కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/13 పేజీ 2
  • ఇది ఎవరికి నచ్చుతుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇది ఎవరికి నచ్చుతుంది?
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన పత్రికల్ని బాగా ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—1996
  • మీ పరిచర్యలో పత్రికలను ప్రతిపాదించండి
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికలందించుటకు సమయాన్ని కేటాయించండి
    మన రాజ్య పరిచర్య—1993
  • ప్రజల ప్రత్యేక ఆసక్తులను ఆకట్టుకొనే శీర్షికల్ని ఎంపికచేసుకోండి
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2013
km 5/13 పేజీ 2

ఇది ఎవరికి నచ్చుతుంది?

1. కావలికోట, అవేక్‌! (ఆంగ్లం) పత్రికలు చదివేటప్పుడు ఏ విషయం మనసులో పెట్టుకోవాలి? ఎందుకు?

1 కావలికోట, అవేక్‌! (ఆంగ్లం) పత్రికలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. అందువల్ల, వాటిలోని ఆర్టికల్స్‌లో చాలా రకాలైన అంశాలు ఉంటాయి. మనం మన ప్రతిలోని ఒక్కో ఆర్టికల్‌ చదువుతూ అది ఎవరికి ఆసక్తికరంగా ఉంటుందో ఆలోచించి, అలాంటివాళ్లకు పత్రికను అందించడానికి కృషి చేయాలి.

2. మన పత్రికల్లో వచ్చే ఎలాంటి అంశాలు ఇతరులకు ప్రత్యేకంగా ఆసక్తికరంగా ఉండవచ్చు?

2 మీ తోటి ఉద్యోగితో గతంలో చర్చించిన ఏదైనా బైబిలు అంశం, తాజా కావలికోట సంచికలో వచ్చిందా? కుటుంబ జీవితానికి సంబంధించి మీ బంధువుకు సహాయపడే ఆర్టికల్‌ ఏదైనా ఉందా? మీ క్షేత్రంలో ఒకానొక వృత్తిలో ఉన్నవాళ్లకు లేదా కొన్ని ప్రభుత్వ సంస్థల్లోని వాళ్లకు ఉపయోగపడే సమాచారం ఆ సంచికలో ఉందా? ఉదాహరణకు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన సంచికలను, వృద్ధాశ్రమాల్లో ఉండేవాళ్లు ఎక్కువగా ఇష్టపడవచ్చు. చట్టపరమైన సంస్థల్లోని వాళ్లైతే, నేరాలకు సంబంధించిన అంశాలు ఉండే పత్రికలు చదవడానికి ఆసక్తి చూపించవచ్చు.

3. కొందరు ఇష్టపడే అవకాశమున్న అంశాలుగల పత్రికలను వాళ్లకు అందించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చూపించే అనుభవాన్ని చెప్పండి.

3 ఫలితాలు: “పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?” అనే అంశంతో వచ్చిన 2011, అక్టోబరు అవేక్‌! సంచిక (ఇది తెలుగులో బ్రోషుర్‌ రూపంలో వచ్చింది) అందుకున్న తర్వాత తమిళనాడులోని ఒక సంఘం, గతంలో సమస్యలు తలెత్తిన కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఈ సంచికను అందించాలని నిర్ణయించుకుంది. సహోదరులు అక్కడి కుటుంబాలను సందర్శించి “పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా పెంచడానికి సంబంధించిన అవేక్‌! ప్రత్యేక సంచికను అందిస్తున్నాం” అని చెప్పారు. మొదటిరోజే 200 ప్రతులను అందించారు. గడిచిన ఆరు సంవత్సరాలుగా ప్రకటనా పని జరగని చాలా ప్రాంతాలను కేవలం రెండు నెలల్లోనే పూర్తిచేసి, 600 కన్నా ఎక్కువ ప్రతులను అందించారు.

4. మనం పత్రికలను వీలైనంత ఎక్కువమందికి అందించాలని ఎందుకు కోరుకుంటాం?

4 మన పత్రికలు ప్రస్తుతం లోకంలో జరుగుతున్న సంఘటనలకు కారణాల్ని, అర్థాన్ని వివరిస్తాయి; ప్రజల అవధానాన్ని బైబిలుపైకి, దేవుని రాజ్యంపైకి మళ్లిస్తాయి. ఈ భూమ్మీద మన పత్రికలు మాత్రమే “రక్షణ సమాచారం” ప్రకటిస్తున్నాయి. (యెష. 52:7) అందుకే వాటిని వీలైనంత ఎక్కువమందికి అందించాలని మనం కోరుకుంటాం. మనం పత్రిక చదువుతున్నప్పుడు, “ఇది ఎవరికి నచ్చుతుంది?” అని ఆలోచిస్తే అలా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి