జనవరి 12తో మొదలయ్యే వారపు పట్టిక
జనవరి 12తో మొదలయ్యే వారం
పాట 42, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
jl 14-16 పాఠాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహోషువ 21-24 (8 నిమి.)
నం. 1: యెహోషువ 24:14–21 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: రాజైన ఆహాజు—అంశం: విగ్రహారాధన చేస్తే దేవుని అనుగ్రహం కోల్పోతాం —2 రాజు 16:3-6, 10-16, 20; 2 దిన 28:5-15, 17-19 (5 నిమి.)
నం. 3: యెహోవా సర్వశక్తిగల సృష్టికర్త —igw 2వ పేజీ, 4వ పేరా–3వ పేజీ, 1వ పేరా (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘పూర్ణమైన వినయంతో ప్రభువును సేవించండి.’—అపొ. 20:19.
10 నిమి: పూర్ణమైన వినయంతో ప్రభువును సేవించండి. చర్చ. అపొస్తలుల కార్యములు 20:19 చదవండి. తర్వాత ఈ ప్రశ్నలు అడిగి వ్యాఖ్యానించమనండి: (1) ‘సేవచేయడం’ అనే పదం ఏమి సూచిస్తుంది? (2) మనం ఏయే విధల్లో ప్రభువుకు సేవచేయవచ్చు? (3) వినయం అంటే ఏమిటి? (4) చక్కగా పరిచర్య చేయడానికి వినయం ఎలా సహాయం చేస్తుంది?
20 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఇంటివాళ్లు కోప్పడితే ఏంచేయాలి?” చర్చ. ఆర్టికల్ చర్చించిన తర్వాత, సాధారణంగా ఎదురయ్యే పరిస్థితిని చూపించే రెండు భాగాల ప్రదర్శన చేయించండి. మొదట, ఇంటాయన కోప్పడినప్పుడు ప్రచారకుడు స్పందించే తీరు అంత బావుండదు. తర్వాత, అదే ప్రచారకుడు నైపుణ్యంతో స్పందిస్తాడు. “ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి” కింద ఉన్న సూచనలు పాటించమని అందర్నీ ప్రోత్సహించండి.
పాట 39, ప్రార్థన