కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/09 పేజీలు 3-4
  • మగవాళ్లకు సాక్షమివ్వడానికి కృషి చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మగవాళ్లకు సాక్షమివ్వడానికి కృషి చేయండి
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబ సభ్యులు సత్యంలో లేకపోయినా సంతోషంగా ఉండడం సాధ్యమే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • అవిశ్వాసియైన భర్త లేదా భార్య సత్యం తెలుసుకోవడానికి మీరు సహాయం చేయగలరా?
    మన రాజ్య పరిచర్య—2010
  • సత్యం “శాంతిని కాదు, కత్తిని” తీసుకొస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 9/09 పేజీలు 3-4

మగవాళ్లకు సాక్షమివ్వడానికి కృషి చేయండి

1. రాజ్యానికి సంబంధించిన పనుల విషయాల్లో ఏమి చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది?

1 రాజ్య సువార్త ప్రకటించే పని విస్తృతంగా జరుగుతున్న ఈ అంత్యదినాల్లో, ఆ పనిని నిర్దేశించడానికి ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన పురుషుల అవసరం ఎంతో ఉంది. (మార్కు 4:30-32; అపొ. 20:28; 1 తిమో. 3:1-13) అయితే, కొన్ని ప్రాంతాల్లో రాజ్య సువార్తకు స్త్రీలు స్పందించినంతగా పురుషులు స్పందించడంలేదు. కొన్ని సంస్కృతుల్లో, పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలు బోధించాల్సిన బాధ్యత తల్లులదే అని మగవాళ్లు అనుకుంటారు. తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించి, మనతోపాటు సత్యారాధనలో భాగం వహించమని ఇంకా ఎక్కువమంది మగవాళ్లను మనమెలా ప్రోత్సహించవచ్చు?

2. పౌలు, పేతురు పురుషులకు సాక్ష్యమివ్వడానికి కృషిచేసినప్పుడు ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయి?

2 మగవాళ్లకు సాక్ష్యమివ్వడంమీద దృష్టిపెట్టండి: కుటుంబంలో భర్త సత్యాన్ని అంగీకరిస్తే ఆయన తనతోపాటు సత్యారాధన చేయమని తన కుటుంబ సభ్యులను కూడా ప్రోత్సహిస్తాడు. ఉదాహరణకు, పౌలు సీల ప్రకటనా పని చేస్తున్నందుకు చెరసాలలో వేయబడినప్పుడు చెరసాల నాయకుడికి సాక్ష్యమిచ్చారు. దాని ఫలితంగా ఆయన, ఆయన కుటుంబం బాప్తిస్మం తీసుకున్నారు. (అపొ. 16:25-34) కొరింథులో పౌలు ప్రకటించినప్పుడు, “ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితో కూడ ప్రభువునందు విశ్వాసముంచెను.” (అపొ. 18:8) ‘భక్తిపరుడు, దేవునియందు భయభక్తులు గలవాడు’ అని పేరుపొందిన కొర్నేలీ అనే శతాధిపతికి సాక్ష్యమివ్వడానికి యెహోవా పేతురును పంపించాడు.—అపొ. 10:1-48.

3. ఫిలిప్పులాగే మీరూ అధికారంలోవున్న ఎవరికి సాక్ష్యమివ్వవచ్చు?

3 ‘అధికారంలో’ ఉన్న మగవాళ్లకు సాక్ష్యమిస్తే ఎంతో ప్రయోజనం ఉండవచ్చు. (1 తిమో. 2:1, 2) ఉదాహరణకు, యెహోవా దూత, ఐతియొపీయుల రాణి ధనాగారమంతటి మీద ‘మంత్రిగా ఉన్న’ వ్యక్తితో మాట్లాడమని ఫిలిప్పుతో చెప్పాడు. ఫిలిప్పు, ఆ వ్యక్తి ‘ప్రవక్తయైన యెషయా గ్రంథం చదవడం’ విని, యేసును గురించిన సువార్తను ఆయనకు వివరించాడు. దాని ఫలితంగా ఆ ఐతియోపీయుడు శిష్యుడయ్యాడు, ఆయన తన స్వదేశానికి తిరిగి వెళ్తున్నప్పుడు బహుశా ఈ సువార్తను ప్రకటించేవుంటాడు. అంతేకాదు సువార్తను వినే అవకాశం అంతగాలేని రాణికి, ఆమె సభలో ఉన్నవారికి కూడా ఆయన సాక్ష్యమిచ్చివుంటాడు.—అపొ. 8:26-39.

4. ఎక్కువమంది మగవాళ్లకు సువార్త ప్రకటించడానికి మనమేమి చేయాలి?

