జూలై 21తో మొదలయ్యే వారపు పట్టిక
జూలై 21తో మొదలయ్యే వారం
పాట 27, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 7వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లేవీయకాండము 25-27 (10 నిమి.)
నం. 1: లేవీయకాండము 26:1-17 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: భూమి పట్ల దేవుని సంకల్పం —td 25ఎ (5 నిమి.)
నం. 3: యోసేపు చెరసాలలో వేయబడడం —my 22వ కథ (5 నిమి.)
సేవా కూటం:
10 నిమి: “ప్రజలందరినీ సమావేశపర్చు.” ప్రశ్నాజవాబులు.
10 నిమి: “ఒక ప్రత్యేక ఆహ్వానం.” ప్రశ్నాజవాబులు. ఆహ్వానపత్రాలు అందుబాటులో ఉంటే, హాజరైన వాళ్లందరికీ తలా ఒక ఆహ్వానపత్రం ఇచ్చి దానిలోని సమాచారాన్ని చర్చించండి. ప్రచార కార్యక్రమం ఎప్పుడు మొదలౌతుందో సంఘానికి తెలియజేసి, క్షేత్రాన్ని పూర్తిచేయడానికి స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారో క్లుప్తంగా చెప్పండి. చిన్న ప్రదర్శన చేయించండి.
10 నిమి: “అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండండి.” ప్రశ్నాజవాబులు. “2014 సమావేశ జ్ఞాపికలు” నుండి మీ సంఘానికి అన్వయించే అంశాలనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరౌతున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ ఆగస్టు 3, 2013 తేదీతో సంఘాలకు పంపిన ఉత్తరంలోని సమాచారాన్నీ చర్చించండి.
పాట 43, ప్రార్థన