కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/13 పేజీ 2
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • క్రైస్తవ స్త్రీలు తలపై ఎప్పుడు ముసుగు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి?
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఇంటిగుమ్మం దగ్గర, టెలిఫోన్‌లో ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించండి
    మన రాజ్య పరిచర్య—2006
  • ఇంటి గుమ్మం దగ్గర, టెలిఫోన్‌ ద్వారా బైబిలు అధ్యయనాలను ప్రారంభించడం
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2013
km 11/13 పేజీ 2

ప్రశ్నాభాగం

◼ తోటి ప్రచారకునితో కలిసి ఒక ప్రచారకురాలు ఇంటి గుమ్మం దగ్గర బైబిలు అధ్యయనం నిర్వహిస్తుంటే ఆమె ముసుగు వేసుకోవాలా?

ఒక ప్రచారకురాలు క్రమంగా జరుగుతున్న బైబిలు అధ్యయనాన్ని నిర్వహిస్తున్నప్పుడు, పక్కనే ప్రచారకుడు ఉంటే ఆమె ముసుగు వేసుకోవాలి. (1 కొరిం. 11:3-10) కావలికోట జూలై 15, 2002 సంచిక 27వ పేజీలో ఇలా ఉంది: “అది ముందుగానే నిర్ణయించుకోబడిన బోధనా కార్యక్రమం, దానికి అధ్యయనం నిర్వహించే వ్యక్తే అధ్యక్షత వహిస్తారు. ఈ పరిస్థితుల్లో, ఆ అధ్యయనం సంఘానికి సంబంధించినదవుతుంది. అలాంటి అధ్యయనాన్ని బాప్తిస్మం పొందిన ఒక స్త్రీ బాప్తిస్మం పొందిన ఒక పురుషుని సమక్షంలో నిర్వహిస్తున్నట్లైతే, ఆమె తన తలమీద ముసుగు వేసుకోవడం సముచితమే.” అధ్యయనం ఇంట్లో చేసినా, ఇంటి గుమ్మం దగ్గర చేసినా, వేరే ఏ స్థలంలో చేసినా అలాగే చేయాలి.

ఒకవేళ, ఇంకా క్రమమైన బైబిలు అధ్యయనంగా మారని అధ్యయనాన్ని ఒక సహోదరి ఇంటి గుమ్మం దగ్గరే నిర్వహిస్తుంటే, పక్కన ప్రచారకుడు ఉన్నా ఆమె ముసుగు వేసుకోనవసరం లేదు. ఆ పునర్దర్శనం ఉద్దేశం, బైబిలు అధ్యయనం ఎలా జరుగుతుందో చూపించడం లేదా అధ్యయనం నిర్వహించడానికి ఉపయోగించే ప్రచురణలోని సమాచారాన్ని పరిశీలించడం అయినా సరే ఆమె ముసుగు వేసుకోనవసరం లేదు. సాధారణంగా ఇంటి గుమ్మం దగ్గర జరిగే అధ్యయనాలు క్రమమైన బైబిలు అధ్యయనాలుగా మారాలంటే ఇంటివాళ్ల ఆసక్తిని పెంచేలా ఎన్నోసార్లు పునర్దర్శనం చేయాల్సివుంటుంది, కాబట్టి ముసుగు వేసుకోవడం ఎప్పుడు మొదలుపెట్టాలనేది ప్రచారకులు పరిస్థితులను గమనించి, ఆచితూచి నిర్ణయించుకోవాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి