“నేను ఎందుకు వచ్చానంటే . . . ”
పరిచర్య చేస్తున్నప్పుడు, ఇంటివాళ్లు తలుపు తెరిచి మనల్ని చూడగానే, మనం ఎవరం? ఎందుకు వచ్చాం? అని కంగారుపడుతుంటారు. వాళ్ల కంగారు తగ్గించడానికి మనమేమి చెప్పవచ్చు? వాళ్లను మామూలుగా పలకరించిన తర్వాత కొందరు ప్రచారకులు, “నేను ఎందుకు వచ్చానంటే” అంటూ వివరించడం మొదలుపెడతారు. ఉదాహరణకు వాళ్లు ఇలా అనవచ్చు: “నేను ఎందుకు వచ్చానంటే . . . నేడు చాలామంది, పెరుగుతున్న నేరాల గురించి ఆందోళనపడుతున్నారు. ఈ విషయంలో . . . ” లేదా ఇంటివాళ్లకు బైబిలు మీద నమ్మకం ఉంటే ఇలా అనవచ్చు: “నేను ఎందుకు వచ్చానంటే . . . ప్రజలకు ఉచితంగా బైబిలు గురించి నేర్పిస్తున్నాను.” మీరు ఎందుకు వచ్చారో వెంటనే చెబితే మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినడానికి వాళ్లు సుముఖంగా ఉంటారు. మనం ఔచిత్యంతో ఇంటివాళ్లను పరిచయం చేసుకుంటే వాళ్లలోని ప్రతికూల అభిప్రాయాలను పోగొట్టి, వాళ్ల అవధానాన్ని మన సందేశంవైపు మళ్లించగలుగుతాం.