్పుడు వాళ్లు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.—2 కొరిం. 6:3.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
ఇదెలా చేయవచ్చో మీ కుటుంబ ఆరాధనలో ప్రాక్టీసు చేయండి.
కోప్పడిన ఇంటివాళ్లతో మాట్లాడి వస్తున్నప్పుడు, ఎలా మాట్లాడి ఉంటే బాగుండేదో మీ తోటి ప్రచారకునితో చర్చించండి.