మీరు ఏవి ఎంపిక చేసుకునే అవకాశముందో మీకు తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా అనేక వైద్యశాలల్లో రక్తం ఎక్కించకుండా శస్త్రచికిత్సలు నిర్వహించబడుతున్నాయి. రక్తరహిత చికిత్సా రంగంలో మీరు ఎంపిక చేసుకోవడానికి అందుబాటులోవున్న వివిధ వైద్యవిధానాల గురించి మీకు పూర్తిగా తెలుసా? వైద్య చికిత్స, శస్త్రచికిత్సల విషయంలో జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం మీరు వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది (ఆంగ్లం) అనే వీడియోను చూడండి. ఆ తర్వాత, ఈ క్రింది ప్రశ్నల సహాయంతో మీ అవగాహనను పరీక్షించుకోండి. గమనిక: ఆ వీడియోలో శస్త్రచికిత్సకు సంబంధించిన క్లుప్త దృశ్యాలున్నాయి కాబట్టి, తల్లిదండ్రులు చిన్న పిల్లలతో కలిసి ఆ వీడియో చూసే విషయంలో వివేచనను ఉపయోగించాలి.
(1) యెహోవాసాక్షులు రక్తమార్పిడులను నిరాకరించడానికి ముఖ్య కారణమేమిటి? (2) వైద్యచికిత్స విషయంలో యెహోవాసాక్షులు ఏమి కోరుకుంటారు? (3) రోగులకు ఏ ప్రాథమిక హక్కువుంది? (4) మార్పిడి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఎందుకు సముచితమైనది, బాధ్యతాయుతమైనది? (5) రక్తం ఎక్కువగా నష్టపోతున్నప్పుడు వైద్యులు ముఖ్యంగా ఏ రెండు అత్యవసర చర్యలు తీసుకోవాలి? (6) మార్పిడి ప్రత్యామ్నాయ చికిత్సా విధానంలోవున్న నాలుగు సూత్రాలు ఏమిటి? (7) వైద్యులు ఎలా (ఎ) రక్తం నష్టపోవడాన్ని తగ్గించవచ్చు, (బి) ఎర్రరక్త కణాలను పొదుపు చేయవచ్చు, (సి) రక్తోత్పత్తిని పెంచవచ్చు, (డి) కోల్పోయిన రక్త పరిమాణాన్ని తిరిగి పెంచవచ్చు? (8) ఈ క్రింది వైద్యవిధానాలను వివరించండి: (ఎ) హిమోడైల్యూషన్ (బి) సెల్సాల్వేజ్. (9) ఏ విధమైన రక్తమార్పిడి ప్రత్యామ్నాయం గురించైనా మీకెలాంటి సమాచారం ఇవ్వబడాలని మీరు కోరుకుంటారు? (10) రక్తమార్పిడి లేకుండా సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసే అవకాశముందా? (11) వైద్య రంగంలోనే ఎలాంటి క్రొత్త అభివృద్ధి జరుగుతోంది?
వీడియోలో చూపించబడిన కొన్ని చికిత్సా విధానాలను అంగీకరించడం, ప్రతీ వ్యక్తి బైబిలు శిక్షిత మనస్సాక్షి ప్రకారం వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. మీరు, మీ పిల్లలు ఏ వైద్య చికిత్సలు లేదా పద్ధతులు అంగీకరించాలనే విషయంలో సరైన నిర్ణయం తీసుకుని, అడ్వాన్స్ హెల్త్‌కేర్ డైరెక్టివ్‌ను నింపారా? ఈ విషయాల గురించిన పూర్తి చర్చకోసం కావలికోట జూన్, 2004, అక్టోబరు 15, 2000 సంచికల్లోని “పాఠకుల ప్రశ్నలు” జాగ్రత్తగా పరిశీలించండి. ఆ తర్వాత నవంబరు 2006 మన రాజ్య పరిచర్య మధ్య పేజీల్లోవున్న ప్రశ్నాపత్రాలను, “రక్తంలోని సూక్ష్మభాగాలను, నా రక్తం ఇమిడివున్న వైద్యవిధానాలను నేనెలా దృష్టిస్తాను?” అనే భాగాన్ని ఉపయోగించి, మీరు వేటిని అంగీకరించడానికి వేటిని నిరాకరించడానికి ఎంపిక చేసుకుంటారనేది వ్యక్తిగతంగా నిర్ణయించుకోండి. చివరగా మీరు ఎంపిక చేసుకున్నవాటిని మీ అడ్వాన్స్ హెల్త్‌కేర్ డైరెక్టివ్‌లో స్పష్టంగా తెలియజేయండి. మీరు ఎంపిక చేసుకున్నవారికి (కాంటాక్టులకు), సాక్షులుకాని మీ కుటుంబ సభ్యులకు కూడా మీ నిర్ణయాల గురించి పూర్తిగా తెలియజేయాలి.
[3వ పేజీలోని బాక్సు]
• మీరు, మీ పిల్లలు ఏ వైద్య చికిత్సలు లేదా పద్ధతులు అంగీకరించాలనే విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారా?
• అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి వీలుగా మీరు పూర్తిచేసిన అడ్వాన్స్ హెల్త్‌కేర్ డైరెక్టివ్‌ను ఎల్లప్పుడూ మీ వెంట ఉంచుకుంటున్నారా?