కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/03 పేజీ 8
  • దైవిక నామం తెలియజేయడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవిక నామం తెలియజేయడం
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా తన పేరును ఘనపర్చుకోవడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • యెహోవా గొప్ప నామాన్ని ఘనపర్చండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • దేవుని పేరు
    తేజరిల్లు!—2017
  • దేవుని పేరేంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 6/03 పేజీ 8

దైవిక నామం తెలియజేయడం

1. దేవుని వ్యక్తిగత నామాన్ని తెలుసుకోవడం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపగలదు?

1 దేవుని నామాన్ని మొదటిసారిగా తెలుసుకున్నప్పుడు మీరెలా ప్రతిస్పందించారు? “బైబిలులో మొదటిసారిగా దేవుని నామం చూసినప్పుడు సంతోషంతో నాకళ్ళు చెమర్చాయి. దేవుని వ్యక్తిగత నామాన్ని తెలుసుకుని, దాన్ని ఉపయోగించవచ్చని గ్రహించినప్పుడు నేనెంతో చలించిపోయాను” అని చెప్పిన ఒక స్త్రీలాగే చాలామంది ప్రతిస్పందిస్తారు. యెహోవాను ఒక వ్యక్తిగా తెలుసుకొని ఆయనతో సత్సంబంధం కలిగివుండడానికి, దేవుని నామమెరుగుట ఆమెకు ఒక ప్రాముఖ్యమైన చర్యగా పనిచేసింది.

2. యెహోవాను గూర్చి మనమితరులకు బోధించడం ఎందుకు అత్యవసరం?

2 ఎందుకు తెలియజేయాలి? దేవుని నామం ఆయన లక్షణాలకు, సంకల్పాలకు, క్రియలకు ముడిపడి ఉంది. రక్షణకు కూడా దేవుని నామం ముడిపడి ఉంది. “ప్రభువు [“యెహోవా” NW] నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. ప్రజలు యెహోవాను గూర్చి మొదట తెలుసుకొని ఆయనయందు విశ్వసించకుండా “ఎట్లు ప్రార్థన చేయుదురు?” అని పౌలు తర్కించాడు. కాబట్టి, క్రైస్తవులు దేవుని నామాన్ని, అది ప్రాతినిధ్యం వహించే సమస్తాన్ని ఇతరులకు తెలియజేయడం అత్యవసరం. (రోమా. 10:13, 14) అయితే, దైవిక నామాన్ని తెలియజేయడానికి మరిగొప్ప కారణముంది.

3. మన ప్రకటనా పనికి ప్రధాన కారణమేమిటి?

3 దేవుని సర్వాధిపత్యం సత్యమని నిరూపించడానికి, ఆయన నామం పరిశుద్ధ పర్చబడడానికి సంబంధమున్న విశ్వ వివాదాంశాన్ని దేవుని ప్రజలు 1920లలో లేఖనాలనుండి గ్రహించారు. యెహోవా నామంపై వేయబడిన నింద తొలగింపబడేలా ఆయన దుష్టులను నాశనం చేయడానికి ముందు, ఆయనను గూర్చిన సత్యం “భూమియందంతట . . . తెలియబ[డాలి].” (యెష. 12:4, 5; యెహె. 38:23) అందువల్ల, బాహాటంగా యెహోవాను సన్నుతించి, సమస్త ప్రజలయెదుట ఆయన నామాన్ని ప్రతిష్ఠించడమే మన ప్రకటనా పనికి ప్రధాన కారణం. (హెబ్రీ. 13:15) దేవునియెడల, పొరుగు వారియెడల మనకున్న ప్రేమే దేవుడు ఆజ్ఞాపించిన ఈ సేవలో పూర్తిగా పాల్గొనడానికి మనల్ని పురికొల్పుతుంది.

4. యెహోవా నామంతో యెహోవాసాక్షులెలా గుర్తింపబడ్డారు?

4 “తన నామముకొరకు ఒక జనము”: మనం 1931లో యెహోవాసాక్షులనే పేరు స్వీకరించాం. (యెష. 43:10) అప్పటినుండి దేవుని ప్రజలు ఆ దైవిక నామాన్ని ఎంత విస్తృతంగా తెలియజేశారంటే దానినిగూర్చి ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకం 124వ పేజీలో ఇలావుంది: “అంతర్జాతీయంగా, యెహోవా నామాన్ని స్వేచ్ఛగా ఉపయోగించే ప్రతివ్యక్తి ఆ వెంటనే యెహోవాసాక్షిగా గుర్తింపబడతాడు.” మీరూ ఈ విధంగా గుర్తింపబడుతున్నారా? యెహోవా మంచితనం యెడల మనకున్న కృతజ్ఞత ఆయన నామాన్ని ‘సన్నుతించడానికి,’ సరియైన ప్రతి సందర్భంలో ఆయనను గూర్చి మాట్లాడ్డానికి మనల్ని పురికొల్పాలి.—కీర్త. 20:7; 145:1, 2, 7.

5. దేవుని నామం ధరించడంలో మన ప్రవర్తనెలా ఇమిడివుంది?

5 “తన నామముకొరకు ఒక జనము”గా, మనం ఆయన నియమాలకు కట్టుబడివుండాలి. (అపొ. 15:14; 2 తిమో. 2:19) ప్రజలు తరచు యెహోవాసాక్షుల్లో మొదట గమనించేది వారి మంచి ప్రవర్తననే. (1 పేతు. 2:12) దైవిక సూత్రాల్ని ఉల్లంఘించడం ద్వారా లేదా మన జీవితాల్లో ఆయన ఆరాధనను రెండవ స్థానంలోకి నెట్టివేయడం ద్వారా ఆయన నామానికి కళంకం తీసుకురావాలని మనమెన్నటికీ కోరుకోము. (లేవీ. 22:31, 32; మలా. 1:6-8, 12-14) బదులుగా, ఆయన నామం ధరించే ఆధిక్యతను మనం విలువైనదిగా ఎంచుతున్నామని మన జీవన విధానం చూపించాలి.

6. ఇప్పుడూ, ఎల్లకాలమూ మనమే ఆధిక్యతను కలిగియుండగలము?

6 “తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును” అని యెహోవా చేసిన ప్రకటన నేడు నెరవేరడం మనం చూస్తున్నాం. (మలా. 1:11) యెహోవాను గూర్చిన సత్యాన్ని మనం ఎడతెగక తెలియజేస్తూ, ‘ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదుము గాక.’—కీర్త. 145:21.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి