మే 20తో మొదలయ్యే వారపు పట్టిక
మే 20తో మొదలయ్యే వారం
పాట 6, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 12వ అధ్యా., 9-15 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యోహాను 8-11 (10 నిమి.)
నం. 1: యోహాను 8:12-30 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: అబద్ధ బోధకుల నుండి మనల్ని మనం కాపాడు కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?—రోమా. 16:17; 2 యోహా. 9-11 (5 నిమి.)
నం. 3: బందీగావున్న ఓ ప్రవక్త భవిష్యత్తులో జరగబోయేవాటిని చూశాడు—bm 18వ పేజీ (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు—3వ భాగం. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 115వ పేజీలోని చివరి పేరా నుండి 116 పేజీలోని చివరి పేరా వరకున్న సమాచారం ఆధారంగా చర్చ. రాజ్యమందిర నిర్మాణ పనిలో పాల్గొన్న ఒక ప్రచారకుణ్ణి/రాలిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.
10 నిమి: కరపత్రాలు ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. సెప్టెంబరు 2000, మన రాజ్య పరిచర్య 8వ పేజీలోని ఆర్టికల్ ఆధారంగా చర్చ. రకరకాల కరపత్రాలను దగ్గర పెట్టుకుని, ఇంటివాళ్లకు వాటన్నిటినీ చూపించమని ప్రచారకులను ప్రోత్సహించండి. అవకాశం దొరికినప్పుడల్లా సాక్షమిచ్చేలా ప్రచారకులు అన్నిరకాల కరపత్రాలను ఎల్లప్పుడూ తమ దగ్గర పెట్టుకోవచ్చు. (km 8/10 5వ పేజీ) బైబిలు విద్యార్థులు చదువుకోవడానికి, లేదా తాము నేర్చుకునే బైబిలు సత్యాలను ఆసక్తిగలవాళ్లతో పంచుకోవడానికి ఉపయోగించేలా రకరకాల కరపత్రాలను వాళ్లకు ఇవ్వవచ్చు.
10 నిమి: “ఇది ఎవరికి నచ్చుతుంది?” ప్రశ్నాజవాబులు. మన పత్రికల్లో వచ్చిన ఏదైనా ఆర్టికల్ ఏ వృత్తుల్లో ఉన్నవాళ్లకు లేదా ఏ ప్రభుత్వ సంస్థల్లోని వాళ్లకు ఆసక్తికరంగా ఉండవచ్చో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 47, ప్రార్థన