సెప్టెంబరు 27తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
సెప్టెంబరు 27తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 12వ అధ్యా. 15-22 పేరాలు, 160వ పేజీలోవున్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 23-25
నం. 1: 2 రాజులు 23:1-7
నం. 2: వృద్ధాప్యంలో దేవునిచే విలువైన వారిగా ఎంచబడటం (fy 171, 172 పేజీలు, 23-25 పేరాలు)
నం. 3: నిజ క్రైస్తవులు ఏయే విధాలుగా తమ వెలుగును ప్రకాశింపజేయవచ్చు? (మత్త. 5:14-16)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: అక్టోబరు - డిసెంబరు కావలికోటను అందించడానికి సిద్ధపడండి. చర్చ. ఒకట్రెండు నిమిషాలు పత్రిక గురించి కొన్ని విషయాలు చెప్పండి. తర్వాత రెండుమూడు ఆర్టికల్స్‌ను ఎంపిక చేసుకుని వాటిని ఇవ్వడానికి ఏ ప్రశ్నలు వేస్తే బావుంటుందో, ఏ లేఖనాలు చూపిస్తే బావుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా పరిచయం చేయవచ్చో చూపించే ఒక ప్రదర్శనను చేయించండి.
15 నిమి: “మీరు అక్టోబరులో ఒక బైబిలు అధ్యయనాన్ని మొదలుపెడతారా?” ప్రశ్నాజవాబులు. ఒకట్రెండు ప్రదర్శనలు చేయించండి.