‘దేవుని నామం పరిశుద్ధపర్చబడు గాక’
1. 2012 సేవా సంవత్సరంలో జరగబోయే ప్రాంతీయ సమావేశ కార్యక్రమ ముఖ్యాంశం ఏమిటి? అది దేని మీద ఆధారపడింది?
1 విశ్వ సర్వాధిపతియైన యెహోవా పేరు ధరించే గొప్ప అవకాశం మనకు దొరికింది. యెహోవాయే మనకు ఆ పేరు పెట్టాడు. ముఖ్యంగా 1931 నుండి యెహోవాసాక్షులముగా మనం ఆయన విశిష్టమైన పేరుతో గుర్తించబడుతున్నాం. (యెష. 43:10) దేవుని అద్వితీయ కుమారుడైన యేసు, దేవుని పేరును చాలా ఉన్నతంగా ఎంచాడు, మాదిరి ప్రార్థనలో దానికి మొదటి స్థానమిచ్చాడు. (మత్త. 6:9) 2012 సేవా సంవత్సరంలో జరగబోయే ప్రాంతీయ సమావేశ కార్యక్రమ ముఖ్యాంశం, “దేవుని నామం పరిశుద్ధపర్చబడు గాక.” అది యేసు చెప్పిన మాటల మీద ఆధారపడింది.
2. సమావేశంలో మనం ఏమి వినబోతున్నాం?
2 మనం ఏమి వింటాం: శనివారం, “పూర్తికాల సేవకులుగా దేవుని పేరు తెలియజేయండి” అనే ప్రసంగం ఉంటుంది, దానిలో పూర్తికాల సేవ జీవితంలో సంతృప్తినిస్తుందని ఎందుకు చెప్పవచ్చో చర్చించబడుతుంది. “యెహోవా పేరుకు అపకీర్తి తేకుండా జాగ్రత్తపడండి” అనే గోష్ఠి, మనకు ఎదురవ్వగల నాలుగు ఉరులలో చిక్కుకోకుండా తప్పించుకోవడానికి సహాయపడుతుంది. “దేవుని పేరు ఎందుకు పరిశుద్ధపర్చబడాలి?” అనే ప్రసంగంలో, ప్రజలు అంతగా ఆసక్తి చూపించకపోయినా మనం ఉత్సాహంగా ఎలా ప్రకటించవచ్చు? మన పరిచర్యను సమర్థవంతంగా ఎలా చేయవచ్చు? వంటి ప్రశ్నలకు జవాబులు చూస్తాం. మన ఆలోచనలతో, మాటలతో, నిర్ణయాలతో, ప్రవర్తనతో దేవుని పేరు ఎలా పరిశుద్ధపర్చవచ్చో ఆదివారం ఇవ్వబడే నాలుగు భాగాల గోష్ఠిలో చూస్తాం. “హార్మెగిద్దోనులో యెహోవా తన గొప్ప పేరు పరిశుద్ధపర్చుకుంటాడు” అనే బహిరంగ ప్రసంగం నుండి కొత్తవాళ్లు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు.
3. మనకు ఎలాంటి గొప్ప అవకాశముంది? ఈ సమావేశ కార్యక్రమం ఎలా సహాయం చేస్తుంది?
3 త్వరలో యెహోవా తన పేరు పరిశుద్ధపర్చుకోవడానికి చర్య తీసుకుంటాడు. (యెహె. 36:23) ఈలోగా, పవిత్రమైన యెహోవా పేరు ప్రతీకగావున్న వాటన్నిటికీ మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఈ ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, దేవుని పేరు ధరించడమనే గంభీరమైన బాధ్యతను నెరవేర్చడానికి మనలో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం.