జనవరి 7తో మొదలయ్యే వారపు పట్టిక
జనవరి 7తో మొదలయ్యే వారం
పాట 34, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 5వ అధ్యా., 18-21 పేరాలు, 55వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మత్తయి 1-6 (10 నిమి.)
నం. 1: మత్తయి 5:21-32 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: బైబిల్లోని విషయాలు ఎందుకు తెలుసుకోవాలి?—bm 3వ పేజీ (5 నిమి.)
నం. 3: యెహోవాను మన ‘స్వాస్థ్యంగా’ చేసుకోవడం అంటే ఏమిటి?—సంఖ్యా. 18:20 (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: జనవరిలో పత్రిక ఇవ్వడానికి సలహాలు. చర్చ. జనవరి - మార్చి కావలికోట సంచిక మీ ప్రాంతంలోని ప్రజలకు ఎందుకు ఆసక్తికరంగా ఉంటుందో 30 నుండి 60 సెకన్లు వివరించండి. తర్వాత, ముఖపత్ర శీర్షిక గురించి మాట్లాడుతూ, ఇంటివారిలో ఆసక్తి రేకెత్తించడానికి ఏ ప్రశ్న అడిగితే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా అందించాలో ప్రదర్శింపజేయండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: పరిశుభ్రంగా ఉండే రాజ్యమందిరం యెహోవాను ఘనపరుస్తుంది. ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. యెహోవా పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలు భౌతిక పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. (నిర్గ. 30:17-21; 40:30-32). మన ఆరాధనా స్థలాన్ని పరిశుభ్రంగా, మంచి స్థితిలో ఉంచినప్పుడు మనం యెహోవాను మహిమపరుస్తాం. (1 పేతు. 2:12) చక్కగా ఉండే రాజ్యమందిరం సమాజానికి మంచి సాక్ష్యంగా ఎలా నిలుస్తుందో చూపించే ఒక స్థానిక అనుభవాన్ని లేదా మన ప్రచురణల్లో వచ్చిన అనుభవాన్ని చెప్పండి. రాజ్యమందిర పరిశుభ్రతను, నిర్వహణను పర్యవేక్షించే సహోదరుణ్ణి ఇంటర్వ్యూ చేసి స్థానికంగా ఉన్న ఏర్పాట్ల గురించి అడగండి. రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఉంచేందుకు సహకరించమని అందరినీ ప్రోత్సహించండి.
పాట 13, ప్రార్థన