కావలికోటలో క్రమంగా రానున్న ఓ కొత్త ఆర్టికల్
మనం ప్రతీనెల మొదటి శనివారం బైబిలు అధ్యయనం మొదలు పెట్టడానికి, కావలికోట సార్వజనిక ప్రతిలోని “దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి” అనే ఆర్టికల్‌ను ఉపయోగిస్తూ వచ్చాం. అయితే జనవరి మొదలుకొని దాని స్థానంలో “ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు” అనే ఆర్టికల్ వస్తుంది, ఇది సంచిక చివరి పేజీలో ఉంటుంది. మనం పరిచర్యలో “దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి” ఆర్టికల్‌ను ఉపయోగించినట్లే, “ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు” ఆర్టికల్‌ను కూడా ఉపయోగిస్తాం. (km 06/11 2వ పేజీ) నెలలో మొదటి శనివారం పరిచర్యలో దీన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే సలహాలు ఎప్పటిలాగే మన రాజ్య పరిచర్య సంచికల్లో వస్తాయి.