4 ఎక్కువమంది మగవాళ్లను ఎలా కలుసుకోవచ్చు? చాలామంది మగవాళ్లు ఉదయాన ఉద్యోగాలకు వెళతారు కాబట్టి, మీరు సాయంకాలాల్లో లేదా వారాంతాల్లో లేదా సెలవు రోజుల్లో ఎక్కువసేపు పరిచర్య చేయడానికి సర్దుబాట్లు చేసుకోగలరా? క్రమంగా వ్యాపార ప్రాంతాల్లో పరిచర్యచేస్తే, ఇంటివద్ద కలుసుకోలేని మగవాళ్లకు సాక్ష్యమిచ్చే ఎన్నో అవకాశాలు మీకు లభిస్తాయి. సహోదరులు తమ తోటి ఉద్యోగస్థులైన మగవాళ్లకు అనియత సాక్ష్యమిచ్చేందుకు ప్రత్యేకంగా కృషిచేయవచ్చు. ఇంటింటి పరిచర్యలో, ప్రత్యేకంగా తరచూ పనిచేసిన క్షేత్రంలో సహోదరులు కొన్నిసార్లు ఇంటి పెద్దతో మాట్లాడతామని అడగవచ్చు.

5. ఒక సహోదరి పరిచర్య చేస్తున్నప్పుడు ఒక గృహస్థుడు రాజ్య వర్తమానం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తే ఏమి చేయాలి?

5 ఒక సహోదరి పరిచర్య చేస్తున్నప్పుడు ఒక గృహస్థుడు సత్యం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తే ఆ సహోదరి ఆయన దగ్గరకు ఒంటరిగా తిరిగి వెళ్ళకూడదు. ఆమె తనతోపాటు తన భర్తనైనా లేదా మరో ప్రచారకుణ్ణయినా, ప్రచారకురాలినైనా తీసుకుని వెళ్ళవచ్చు. ఆసక్తి చూపించిన వ్యక్తి ప్రగతి సాధిస్తుంటే ఆయనతో బైబిలు అధ్యయనం చేసే బాధ్యతను సమర్థుడైన ఒక సహోదరునికి అప్పగించడం మంచిది.

6. ‘ఎక్కువమందిని సంపాదించుకోడానికి’ అపొస్తలుడైన పౌలులా మనమేమి చేయాలి?

6 మగవాళ్ళకు ఆసక్తికరంగా ఉండే అంశాలను ఎంపిక చేసుకోండి: అపొస్తలుడైన పౌలు ‘ఎక్కువమందిని సంపాదించుకోవడానికి’ తన ప్రేక్షకులను పరిగణలోకి తీసుకుని, తను చెప్పే విధానాన్ని మార్చుకున్నాడు. (1 కొరిం. 9:19-23) అలాగే మనం కూడా మనకు కలిసే మగవాళ్లకు ఏ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయో తెలుసుకుని తగినవిధంగా సిద్ధపడవచ్చు. ఉదాహరణకు, మగవాళ్లు తరుచూ ఆర్థిక సమస్యల గురించి, మంచి ప్రభుత్వం గురించి, తమ కుటుంబ భద్రత గురించి ఆలోచిస్తుంటారు. అంతేకాదు, జీవిత సంకల్పమేమిటి, భూమికేమి జరుగుతుంది, దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడు వంటి విషయాల్లో కూడా వాళ్లు ఆసక్తి కనబరుస్తుండవచ్చు. కాబట్టి, వాళ్లకు ఆసక్తికరమైన విషయాలను పరిగణలోకి తీసుకుని తగినవిధంగా మన చెప్పే విధానాన్ని మార్చుకుంటే వాళ్లు మన రాజ్య సందేశాన్ని వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.—సామె. 16:23.

7. కూటానికి వచ్చే సాక్షులుకాని భర్తలపై సంఘంలోని వారంతా ఎలా మంచి ప్రభావాన్ని చూపించవచ్చు?

7 సాక్షులుకాని భర్తలకు సహాయం చేయడానికి చొరవ తీసుకోండి: మన క్రైస్తవ సహోదరీల మంచి ప్రవర్తన సాక్షులుకాని వాళ్ల భర్తలమీద ఎంతో ప్రభావం చూపిస్తుంది, అయితే, సంఘ సభ్యులు కూడా వాళ్లపై మంచి ప్రభావం చూపించవచ్చు. (1 పేతు. 3:1-4) సాక్షికాని భర్త తన భార్యతో కలిసి కూటానికి వచ్చినప్పుడు, మన సహోదరులు సాదరంగా ఆహ్వానించడం ఆయనకు ఒక శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. ఆయన కూటానికి వచ్చాడంటే సత్యంపట్ల ఆయనకు కొంత ఆసక్తివుందని తెలుస్తుంది, ఆయన బైబిలు అధ్యయం చేయడానికి అంగీకరించే అవకాశం కూడా ఉంటుంది.

