మే 27తో మొదలయ్యే వారపు పట్టిక
మే 27తో మొదలయ్యే వారం
పాట 1, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 12వ అధ్యా., 16-21 పేరాలు, 127వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యోహాను 12-16 (10 నిమి.)
నం. 1: యోహాను 12:20-36 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మెస్సీయ రాక —bm 19వ పేజీ (5 నిమి.)
నం. 3: యిహోవా “సమాధానకర్తయగు దేవుడు” అని పిలవబడడం ఎందుకు సముచితం?— రోమా. 15:33 (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: నాటిన విత్తనాలకు నీళ్లు పోయాలి. (1 కొరిం. 3:6-9) కింది ప్రశ్నల ఆధారంగా చర్చ: (1) పునర్దర్శనాలకు సంబంధించి ఏ విషయం మీకు బాగా నచ్చుతుంది? (2) పునర్దర్శనాలు చేయడం కొంతమందికి ఎందుకు కష్టంగా ఉంటుంది? (3) ఆ సవాళ్లను ఎలా అధిగమించవచ్చు? (4) పునర్దర్శనాలు చేయడం కష్టంగా అనిపిస్తుంటే మనం సహాయాన్ని ఎలా పొందవచ్చు? (5) ఎవరెవరు ఆసక్తి చూపించారో, వాళ్లతో ఏ విషయం గురించి మాట్లాడారో, ఏ ప్రచురణ ఇచ్చారో గుర్తుపెట్టుకోవడానికి మీరు ఏం చేస్తారు? (6) పునర్దర్శనాలకు మీరెలా సిద్ధపడతారు? (7) పునర్దర్శనాల కోసం ప్రతీ వారం కొంత సమయం కేటాయించడం ఎందుకు మంచిది?
15 నిమి: “వీడియోలు ఉపయోగిస్తూ బోధించండి.” చర్చ. యెహోవాసాక్షులు అవడానికి ముందు మన వీడియోలు చూసి ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 10, ప్రార్థన