మీరు అక్టోబరులో ఒక బైబిలు అధ్యయనాన్ని మొదలుపెడతారా?
1. అక్టోబరులో మనమేమి ఇవ్వాలి?
1 అక్టోబరులో కావలికోట పత్రిక ఇవ్వాలి. ఆసక్తి చూపించిన వాళ్ల దగ్గరకు మళ్లీ వెళ్లి, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రంతో బైబిలు అధ్యయనం ప్రారంభించాలని మనం ప్రోత్సహించబడుతున్నాం. ఆసక్తివున్న వాళ్ల దగ్గరకు తిరిగి వెళ్లినప్పుడు మనం అది ఎలా చేయవచ్చు?
2. పత్రికలు తీసుకున్న వాళ్ల దగ్గరకు తిరిగి వెళ్లినప్పుడు బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
2 కరపత్రాన్ని ఎలా ఉపయోగించాలి? గృహస్థుని ఆసక్తి గమనించిన తర్వాత మనమిలా చెప్పవచ్చు, “నేను మీకిచ్చిన పత్రిక, బైబిలును పరిశీలించమని అన్ని నేపథ్యాల వాళ్లను, అన్ని మతస్థులను ప్రోత్సహిస్తుంది. [మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? కరపత్రాన్ని గృహస్థునికి ఇచ్చి, మొదటి పేజీలో ఉన్న ప్రశ్నలను చూపించండి.] ఇక్కడ కొన్ని ఆలోచన రేకెత్తిచ్చే ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. వీటికి బైబిలు సముచితమైన సమాధానాలనిస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్నల్లో వేటి గురించైనా అడిగారా? మీరు జవాబులు తెలుసుకోవాలనుకుంటున్నారా?” గృహస్థుడు మాట్లాడిన తర్వాత అతడు అడిగిన వాటిలో ఒక ప్రశ్నకు సమాధానాన్ని కరపత్రం నుండి పరిశీలించి, అక్కడ ఇవ్వబడిన లేఖనాల్లో ఒకదాన్ని చదవండి. బైబిలు బోధించే వాటిలో ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అని వివరించి, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని అతనికి ఇవ్వండి. ఆ తర్వాత విషయసూచిక నుండి అతను ఎంపిక చేసుకున్న అధ్యాయం ప్రారంభంలోవున్న పేరాలను చర్చించవచ్చు. లేదా కరపత్రం నుండి మనం చర్చించిన విషయం మీద ఇంకా ఎక్కువ సమాచారమున్న భాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మనం ఉపయోగించగల రెఫరెన్సులు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి:
• దేవునికి మనపై నిజంగా శ్రద్ధ ఉందా? (9-11 పేజీలు, 6-10 పేరాలు)
• యుద్ధాలు, బాధలు ఎప్పటికైనా లేకుండా పోతాయా? (12వ పేజీ, 12-13 పేరాలు)
• చనిపోయాక మనకేమవుతుంది? (59-60 పేజీలు, 7-8 పేరాలు)
• చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారా? (71వ పేజీ, 13-15 పేరాలు)
• మనమెలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు? (166-167 పేజీలు, 5-8 పేరాలు)
• మనమెలా సంతోషంగా ఉండవచ్చు? (9వ పేజీ, 4-5 పేరాలు)
3. మనం తిరిగి వెళ్లినప్పుడు, పరిస్థితులను బట్టి ఎలా వ్యవహరించాలి?
3 అయితే మొదటిసారి తిరిగి వెళ్లినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకం నుండి బైబిలు అధ్యయనం మొదలుపెట్టి, దాన్ని ఎలా చేయాలో చూపించే అవకాశం దొరకకపోతే, మరోసారి తిరిగి వెళ్లి చర్చ కొనసాగించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. గృహస్థుని ఆసక్తిని బట్టి, పుస్తకాన్ని పరిచయం చేసే ముందు, కొన్నిరోజుల వరకు కరపత్రంలోని ప్రశ్నల్లో ఒకదానికన్నా ఎక్కువే చర్చించాలని నిర్ణయించుకోవచ్చు. ముఖ్యంగా మనం, విభిన్న నేపథ్యాల వాళ్లతో లేఖనాలకు సంబంధించిన విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు యుక్తిగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సత్యం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్లతో అక్టోబరు నెలలో ఒక బైబిలు అధ్యయనం ప్రారంభించి, ‘సత్యం గ్రహించేందుకు’ వాళ్లకు సహాయం చేయడానికి ఈ కరపత్రాన్ని చక్కగా ఉపయోగిద్దాం.—యోహా. 8:31, 32.