8. సత్యంపట్ల పెద్దగా ఆసక్తి చూపించని సాక్షులుకాని భర్తలకు సహాయం చేయడానికి మన సహోదరులు ఎలా చొరవ తీసుకోవచ్చు?

8 మరోవైపు, భర్తలు మొదట్లో బైబిలుపట్ల పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు, కానీ ఆ తర్వాత, వాళ్లకు సన్నిహితంగా అనిపించే ఒక సహోదరునితో బైబిలు గురించి చర్చించడానికి ఇష్టపడవచ్చు. ఒక సంఘంలోని సహోదరులు, మతపరంగా విభాగించబడివున్న ఒక కుటుంబాన్ని అప్పుడప్పుడు సందర్శించడానికి వెళ్లేవాళ్లు. అలా వెళ్లినప్పుడు సాక్షికాని భర్తకు ఆసక్తివున్న విషయాల గురించి ఆయనతో మాట్లాడానికి ప్రయత్నించేవాళ్లు. దానితో వాళ్లకు దేవుని గురించి మాట్లాడే అవకాశం దొరికింది. చివరకు ఆయన బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. ఒక సహోదరుడు స్నేహంగావుండే సాక్షికాని భర్తకు ఆయన ఇంటిచుట్టూ దడి కట్టడంలో సహాయం చేశాడు. ఇలా వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించినందుకు ఆయన బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించాడు. (గల. 6:10; ఫిలి. 2:4) మీరు ఒక క్రైస్తవ సహోదరుడైతే, సాక్షులుకాని ఒకరిద్దరు భర్తలతో మాట్లాడడానికి మీరెందుకు చొరవ తీసుకోకూడదు?

9. క్రైస్తవ సహోదరులకు శిక్షణనిస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయి?

9 క్రైస్తవ సహోదరులకు శిక్షణనివ్వండి: రాజ్య సందేశానికి స్పందించి, యెహోవా సేవలో బాధ్యతలు స్వీకరించడానికి అర్హులైన మగవాళ్ళు ‘మనుష్యుల్లో ఈవులు’ అవుతారు, అంటే యెహోవా ప్రజల సంఘాల కోసం తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించే క్రైస్తవ పెద్దలవుతారు. (ఎఫె. 4:8; కీర్త. 68:18) అలాంటి వాళ్ళు ఇష్టపూర్వకంగా, సిద్ధమనస్సుతో సంఘాన్ని కాస్తారు. (1 పేతు. 5:2, 3) వాళ్లు సహోదరులందరికీ ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా!

10. పౌలుకు సహాయం చేయడానికి అననీయ చేసిన ప్రయత్నంవల్ల ఎంతోమంది ఎలా ప్రయోజనం పొందుతున్నారు?

10 ఉదాహరణకు, ‘అన్యజనులకు అపొస్తలుడైన’ సౌలు ఒకప్పుడు క్రైస్తవులను హింసించాడు. (రోమా. 11:13, 14) అందుకే అననీయ సౌలుకు ప్రకటించడానికి మొదట్లో వెనకాడాడు. అయినా, ప్రభువు నిర్దేశం ప్రకారం అననీయ, ఆ తర్వాత అపొస్తలుడైన పౌలుగా మారిన ఆ పురుషునితో మాట్లాడాడు. సంవత్సరాలు గడుస్తుండగా పౌలు పరిచర్య మూలంగా, ఆయన ప్రకటించినదాన్ని విన్న వేలాదిమంది ప్రయోజనం పొందారు. అలాగే దేవుని వాక్యంలోవున్న ఆయన రాసిన ప్రేరేపిత పత్రికల నుండి లక్షలాదిమంది ప్రజలు ఇప్పటికీ ప్రయోజనం పొందుతున్నారు.—అపొ. 9:3-19; 2 తిమో. 3:16, 17.

11. మగవాళ్లకు సాక్ష్యమిచ్చేందుకు కృషి చేయడానికి అవసరమైన సర్దుబాట్లన్నీ మనమెందుకు చేసుకోవాలి?

11 కాబట్టి, మగవాళ్లకు సాక్ష్యమిచ్చేందుకు కృషి చేయడానికి అవసరమైన సర్దుబాట్లన్నీ చేసుకుందాం. మనమలా కృషిచేస్తున్నప్పుడు దేవుని చిత్తం చేయడానికీ, రాజ్యానికి సంబంధించిన పనుల విషయాల్లో శ్రద్ధ చూపించడానికీ మనం చేసే ప్రయత్నాలను యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి