దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2012 డిసెంబరు 31తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీ ప్రశ్న చివర్లో, దాన్ని చర్చించబోయే తేదీ ఉంది. మీరు ప్రతీ వారం పాఠశాలకు సిద్ధపడేటప్పుడు దాని గురించి కూడా పరిశోధన చేయవచ్చు.
1. పురుగుల దాడి గురించి యోవేలు 2:1-10, 28లోని ప్రవచనం ఎలా నెరవేరింది? [నవం. 5, w07 10/1 13వ పేజీ, 1వ పేరా]
2. ఆమోసు 9:7-10లో ఇశ్రాయేలీయుల నుండి మనం ఏ పాఠం నేర్చుకుంటాం? [నవం. 12, w07 10/1 15వ పేజీ, 5వ పేరా]
3. ఎదోమీయుల గర్వహృదయానికి ఏది కారణమై ఉండవచ్చు, మనం ఏ వాస్తవాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు? (ఓబ. 3, 4) [నవం. 19, w07 11/1 14వ పేజీ, 1వ పేరా]
4. నీనెవె వాసులకు తాను చేస్తానని చెప్పిన కీడు విషయంలో యెహోవా ఏ విధంగా పశ్చాత్తాపం చూపించాడు? (యోనా 3:8, 10) [నవం. 19, w07 11/1 15వ పేజీ, 2వ పేరా]
5. యెహోవా నామం స్మరిస్తూ నడుచుకోవడమంటే ఏమిటి? (మీకా 4:5) [నవం. 26, w03 8/15 18వ పేజీ, 19వ పేరా]
6. ఏ “నదుల దగ్గరనున్నగుమ్మములు” తెరువబడ్డాయి? (నహూ. 2:6) [డిసెం. 3, w07 11/15 9వ పేజీ, 2వ పేరా]
7. హగ్గయి 1:6 వచనానికున్న అర్థం ఏమిటి, దాన్నుండి మనం ఏ పాఠం నేర్చుకోవాలి? [డిసెం. 10, w06 4/15 22వ పేజీ, 12-15 పేరాలు]
8. మన హృదయాల్లో ‘ఎవరికీ కీడుచేయ తలచకుండా’ ఉండమని జెకర్యా 7:10లో ఉన్న ఆచరణాత్మక సలహాను మనమెలా అన్వయించుకోవచ్చు? [డిసెం. 17, w07 12/1 11వ పేజీ, 3వ పేరా]
9. జెకర్యా 4:6, 7లోని మాటలు యెహోవా ఆరాధకులకు నేడు ఎందుకు ఓదార్పుకరంగా ఉన్నాయి? [డిసెం. 17, w07 12/1 11వ పేజీ, 1వ పేరా]
10. మలాకీ 3:16లో ఉన్నట్లుగా దేవునిపట్ల మన యథార్థతను కాపాడుకోవాలనే మన నిశ్చయత ఎందుకు ఎన్నడూ బలహీనం కాకుండా చూసుకోవాలి? [డిసెం. 31, w07 12/15 29వ పేజీ, 3వ పేరా]